IND vs ENG: ఆధిక్యంలోకి ఇంగ్లండ్.. వికెట్ కోసం టీమిండియా బౌలర్ల ప్రయత్నాలు విఫలం

| Edited By: Rajeev Rayala

Aug 25, 2021 | 11:21 PM

ఇంగ్లాండ్ టూర్‌లో నేడు మూడో టెస్టుకు టీమిండియా సిద్దమైంది. మొదటి రెండు టెస్టులలోనూ పైచేయి సాధించిన భారత్.. మూడో టెస్టుకు హాట్ ఫేవరెట్‌గా..

IND vs ENG: ఆధిక్యంలోకి ఇంగ్లండ్.. వికెట్ కోసం టీమిండియా బౌలర్ల ప్రయత్నాలు విఫలం
England India

ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్స్ ఆచితూచి ఆడుతున్నారు. రోర్నీ బర్న్ 47 పరుగులు, హమీద్ 52 పరుగులతో క్రీజులో నిలిచారు. ప్రస్తుతం ఇంగ్లండ్ టీం స్కోర్ 107 పరుగులకు చేరుకుంది. వికెట్ కోసం టీమిండియా బౌలర్లు తీవ్రంగా కష్టపడుతున్నారు.

ఇంగ్లాండ్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. హమీద్(15), బర్న్స్(3) కలిసి మొదటి వికెట్‌కు 21 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీనితో ఏడు ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది.

ఓవర్టన్ చివరి వికెట్ పడగొట్టాడు. దీనితో టీమిండియా 78 పరుగులకు ఆలౌట్ అయింది.

టీమిండియా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తొమ్మిదో వికెట్ కోల్పోయింది. బుమ్రా గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీనితో 67 పరుగులకు టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది.

టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రవీంద్ర జడేజా పెవిలియన్ బాట పట్టాడు..

టీమిండియా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. ఓవర్టన్ వరుస బంతుల్లో షమీ(0), రోహిత్ శర్మ(19)లను పెవిలియన్‌కు పంపించాడు. దీనితో టీమిండియా 67 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది.

రెండు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పంత్ అవుట్ అయ్యాడు. దీనితో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 

టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 18 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాబిన్సన్ బౌలింగ్‌లో రహనే పెవిలియన్ చేరాడు.  

రోహిత్ శర్మ(14), రహనే(16) టీమిండియాను ఆదుకున్నారు.  పేలవమైన షాట్స్ ఆడకుండా మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడుతున్నారు.

టీమిండియా ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ బౌలర్ ఆండర్సన్ విజృంభణతో పుజారా(1), రాహుల్(0), కోహ్లీ(7) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. 

ఇంగ్లాండ్ టూర్‌లో నేడు మూడో టెస్టుకు టీమిండియా సిద్దమైంది. మొదటి రెండు టెస్టులలోనూ పైచేయి సాధించిన భారత్.. మూడో టెస్టుకు హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఈ మ్యాచ్ టీమిండియా గెలిస్తే.. సిరీస్ చేజారే అవకాశం ఉండదు. అందుకే రెండు టెస్టులలోనూ ఆధిపత్యం ప్రదర్శించిన కోహ్లీసేన.. అదే జోరుతో మరో విజయంపై కన్నేసింది. బ్యాటింగ్ కొంచెం మెరుగుపడాల్సి ఉన్నా.. టీమిండియా ఎలాంటి ఇబ్బంది పడకపోవచ్చు.

ఇదిలా ఉంటే ఆతిధ్య జట్టు ఇంగ్లాండ్‌ పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. ఏదీ కలిసి రావడం లేదు. ఓపెనింగ్ సమస్య, పేసర్లకు గాయాలు, మిడిల్ ఆర్డర్‌లో నిలకడలేమి.. ఆ జట్టును మొత్తం కెప్టెన్ జోరూట్ తన భుజాలపై మోస్తున్నాడని చెప్పవచ్చు. ఇన్ని సమస్యలతో బాధపడుతున్న ఇంగ్లాండ్.. కోహ్లీసేనను ఎలా ఐదు రోజుల పాటు ఎదుర్కుంటుందో వేచి చూడాలి.

కాగా, హెడింగ్లీ వేదికగా జరుగుతోన్న మూడో టెస్టులో టీమిండియా సారధి విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్టులో ఎలాంటి మార్పు చేయకుండా.. రెండో టెస్టులో విజయం అందించిన ప్లేయర్స్‌తోనే టీమిండియా బరిలోకి దిగింది. అటు ఇంగ్లాండ్ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. డొమినిక్ సిబ్లి స్థానంలో ప్రపంచ నెంబర్ వన్ టీ20 ప్లేయర్ డేవిడ్ మాలన్ తిరిగి టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోగా.. గాయంతో దూరమైన మార్క్ వుడ్ స్థానంలో క్రెయిగ్ ఓవర్టన్ ఎంపిక అయ్యాడు.

ఇంగ్లాండ్(ప్లేయింగ్ ఎలెవన్): రోరీ బర్న్స్, హమీద్, డేవిడ్ మాలన్, జో రూట్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, జోస్ బట్లర్(వికెట్ కీపర్), మొయిన్ అలీ, సామ్ కర్రన్, ఓవర్టన్, రాబిన్సన్, ఆండర్సన్

భారత్(ప్లేయింగ్ ఎలెవన్): రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 25 Aug 2021 11:20 PM (IST)

    మొదటి రోజు ముగిసిన ఆట.. ఒక్క వికెట్ కూడా తీయలేక పోయిన భారత్ బౌలర్లు

    42 వ ఓవర్ కు ఇంగ్లాండ్ స్కోర్ 120/0 మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 120 పరుగులు సాధించింది. భారత్ బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేక పోయారు.

  • 25 Aug 2021 10:47 PM (IST)

    100 పరుగులు దాటిన ఇంగ్లండ్

    ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్స్ ఆచితూచి ఆడుతున్నారు. రోర్నీ బర్న్ 47 పరుగులు, హమీద్ 52 పరుగులతో క్రీజులో నిలిచారు. ప్రస్తుతం ఇంగ్లండ్ టీం స్కోర్ 107 పరుగులకు చేరుకుంది. వికెట్ కోసం టీమిండియా బౌలర్లు తీవ్రంగా కష్టపడుతున్నారు.

  • 25 Aug 2021 09:43 PM (IST)

    50 పరుగులకు చేరిన ఇంగ్లండ్

    ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్స్ ఆచితూచి ఆడుతున్నారు. రోర్నీ బర్న్ 23 పరుగులు, హమీద్ 32 పరుగులతో క్రీజులో నిలిచారు. ప్రస్తుతం ఇంగ్లండ్ టీం స్కోర్ 58 పరుగులకు చేరుకుంది. వికెట్ కోసం టీమిండియా బౌలర్లు తీవ్రంగా కష్టపడుతున్నారు.

  • 25 Aug 2021 08:21 PM (IST)

    టీ బ్రేక్..

    ఇంగ్లాండ్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. హమీద్(15), బర్న్స్(3) కలిసి మొదటి వికెట్‌కు 21 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీనితో ఏడు ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది.

  • 25 Aug 2021 07:30 PM (IST)

    టీమిండియా ఆలౌట్..

    ఓవర్టన్ చివరి వికెట్ పడగొట్టాడు. దీనితో టీమిండియా 78 పరుగులకు ఆలౌట్ అయింది.

  • 25 Aug 2021 07:30 PM (IST)

    తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా..

    టీమిండియా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తొమ్మిదో వికెట్ కోల్పోయింది. బుమ్రా గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీనితో 67 పరుగులకు టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది.

  • 25 Aug 2021 07:11 PM (IST)

    జడేజా అవుట్..

    టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రవీంద్ర జడేజా పెవిలియన్ బాట పట్టాడు..

  • 25 Aug 2021 07:08 PM (IST)

    ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు..

    టీమిండియా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. ఓవర్టన్ వరుస బంతుల్లో షమీ(0), రోహిత్ శర్మ(19)లను పెవిలియన్‌కు పంపించాడు. దీనితో టీమిండియా 67 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది.

  • 25 Aug 2021 06:54 PM (IST)

    ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా

    రెండు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పంత్ అవుట్ అయ్యాడు. దీనితో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది.

  • 25 Aug 2021 05:28 PM (IST)

    రహనే అవుట్..

    టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 18 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాబిన్సన్ బౌలింగ్‌లో రహనే పెవిలియన్ చేరాడు.

  • 25 Aug 2021 04:29 PM (IST)

    టీమిండియా కెప్టెన్ కోహ్లీ అవుట్..

    ఇంగ్లాండ్ బౌలర్ ఆండర్సన్ విజృంభణ కొనసాగుతోంది. చక్కటి బంతికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(7)ని తక్కువ పరుగులకే పెవిలియన్‌కు పంపాడు. దీనితో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది.

  • 25 Aug 2021 03:55 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా..

    అండర్సన్ విజృంభణతో టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. పుజారాను ఒక్క పరుగుకే పెవిలియన్‌కు పంపించాడు. దీనితో టీమిండియా నాలుగు పరుగుల స్కోర్ వద్ద రెండు వికెట్లు కోల్పోయింది.

  • 25 Aug 2021 03:36 PM (IST)

    రాహుల్ డకౌట్..

    రెండో టెస్టు సెంచరీ హీరో కెఎల్ రాహుల్ పెవిలియన్ చేరాడు. ఆండర్సన్ అద్భుతమైన బంతితో అతడిని అవుట్ చేశాడు. దీనితో టీమిండియా ఒక్క పరుగుకు మొదటి వికెట్ కోల్పోయింది.

  • 25 Aug 2021 03:15 PM (IST)

    సేమ్ టీంతో బరిలోకి దిగిన ఇండియా

  • 25 Aug 2021 03:15 PM (IST)

    రెండు మార్పులతో బరిలోకి ఇంగ్లాండ్

  • 25 Aug 2021 03:14 PM (IST)

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

Follow us on