IND vs BAN 1st Test Day 2: మరోసారి నిరాశ పరిచిన కోహ్లీ, రోహిత్.. 300లు దాటిన భారత్ ఆధిక్యం..
India vs Bangladesh, 1st Test : భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చెన్నై వేదికగా తొలి మ్యాచ్ జరుగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్ ప్రస్తుతం ఆధిక్యం 308 పరుగులకు చేరుకుంది. రిషబ్ పంత్ 12 పరుగులు, శుభ్‌మన్ గిల్ 33 పరుగులు చేసి నాటౌట్‌గా వెనుదిరిగారు.
చెన్నై టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత క్రికెట్ జట్టు పూర్తిగా పట్టు బిగించింది. భారత్ చేసిన 376 పరుగులకు సమాధానంగా బంగ్లాదేశ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేయడంతో భారత్ మొత్తం ఆధిక్యం 308 పరుగులకు చేరుకుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రిషబ్ పంత్ 12 పరుగులతో, శుభ్‌మన్ గిల్ 33 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ ఇన్నింగ్స్‌లో భారత ఇద్దరు స్టార్ బ్యాట్స్‌మెన్‌లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఫ్లాప్ అయ్యారు.
దీనికి ముందు, భారత జట్టు నిన్నటి స్కోరు 339/6 స్కోర్‌తో ఆటను ప్రారంభించింది. ఆ తర్వాత భారత జట్టు 376 పరుగుల తర్వాత ఔటైంది. రవిచంద్రన్ అశ్విన్ 113 పరుగులు, రవీంద్ర జడేజా 86 పరుగుల ఇన్నింగ్స్ ఆడారు. బంగ్లాదేశ్ తరపున హసన్ మహమూద్ అత్యధికంగా 5 వికెట్లు తీశాడు. అతనితో పాటు తస్కిన్ అహ్మద్ కూడా 3 వికెట్లు తీశాడు.
బుమ్రా 4 వికెట్లు..
రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు శుభారంభం లభించకపోవడంతో ఆ జట్టు 40 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. జట్టు టాప్ ఆర్డర్ పూర్తిగా ఫ్లాప్ అయింది. బంగ్లాదేశ్ తరపున షకీబ్ హల్ హసన్ తొలి ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 32 పరుగులు చేశాడు. ఇది కాకుండా లిటన్ దాస్ 22 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, మెహదీ హసన్ మిరాజ్ 27 పరుగులతో ఇన్నింగ్స్ ఆడారు. మిగతా ఆటగాళ్లు పూర్తిగా ఫ్లాప్ కావడంతో ఆ జట్టు 149 పరుగులకే పరిమితమైంది. భారత్ తరపున జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు పడగొట్టాడు. అలాగే, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, ఆకాశ్ దీప్ సింగ్ తలో 2 వికెట్లు తీశారు.
రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా టాప్ ఆర్డర్ మరోసారి ఫ్లాప్ అయింది. కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ తక్కువ పరుగులకే ఔటయ్యారు. రోహిత్ శర్మ 5 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ ఇన్నింగ్స్‌లో 10 పరుగుల వద్ద యశస్వి జైస్వాల్ అవుటయ్యాడు. 17 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ ఔటయ్యాడు.
ఇరుజట్ల ప్లేయింగ్ 11
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.
బంగ్లాదేశ్: నజ్ముల్ హసన్ శాంటో (కెప్టెన్), షద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, నహిద్ రాణా, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.