AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్ పని పట్టిన తెలుగమ్మాయి..! 4 ఓవర్లలో కేవలం 7 పరుగులిచ్చి ఎన్ని వికెట్లు తీసిందంటే..?

మహిళల ఆసియా కప్‌ 2026లో పాకిస్థాన్‌పై భారత బౌలర్లు చెలరేగారు. దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ 55 పరుగుల కే కుప్పకూలింది. తెలుగమ్మాయి శ్రీ చరణి అద్భుతంగా బౌలింగ్‌ చేసి 4 ఓవర్లలో కేవలం 7 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది.

పాక్ పని పట్టిన తెలుగమ్మాయి..! 4 ఓవర్లలో కేవలం 7 పరుగులిచ్చి ఎన్ని వికెట్లు తీసిందంటే..?
Sricharani Took 3 Wickets
SN Pasha
|

Updated on: Sep 05, 2026 | 9:43 PM

Share

ఉమెన్స్ ఆసియా కప్ 2026లో భాగంగా దుబాయ్‌లో భారత్, పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అమ్మాయిలు అదరగొట్టారు. ముఖ్యంగా మన బౌలర్లు పాక్ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించారు. కేవలం 55 పరుగులకే పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసి పడేశారు. మరి ముఖ్యంగా మన తెలుగమ్మాయి శ్రీచరణి అదరగొట్టింది. తన 4 ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టింది. మొత్తంగా పాకిస్థాన్ బ్యాటర్లు భారత బౌలర్ల ముందు నిలువలేకపోయారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు మంచి స్టార్ అందించినట్లే కనిపించారు. అయితే షెఫాలీ వర్మ పాక్ వికెట్ల వేటను మొదలుపెడితే, శ్రీచరణి వారి పతనానికి చరమగీతం పాడింది. కేవలం 2 ఓవర్లలోనే 3 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసుకుంది. ఆ తర్వాత ఆమెకు దీప్తీ శర్మ, ప్రేమ రావత్ కూడా జతకలిశారు. వీరి దెబ్బకు పాకిస్థాన్ ఏ దశలోనూ కోలుకోలేదు. ఓపెనర్లు మునీబా అలీ 13, జుల్ఫీకర్ 14 పరుగులు చేశారు. మీగా ఎవరూ కూడా రెండంకెల స్కోర్ అందుకోలేదు. 0, 2, 3, 0, 5, 6, 9, 0, 0 ఇలా సాగింది పాకిస్థాన్ బ్యాటింగ్. మొత్తంగా టీమిండియా బౌలర్లలో శ్రీచరణికి 3, ప్రేమ రావత్‌కు 3 వికెట్లు దక్కాయి. అలాగే దీప్తి శర్మ1, షెఫాలీ వర్మ ఒక వికెట్ తీసుకున్నారు.

Follow Us