IND vs NZ 3rd ODI: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. నంబర్ 1పై కన్నేసిన రోహిత్ సేన.. ప్లేయింగ్ 11లో రెండు మార్పులు..

|

Jan 24, 2023 | 1:08 PM

India vs New Zealand: రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా నేడు వన్డేల్లో నంబర్-1 టైటిల్‌ను అందుకోగలదు. ఇండోర్‌లోని హోల్కర్ మైదానంలో న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో తలపడుతోంది.

IND vs NZ 3rd ODI: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. నంబర్ 1పై కన్నేసిన రోహిత్ సేన.. ప్లేయింగ్ 11లో రెండు మార్పులు..
Ind Vs Nz 3rd Odi
Follow us on

ఇండోర్‌లోని హోల్కర్ మైదానంలో భారత్ వర్సెస్ న్యూజిలాండ్‌తో మూడో వన్డే మొదలైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీ20 తర్వాత వన్డేల్లో కూడా టీమిండియా నంబర్‌-1గా మారుతుంది. అంతే కాదు వన్డే చరిత్రలో కివీస్‌పై భారత జట్టు మూడోసారి క్లీన్ స్వీప్ చేయనుంది. 13 ఏళ్ల క్రితం 2010లో గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో జట్టు ఈ ఘనత సాధించింది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 5-0తో న్యూజిలాండ్‌ను ఓడించింది. అంతకు ముందు 1988లో 4 మ్యాచ్‌ల సిరీస్‌ను టీమ్ ఇండియా క్లీన్ స్వీప్ చేసింది.

ప్రస్తుత వన్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లిష్ జట్టు నంబర్-1 స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ రెండో స్థానంలో, భారత్ మూడో స్థానంలో ఉన్నాయి. కీలక విషయం ఏమిటంటే ర్యాంకింగ్ జాబితాలో టాప్-3లో ఉన్న మూడు జట్లూ ఒకే రేటింగ్ పాయింట్లను (113) కలిగి ఉన్నాయి. దశాంశం తర్వాత అంకెల లెక్కింపు ఆధారంగా ఇంగ్లండ్ మొదటి స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌ రేటింగ్‌ పాయింట్లు 114కి చేరి నంబర్‌-1గా అవతరిస్తుంది.

టీ20లో టీమిండియా ఇప్పటికే నంబర్-1 స్థానంలో ఉంది. అదే సమయంలో భారత జట్టు టెస్టులో రెండో స్థానంలో ఉంది.

ఇవి కూడా చదవండి

ఇరుజట్లు..

భారత ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్

న్యూజిలాండ్ ప్లేయింగ్ 11: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కీపర్/కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ, బ్లెయిర్ టిక్నర్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..