AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: మళ్లీ అదే రిపీట్‌ అవుద్ది! ఇండియాకు పాక్‌ పేసర్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ పేసర్ హరీస్ రౌఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దుబాయ్‌లో పాకిస్థాన్ గత రికార్డులను రిపీట్ చేస్తుందని అన్నాడు. అయితే భారత అభిమానులు న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ ఓటమిని గుర్తు చేస్తూ, ఐసీసీ టోర్నీల్లో భారత్‌కు ఉన్న ఆధిక్యతను ప్రస్తావిస్తున్నారు. దీంతో రేపటి మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది.

IND vs PAK: మళ్లీ అదే రిపీట్‌ అవుద్ది! ఇండియాకు పాక్‌ పేసర్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!
Haris Rauf
SN Pasha
|

Updated on: Feb 22, 2025 | 1:40 PM

Share

భారత్‌ వర్సెస్‌ పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ రేపు( ఆదివారం, ఫిబ్రవరి 23) జరగనుంది. ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. ఈ దాయాదుల పోరు కోసం యావత్‌ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే టీమిండియా, బంగ్లాదేశ్‌పై గెలిచి వస్తుంటే, పాకిస్థాన్‌ మాత్రం న్యూజిలాండ్‌ చేతుల్లో ఓటమి పాలై వస్తోంది. టీమిండియాతో జరగబోయే మ్యాచ్‌ పాకిస్థాన్‌కు డూ ఆర్‌ డై మ్యాచ్‌. ఒక వేళ ఇండియాపై పాక్‌ ఓడిపోతే వాళ్లు ఒక సెమీస్‌కు దూరమైనట్లే. అంత కీలకమైన ఈ మ్యాచ్‌కి ముందు పాకిస్థాన్‌ పేసర్‌ హరీస్‌ రౌఫ్ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు. టీమిండియాతో మ్యాచ్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని, అయితే గతంలో దుబాయ్‌లో టీమిండియాతో ఆడిన మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌ విజయం సాధించిందని, ఇప్పుడు కూడా అదే రిపీట్‌ చేస్తామని రౌఫ్‌ అన్నాడు.

2021 టీ20 వరల్డ్‌ కప్‌ సందర్భంలో టీమిండియాపై పాకిస్థాన్‌ విజయం సాధించిందని, అలాగే 2022 ఆసియా కప్‌ సమయంలో కూడా పాక్‌, భారత్‌పై గెలిచిందని, అదే విన్నింగ్‌ స్ట్రైక్‌ను ఇప్పుడు ఛాంపియన్స్‌ ట్రోఫీ కూడా కొనసాగిస్తామని వార్నింగ్‌ ఇచ్చాడు. అయితే ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్‌పై టీమిండియాకు తిరుగులేని రికార్డ్‌ ఉంది. రౌఫ్‌ కామెంట్స్‌కు భారత క్రికెట్‌ అభిమానులు గట్టి కౌంటర్‌ ఇస్తున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ బ్యాటింగ్‌ పిచ్‌పై కనీసం పోటీ ఇవ్వలేకపోయారని, ఇక స్లో పిచ్‌ అయిన దుబాయ్‌ గ్రౌండ్‌లో టీమిండియా బౌలింగ్‌ ముందు కనీసం నిల్చోగలరా అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే టీ20 వరల్డ్‌ కప్‌ 2023లో విరాట్‌ కోహ్లీ ఆడిన 82 పరుగుల ఇన్నింగ్స్‌ అలాగే, తన బౌలింగ్‌లో కొట్టిన రెండు వరుస సిక్సులను రౌఫ్ అప్పుడే మర్చిపోయాడా? అంటూ ఇచ్చిపడేస్తున్నారు.

పైగా పాకిస్థాన్ టీమ్‌ ప్రస్తుతం అంత స్ట్రాంగ్‌గా లేదని, టీమిండియా లాంటి టీమ్‌కు కనీసం పోటీ ఇచ్చే రేంజ్‌లో కూడా పాక్‌ లేదంటూ ఏకిపారేస్తున్నాడు. అయితే యూఏఈ వేదికగా జరిగిన మ్యాచ్‌ల్లో టీమిండియాపై పాకిస్థాన్‌కు మంచి రికార్డ్‌ ఉన్నప్పటికీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో మాత్రం టీమిండియానే సత్తా చాటుతుందని భారత క్రికెట్‌ అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే రేపటి మ్యాచ్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎలాగో ఆదివారమే కాబట్టి రేపు కోట్ల మంది అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు. ఇక రౌఫ్‌ చెప్పినట్లు పాక్‌ ఇండియాను ఇబ్బంది పెడుతుందో లేక టీమిండియా పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడిస్తుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.