దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి మ్యాచ్‌లో ఓడిపోయిన టీమ్ ఇండియా.. టీ20 ప్రపంచకప్‌లో తన నాలుగో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. బుధవారం బంగ్లాదేశ్‌తో అడిలైడ్‌లో సూపర్-12 గ్రూప్-2లో భాగంగా జరగనున్న ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం భారత్ జట్టు గ్రూప్-2లో 3 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో 4 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో టీ20 ప్రపంచ కప్ 2022లో బంగ్లాదేశ్ జట్టు కూడా అదే సంఖ్యలో మ్యాచ్‌లు ఆడి 4 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది. మెరుగైన నెట్ రేట్ కారణంగా భారత్ ప్రస్తుతం బంగ్లాదేశ్ కంటే ముందుంది.
ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా భారత్ సెమీఫైనల్‌లోకి ప్రవేశించడం చాలా సులభంగా మారుతుంది. అదే సమయంలో ఓడిపోతే బంగ్లాదేశ్ దాదాపు ఔట్ అవుతుంది. ఈ మ్యాచ్ తర్వాత బంగ్లాదేశ్ చివరి మ్యాచ్ పాకిస్థాన్‌తో జరగనుండగా, భారత్ జింబాబ్వేతో ఆడాల్సి ఉంది.
ఒకవేళ బంగ్లాదేశ్‌తో భారత జట్టు ఓడిపోతే.. సెమీస్ చేరాలన్న రోహిత్ సేన దారి మూసుకపోతుంది. అలాంటి పరిస్థితిలో చివరి మ్యాచ్‌లో జింబాబ్వేపై గెలిచినప్పటికీ, భారత్ గరిష్టంగా 6 పాయింట్లను మాత్రమే కలిగి ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ తన చివరి రెండు మ్యాచ్‌లు గెలిస్తే, అది కూడా 6 పాయింట్లను పొందుతుంది. అప్పుడు మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న జట్టు లాభపడుతుంది.
ఒకవేళ భారత్ ఓడిపోతే బంగ్లాదేశ్‌కు కూడా అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. భారత్ తర్వాత పాకిస్థాన్‌ను కూడా బంగ్లా ఓడిస్తే 8 పాయింట్లు వస్తాయి. ఈ పరిస్థితి అంతా చూస్తుంటే భారత్‌కు ఈ మ్యాచ్ ఒక విధంగా నాకౌట్ లాంటిదే అని చెప్పొచ్చు. ఒకవేళ ఓటమి ఎదురైతే, భారత్‌కు సెమీస్ మార్గం చాలా పరిమితం కావచ్చు.
వాతావరణ సూచన వెబ్‌సైట్ AccuWeather ప్రకారం, మ్యాచ్ సమయంలో 30 నుంచి 60 శాతం వర్షం పడే ఛాన్స్ ఉంది. అయితే, ఆస్ట్రేలియాలో వాతావరణం చాలా వేగంగా మారుతుంది. అందువల్ల, భారీ వర్షం కురిసే అవకాశం ఎక్కువగా ఉండవచ్చు లేదా తక్కువగా కూడా ఉండవచ్చు.
ఈ ప్రపంచకప్‌లో అడిలైడ్‌లో ఇంకా మ్యాచ్ ఆడలేదు. ఆస్ట్రేలియన్ టీ20 లీగ్ బిగ్ బాష్‌ను ప్రాతిపదికగా తీసుకుంటే, అది అధిక స్కోరింగ్ గ్రౌండ్‌గా నిలిచింది. ఇక్కడ రాత్రి మ్యాచ్‌లలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు సగటు స్కోరు 170 పరుగులుగా ఉంది.
ఇక్కడ ఆడిన ఏకైక టీ20 మ్యాచ్‌లో విజయం సాధించడం టీమిండియాకు కలిసిరానుంది. 2016లో ఇక్కడ భారత్ 37 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది.
టీమిండియా: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఆర్ అశ్విన్, అర్ష్దీప్ సింగ్, మహమ్మద్ షమీ.