Ind vs Eng 5th Test Day 2: 36 ఏళ్ల తర్వాత బర్మింగ్‌హామ్‌లో అదరగొట్టిన భారత్.. జడేజా సెంచరీ చేస్తే, ఇక తిరుగులేనట్లే..

|

Jul 02, 2022 | 11:31 AM

ఈ మైదానంలో భారత జట్టు ఎప్పుడూ 400 పరుగులు చేయలేకపోయింది. అంతే కాకుండా ఈ మైదానంలో టీమిండియా ఆడిన అన్ని టెస్టు మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూసింది.

Ind vs Eng 5th Test Day 2: 36 ఏళ్ల తర్వాత బర్మింగ్‌హామ్‌లో అదరగొట్టిన భారత్.. జడేజా సెంచరీ చేస్తే, ఇక తిరుగులేనట్లే..
India Vs England Ravindra Jadeja
Follow us on

బర్మింగ్‌హామ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న 5వ టెస్టు మ్యాచ్‌లో నేడు రెండో రోజు. తొలి రోజు టీమిండియా 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. ఈ మైదానంలో టీమిండియాకు ఇది రెండో అత్యధిక స్కోరుగా మారింది. ఇంతకుముందు 1986లో ఈ మైదానంలో భారత్ 390 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇదే కావడం గమనార్హం. అయితే, ఆ టెస్ట్ మ్యాచ్‌ను టీమిండియా డ్రా చేసుకుంది.

ఈ మైదానంలో భారత జట్టు ఎప్పుడూ 400 పరుగులు చేయలేకపోయింది. అంతే కాకుండా ఈ మైదానంలో టీమిండియా ఆడిన అన్ని టెస్టు మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో పంత్ ఔటైన తర్వాత రవీంద్ర జడేజా 83 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. జడేజాకుతోడు మహ్మద్ షమీ క్రీజులో నిలిచాడు. అదే సమయంలో ఇంగ్లండ్ తరపున జేమ్స్ అండర్సన్ 3 వికెట్లు పడగొట్టాడు. ఈరోజు జడేజా బ్యాట్‌తో సెంచరీ సాధిస్తే, బర్మింగ్‌హామ్‌లో టీమిండియా తరపున పలు రికార్డులను నమోదు చేసే వీలుంది.

తొలిరోజు పంత్-జడేజా జోడీదే..

ఇవి కూడా చదవండి

రిషబ్ పంత్ తొలిరోజు మ్యాచ్‌లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 146 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 98 పరుగుల వద్ద 5 వికెట్లు కోల్పోయింది. ఇక్కడ నుంచి పంత్, జడేజా ఆరో వికెట్‌కు 222 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇంగ్లండ్‌పై ఈ వికెట్‌కు టీమిండియాకు ఇదే అతిపెద్ద భాగస్వామ్యంగా నిలిచింది.

రిషబ్ తన ఇన్నింగ్స్‌లో 111 బంతులు ఎదుర్కొని 19 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో అదరగొట్టాడు. 89 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. అతని కెరీర్‌లో ఇది 5వ టెస్టు సెంచరీ. ఈ ఫార్మాట్‌లో ఇంగ్లండ్‌పై మూడో సెంచరీ సాధించాడు. అదే సమయంలో రవీంద్ర జడేజా కెరీర్‌లో 18వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

అంతకుముందు భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ ఘోరంగా విఫలమయ్యారు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 17, ఛెతేశ్వర్ పుజారా 13 పరుగులు చేసి జేమ్స్ అండర్సన్‌కు వికెట్ ఇచ్చారు. హనుమ విహారి 20, విరాట్ కోహ్లీ 11, శ్రేయాస్ అయ్యర్ 15 పరుగులు చేసి ఔటయ్యారు.