IND vs ENG: రోహిత్‌కి కోహ్లీ బౌలింగ్.. ఎడమచేత్తో బుమ్రా పేస్ దాడి.. ఇలాంటి ప్రాక్టీస్ మీరెప్పుడైనా చూశారా? వీడియో..

ICC World Cup 2023: విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎట్రాక్షషన్‌గా నిలిచింది. ముఖ్యంగా రోహిత్‌కి బౌలింగ్ చేయడం చూడొచ్చు. పేస్, స్పిన్, త్రో-డౌన్‌లుగా విభజించి, మూడు నెట్‌లలో బ్యాటర్‌లందరూ సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేశారు. రవీంద్ర జడేజా సిక్సర్లు, స్ట్రెయిట్-డ్రిల్లింగ్ ఫోర్లను ప్రయత్నించాడు. బుమ్రా నుంచి ఆర్.అశ్విన్ వరకు బౌలర్లంతా బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు.

IND vs ENG: రోహిత్‌కి కోహ్లీ బౌలింగ్.. ఎడమచేత్తో బుమ్రా పేస్ దాడి.. ఇలాంటి ప్రాక్టీస్ మీరెప్పుడైనా చూశారా? వీడియో..
Team India

Updated on: Oct 27, 2023 | 5:25 PM

IND vs ENG: ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023లో మొదటి ఐదు మ్యాచ్‌లలో ఐదు గెలిచిన భారత్ తన ఆరో మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ఆదివారం (అక్టోబర్ 29) లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ హైవోల్టేజీ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ ప్రారంభించారు. ప్రత్యేకించి, ప్రాక్టీస్ సెషన్‌లో విరాట్ కోహ్లీ కెప్టెన్ రోహిత్ శర్మకు బౌలింగ్ చేయడం చూడొచ్చు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అలాగే బ్యాటర్ శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ కూడా బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. హార్దిక్ పాండ్యా లేకపోవడంతో భారత జట్టు మేనేజ్‌మెంట్ కోహ్లీ, గిల్ లేదా సూర్యను పార్ట్‌టైమ్ బౌలింగ్ ఎంపికలుగా సిద్ధం చేయాలని చూస్తోంది. ఇక పోతే బుమ్రా తన ఎడమ చేతితో బౌలింగ్ చేయడం కూడా ఈ వీడియోలో చూడొచ్చు.

అలాగే, ఎక్కువ దూరం, క్లోజ్-ఇన్ క్యాచ్‌లు కూడా ప్రాక్టీస్ చేశారు. కోచ్ రాహుల్ ద్రవిడ్ ఫీల్డర్‌లను లోతుగా, ఆసక్తిగా తిలకించాడు. మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్ మినహా దాదాపు పూర్తి స్క్వాడ్ వేదిక వద్ద ఐచ్ఛిక నెట్ షెషన్‌లో పాల్గొన్నారు.

క్రికెట్ గ్రౌండ్‌తో పాటు ఇండోర్ స్టేడియం, టెన్నిస్ కోర్ట్‌లతో విశాలమైన క్రీడా ప్రాంగణం టీమిండియా ప్రాక్టీస్‌తో నిండిపోయింది. బుమ్రా కొన్ని స్వీప్‌లకు ప్రయత్నించి నవ్వులు పూయించాడు. అయితే కుల్దీప్ తన బ్యాటింగ్ చిత్రాలను క్లిక్ చేయమని ఒక ఫోటోగ్రాఫర్‌ని అభ్యర్థించాడు.

ఇందులో ముఖ్యంగా విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎట్రాక్షషన్‌గా నిలిచింది. ముఖ్యంగా రోహిత్‌కి బౌలింగ్ చేయడం చూడొచ్చు. పేస్, స్పిన్, త్రో-డౌన్‌లుగా విభజించి, మూడు నెట్‌లలో బ్యాటర్‌లందరూ సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేశారు. రవీంద్ర జడేజా సిక్సర్లు, స్ట్రెయిట్-డ్రిల్లింగ్ ఫోర్లను ప్రయత్నించాడు. బుమ్రా నుంచి ఆర్.అశ్విన్ వరకు బౌలర్లంతా బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. హార్దిక్ పాండ్యా ఎడమ-చీలమండ గాయం తర్వాత జట్టు ఆల్ రౌండ్ బ్యాలెన్స్ దెబ్బతింది. మహ్మద్ సిరాజ్‌తో కూడా రోహిత్ చాలాసేపు మాట్లాడాడు.

భారత జట్టు: రోహిత్ శర్మ (సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వి), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..