India vs England, 2nd T20, Playing XI: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నేడు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా బ్యాటింగ్ చేయనుంది. సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ 50 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే, సిరీస్ గెలిచే అవకాశం ఉంటుంది. మొదటి మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లి , రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలను జట్టు తిరిగి వచ్చారు. ఇంగ్లండ్ జట్టు తిరిగి పుంజుకునేందుకు ఎదురుచూస్తోంది. ఈ మ్యాచ్ ఇంగ్లండ్‌కు డూ ఆర్ డై మ్యాచ్ కానుంది.
England have won the toss and elect to bowl first in the 2nd T20I
ఇవి కూడా చదవండిA look at our Playing XI for the game ??
Live – https://t.co/o5RnRVGuWv #ENGvIND pic.twitter.com/SkEUSwtzVW
— BCCI (@BCCI) July 9, 2022
ఇరు జట్లు:
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్
ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, జోస్ బట్లర్(కెప్టెన్, కీపర్), డేవిడ్ మలన్, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, మోయిన్ అలీ, సామ్ కర్రాన్, డేవిడ్ విల్లీ, క్రిస్ జోర్డాన్, రిచర్డ్ గ్లీసన్, మాథ్యూ పార్కిన్సన్