IND vs ENG 3rd Test Day 2 : వరుసగా వికెట్లు కోల్పోతోన్న ఇంగ్లండ్.. స్కోర్ 388/7.. ఆధిక్యం 310

| Edited By: Rajeev Rayala

Aug 26, 2021 | 11:16 PM

India vs England 3rd Test Day 2: మూడో టెస్ట్ తొలిరోజులో భాగంగా ఇంగ్లండ్ టీం భారత్‌పై పూర్తి ఆధిక్యం ప్రదర్శించింది. భారత ఆటగాళ్లను అత్యల్ప స్కోర్‌కే ఆలౌట్ చేసి..

IND vs ENG 3rd Test Day 2 : వరుసగా వికెట్లు కోల్పోతోన్న ఇంగ్లండ్.. స్కోర్ 388/7.. ఆధిక్యం 310
India Vs England

రెండో రోజు ఆట చివరలో భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లను ఒక్కొక్కిరిగా పెవిలియన్ చేర్చుతున్నారు. సెంచరీ వీరుడు జో రూట్ (120) పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోర్ 388/7 గా నిలిచింది.

రూట్ మరో సెంచరీతో అదరగొట్టాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోర్ 333/3 పరుగులు కాగా.. రూట్ మరింత సేపు క్రీజులో ఉంటే.. ఆ జట్టుకు భారీ ఆధిక్యం దక్కడం ఖాయం.

మూడో టెస్టులో ఇంగ్లాండ్ పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. బౌలింగ్‌లో టీమిండియాకు చుక్కలు చూపించిన ఇంగ్లీష్ జట్టు.. బ్యాటింగ్‌లోనూ అదే తీరు కొనసాగిస్తోంది. ఓపెనర్లు బర్న్స్(61), హమీద్(68) అర్ధ సెంచరీలతో అదరగొట్టగా.. వన్ డౌన్‌లో వచ్చిన డేవిడ్ మాలన్(70) చితక్కొట్టాడు. ఇక కెప్టెన్ జో రూట్(93) యధావిధిగా మరో సెంచరీ చేసేందుకు సిద్దమయ్యాడు. ప్రస్తుతం 100 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ మూడు వికెట్లు నష్టానికి 313 పరుగులు చేసింది.

ఇంగ్లాండ్ మూడో వికెట్ కోల్పోయింది. డేవిడ్ మాలన్ సిరాజ్ బౌలింగ్‌లో 70 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ అయ్యాడు. దీనితో అంపైర్లు టీ బ్రేక్ ఇచ్చారు. ఇంగ్లాండ్ 94 ఓవర్లకు 298/3 పరుగులు చేయగా.. 220 పరుగుల ఆధిక్యం సాధించింది

ఇంగ్లాండ్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఇద్దరు ఓపెనర్ల వికెట్లను కోల్పోయిన తర్వాత మరో వికెట్ పడకుండా కెప్టెన్ జో రూట్(62), డేవిడ్ మాలన్(51) సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇద్దరూ ఆచితూచి ఆడుతున్నారు. దీనితో ఇంగ్లాండ్ 86 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది.

జో రూట్ తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. మరో అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. డేవిడ్ మాలన్(40)తో కలిసి 81 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీనితో ఇంగ్లాండ్ 82 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది.

ఇంగ్లాండ్ ఆధిక్యం పెరుగుతూపోతోంది. ఓపెనర్లు ఇద్దరూ శుభారంభాన్ని ఇచ్చి పెవిలియన్ చేరారు. అయితే ఆ తర్వాత వన్ డౌన్‌లో దిగిన మాలన్(29), కెప్టెన్ జో రూట్(35)తో కలిసి అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

ఇంగ్లాండ్ పటిష్ట స్థితిలో ఉంది. ఓపెనర్లు ఇద్దరూ ఔట్ అయినా.. మలాన్(27), కెప్టెన్ జో రూట్(14) ఆచితూచి ఆడుతున్నారు. మరో వికెట్ కోల్పోకుండా చక్కటి బంతులను బౌండరీలకు తరలిస్తున్నారు. దీనితో లంచ్ సమయానికి ఇంగ్లాండ్ రెండు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.

ఇంగ్లాండ్ జట్టు మరో ఓపెనర్ హమీద్ పెవిలియన్ చేరాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీనితో 159 పరుగుల వద్ద ఇంగ్లాండ్ రెండో వికెట్‌ను కోల్పోయింది. కెప్టెన్ జో రూట్ ప్రస్తుతం క్రీజులో ఉన్నాడు.

సిరాజ్ వేసిన బౌలింగ్‌లో డేవిడ్ మలాన్ రెండు ఫోర్లు బాదాడు. దీనితో ఇంగ్లాండ్ 58 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 149 పరుగులు చేసింది.

ఇంగ్లాండ్ మొదటి వికెట్ కోల్పోయింది. షమీ పదునైన బంతితో ఇంగ్లాండ్ ఓపెనర్ రోరి బర్న్స్(61)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీనితో ఇంగ్లాండ్ 135 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది.

IND vs ENG: లీడ్స్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఇంగ్లండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. అత్యల్ప స్కోర్‌కే పరిమితం చేసి, లార్డ్స్ విజయాన్ని మరచిపోయేలా చేశారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 78 పరుగులకు ఆలౌట్ అయ్యారు. తొలి సెషన్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసిన భారత్.. రెండో సెషన్‌లో మిగతా 27 పరుగులు చేసి కుప్పకూలింది. కేఎల్ రాహుల్‌(0), చతేశ్వర్(1), విరాట్‌ కోహ్లీ(7), పంత్(2), జడేజా(4) ఘోరంగా విఫలమయ్యారు. టీమిండియా తరపున రోహిత్‌ శర్మ(19) టాప్‌ స్కోరర్‌గా నిలవగా రహానె 18 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో అండర్సన్ 3, ఓవర్టన్‌ 3, రాబిన్సన్‌ 2, సామ్‌ కరన్‌ 2 వికెట్లు పడగొట్టి టీమిండియాను చావుదెబ్బ తీశారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ టీం వికెట్ కోల్పోకుండానే ఆధిక్యం సాధించింది. ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. దీనితో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఓపెనర్లు రోరీ బర్న్స్‌(52), హసీబ్‌ హమీద్‌(60) అర్ధ సెంచరీలతో అజేయంగా నిలిచారు. కీలక బ్యాట్స్‌మెన్స్ ఇంకా ఉండడంతో ఇంగ్లండ్ టీం భారీ స్కోర్ దిశగా సాగుతోంది. చెత్త బంతులను వదిలిస్తే చక్కటి షాట్స్‌తో భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. వికెట్ల కోసం టీమిండియా బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఈ రోజు ఇంగ్లండ్ టీంను త్వరగా ఆలౌట్ చేస్తేనే టీమిండియా మూడో టెస్టులో పోరాడగలదు. లేదంటే 1-1తో సిరీస్ సమయం అయ్యే చాన్స్ ఉంది. మరో రెండు టెస్టులు మిగిలి ఉన్నాయి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Aug 2021 11:15 PM (IST)

    రెండో రోజు ముగిసిన ఆట…

    రెండో రోజు ముగిసిన ఆట. ఇంగ్లాండ్ తొలి ఇనింగ్స్ లో 423 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. దాంతో ఆతిధ్య జట్టు 345 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక భారత్ రెండో ఇనింగ్స్ లో గట్టి పోరాటం చేస్తే తప్ప మ్యాచ్ కాపాడుకోవడం కష్టమే..

  • 26 Aug 2021 11:13 PM (IST)

    రెండో రోజు ముగిసిన ఆట…

    రెండో రోజు ముగిసిన ఆట. ఇంగ్లాండ్ తొలి ఇనింగ్స్ లో 423 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. దాంతో ఆతిధ్య జట్టు 345 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక భారత్ రెండో ఇనింగ్స్ లో గట్టి పోరాటం చేస్తే తప్ప మ్యాచ్ కాపాడుకోవడం కష్టమే..

  • 26 Aug 2021 10:19 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్

    ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోతుంది. సెంచరీ వీరుడు జోరూట్ ఔట్ అయ్యాక, వెంటనే మొయిన్ అలీ(8) కూడా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 383/7 పరుగుల వద్ద నిలిచింది. రెండో రోజు ఆట ముగిసేందుకు ఇంకో 13 ఓవర్లు మాత్రమే ఉన్నాయి.

  • 26 Aug 2021 10:16 PM (IST)

    జోరూట్ ఔట్

    ఎట్టకేలకు జో రూట్ (121) పరుగుల వద్ద బుమ్రా చేతికి చిక్కాడు. దీంతో ప్రస్తుతం ఇంగ్లండ్ 6 వికెట్లు కోల్పోయింది.

  • 26 Aug 2021 10:11 PM (IST)

    వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్

    ఇంగ్లండ్‌ ఐదు వికెట్లు కోల్పోయింది. 350 పరుగుల వద్ద బెయిర్‌స్టో(29), 360 పరుగుల వద్ద జోస్‌ బట్లర్‌(7) ఔటయ్యారు. మరోవైపు రూట్‌(120) శతకంతో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ ఆధిక్యం 300 పరుగులు దాటింది.

  • 26 Aug 2021 09:09 PM (IST)

    సెంచరీ చేసిన రూట్..

    రూట్ మరో సెంచరీతో అదరగొట్టాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోర్ 333/3 పరుగులు కాగా.. రూట్ మరింత సేపు క్రీజులో ఉంటే.. ఆ జట్టుకు భారీ ఆధిక్యం దక్కడం ఖాయం.

  • 26 Aug 2021 08:55 PM (IST)

    భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లాండ్..

    మూడో టెస్టులో ఇంగ్లాండ్ పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. బౌలింగ్‌లో టీమిండియాకు చుక్కలు చూపించిన ఇంగ్లీష్ జట్టు.. బ్యాటింగ్‌లోనూ అదే తీరు కొనసాగిస్తోంది. ఓపెనర్లు బర్న్స్(61), హమీద్(68) అర్ధ సెంచరీలతో అదరగొట్టగా.. వన్ డౌన్‌లో వచ్చిన డేవిడ్ మాలన్(70) చితక్కొట్టాడు. ఇక కెప్టెన్ జో రూట్(93) యధావిధిగా మరో సెంచరీ చేసేందుకు సిద్దమయ్యాడు. ప్రస్తుతం 100 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ మూడు వికెట్లు నష్టానికి 313 పరుగులు చేసింది.

  • 26 Aug 2021 08:23 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్..

    ఇంగ్లాండ్ మూడో వికెట్ కోల్పోయింది. డేవిడ్ మాలన్ సిరాజ్ బౌలింగ్‌లో 70 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ అయ్యాడు. దీనితో అంపైర్లు టీ బ్రేక్ ఇచ్చారు. ఇంగ్లాండ్ 94 ఓవర్లకు 298/3 పరుగులు చేయగా.. 220 పరుగుల ఆధిక్యం సాధించింది

  • 26 Aug 2021 07:30 PM (IST)

    సెంచరీ భాగస్వామ్యం.. రూట్, మలాన్ అర్ధ శతకాలు..

    ఇంగ్లాండ్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఇద్దరు ఓపెనర్ల వికెట్లను కోల్పోయిన తర్వాత మరో వికెట్ పడకుండా కెప్టెన్ జో రూట్(62), డేవిడ్ మాలన్(51) సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇద్దరూ ఆచితూచి ఆడుతున్నారు. దీనితో ఇంగ్లాండ్ 86 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది.

  • 26 Aug 2021 07:10 PM (IST)

    అర్ధ సెంచరీ పూర్తి చేసిన జో రూట్..

    జో రూట్ తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. మరో అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. డేవిడ్ మాలన్(40)తో కలిసి 81 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీనితో ఇంగ్లాండ్ 82 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది.

  • 26 Aug 2021 06:42 PM (IST)

    ఆచితూచి ఆడుతున్న రూట్, మాలన్

    ఇంగ్లాండ్ ఆధిక్యం పెరుగుతూపోతోంది. ఓపెనర్లు ఇద్దరూ శుభారంభాన్ని ఇచ్చి పెవిలియన్ చేరారు. అయితే ఆ తర్వాత వన్ డౌన్‌లో దిగిన మాలన్(29), కెప్టెన్ జో రూట్(35)తో కలిసి అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

  • 26 Aug 2021 05:36 PM (IST)

    లంచ్ బ్రేక్.. 104 పరుగుల ఆధిక్యం..

    ఇంగ్లాండ్ పటిష్ట స్థితిలో ఉంది. ఓపెనర్లు ఇద్దరూ ఔట్ అయినా.. మలాన్(27), కెప్టెన్ జో రూట్(14) ఆచితూచి ఆడుతున్నారు. మరో వికెట్ కోల్పోకుండా చక్కటి బంతులను బౌండరీలకు తరలిస్తున్నారు. దీనితో లంచ్ సమయానికి ఇంగ్లాండ్ రెండు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.

  • 26 Aug 2021 05:18 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్..

    ఇంగ్లాండ్ జట్టు మరో ఓపెనర్ హమీద్ పెవిలియన్ చేరాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీనితో 159 పరుగుల వద్ద ఇంగ్లాండ్ రెండో వికెట్‌ను కోల్పోయింది. కెప్టెన్ జో రూట్ ప్రస్తుతం క్రీజులో ఉన్నాడు.

  • 26 Aug 2021 04:48 PM (IST)

    ఒకే ఓవర్‌లో రెండు ఫోర్లు..

    సిరాజ్ వేసిన బౌలింగ్‌లో డేవిడ్ మలాన్ రెండు ఫోర్లు బాదాడు. దీనితో ఇంగ్లాండ్ 58 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 149 పరుగులు చేసింది.

  • 26 Aug 2021 04:14 PM (IST)

    మొదటి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్..

    ఇంగ్లాండ్ మొదటి వికెట్ కోల్పోయింది. షమీ పదునైన బంతితో ఇంగ్లాండ్ ఓపెనర్ రోరి బర్న్స్(61)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీనితో ఇంగ్లాండ్ 135 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది.

  • 26 Aug 2021 03:19 PM (IST)

    ఇంగ్లండ్ ఓపెనర్ల దూకుడు

    తొలిరోజు భారత్‌ను తక్కువ స్కోర్‌కే ఆలౌట్ చేసిన ఇంగ్లండ్ బౌలర్లకు తోడు.. ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్స్ కూడా జత కలిశారు. వికెట్ కోల్పోకుండా భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. తొలిరోజును అజేయంగా ముగించారు.
    ఇంగ్లండ్ స్కోర్: 120/0; రోర్నీ బర్స్న్ 52 నాటౌట్; హమీద్ 60 నాటౌట్

  • 26 Aug 2021 03:15 PM (IST)

    తొలిరోజు వికెట్ కోల్పోకుండా తొలి ఇన్నింగ్స్‌ను ఆధిక్యంతో ముగిసిన జట్లు

    160/0 న్యూజిలాండ్ vs పాకిస్తాన్ 104 హామిల్టన్ 2000/01
    157/0 ఇంగ్లండ్ vs ఆస్ట్రేలియా 98 ఎంసీజీ 2010/11
    120/0 ఇంగ్లండ్ vs ఇండియా 78 లీడ్స్ 2021

Follow us on