IND vs AUS: సెమీ ఫైనల్ చేరినా.. ఆ విషయంలో కలవరమే.. ఆస్ట్రేలియాతో తలపడే భారత ప్లేయింగ్ 11 ఇదే?

|

Feb 23, 2023 | 7:53 AM

IND vs AUS: టోర్నీలో గ్రూప్ దశలో 3 మ్యాచ్‌లు గెలిచిన భారత జట్టు.. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్, షెఫాలీలు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

IND vs AUS: సెమీ ఫైనల్ చేరినా.. ఆ విషయంలో కలవరమే.. ఆస్ట్రేలియాతో తలపడే భారత ప్లేయింగ్ 11 ఇదే?
Indw Vs Ausw T20 Wc 2023
Follow us on

నాలుగు మ్యాచ్‌ల ఒడిదుడుకుల ప్రదర్శన తర్వాత, దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచ కప్ 2023లో భారత క్రికెట్ జట్టు సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు సెమీ-ఫైనల్‌కు చేరుతుందని మొదట్నుంచీ అంతా భావించారు. టీం ఈ అంచనాలను నిజం చేసింది. ఇక భారత జట్టు వరుసగా రెండోసారి చివరి నాలుగు స్థానాల్లో నిలిచింది. అయితే, జట్టు ప్రదర్శన పూర్తిగా పరిపూర్ణంగా కనిపించలేదు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాంటి పరిస్థితిలో సెమీ ఫైనల్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఏమైనా మార్పు ఉంటుందా అనే ప్రశ్న తలెత్తుతుంది.

ఫిబ్రవరి 23, గురువారం భారత జట్టు ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకోవడానికి వరుసగా రెండోసారి రంగంలోకి దిగనుంది. ఫైనల్‌లో భారత్‌ను ఓడించి పోయినసారి టైటిల్ గెలుచుకున్న ఆస్ట్రేలియా మరోసారి ముందుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమ్ ఇండియాలోని ప్రతి ఆటగాడు అద్భుతంగా రాణించాల్సి ఉంటుంది. కానీ జట్టు మొత్తం ఇంకా లయలో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా జట్టులోని చాలా మంది బ్యాటర్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు.

బ్యాటింగ్‌లో సత్తా చూపని ప్లేయర్స్..

ఇప్పటివరకు ఒక్క సమర్థవంతమైన ఇన్నింగ్స్ కూడా ఆడని ఓపెనర్ షెఫాలీ వర్మ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ల బ్యాటింగ్ అతిపెద్ద ఆందోళనగా మారింది. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో జెమీమా రోడ్రిగ్స్ అద్భుత బ్యాటింగ్ చేసినా ఆ తర్వాత పెద్దగా రాణించలేకపోయింది.

ఇవి కూడా చదవండి

వెటరన్ ఓపెనర్ స్మృతి మంధాన ఐర్లాండ్‌పై 87 పరుగులతోపాటు రెండు వరుస అర్ధ సెంచరీల ఇన్నింగ్స్‌లతో కాస్త పర్వాలేదనిపిస్తోంది. అయితే ఆమె వేగంగా ప్రారంభించడంలో విఫలమవుతోంది.

కెప్టెన్ కౌర్ స్వయంగా ఈ లోపాన్ని అంగీకరించింది. ముఖ్యంగా స్ట్రైక్ రొటేషన్‌ను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెప్పింది. యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిచా ఘోష్ మాత్రమే బలమైన ఫామ్‌లో కనిపించింది. అయితే జట్టులో మార్పు వచ్చినా.. పటిష్ట ఫామ్‌లో ఉన్న ఇలాంటి బ్యాట్స్‌మెన్‌ జట్టులో లేకపోవడంతో సమస్య నెలకొంది.

బౌలింగ్‌లోనూ ఇబ్బందులు..

బౌలింగ్‌లోనూ పరిస్థితి బాగా లేదు. రేణుకా సింగ్, దీప్తి శర్మ మినహా మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన అనుభవజ్ఞురాలైన లెఫ్టార్మ్ స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ ఫామ్‌పై అతిపెద్ద ఆందోళన నెలకొంది. అదే సమయంలో, శిఖా పాండే 2 మ్యాచ్‌లలో ఒక వికెట్ తీసి, పొదుపుగా నిరూపించుకుంది.

పూజా వస్త్రాకర్ కూడా పెద్దగా సహకారం అందించలేకపోయింది. కానీ, టీమ్‌కి ఇంతకుమించి మంచి ఎంపికలు లేవు. అటువంటి పరిస్థితిలో, ప్లేయింగ్ XIలో మార్పులు కనిపించడం లేదు. ఆస్ట్రేలియాపై ఆటగాళ్లందరూ పూర్తి సత్తా చూపించాల్సి ఉంటుంది. లేదంటే సెమసీ్ నుంచే జట్టు ఇంటికి రావాల్సి ఉంటుంది.

సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడే భారత ప్రాబబుల్ ప్లేయింగ్ 11..

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దేవికా వైద్య, పూజా వస్త్రాకర్, శిఖా పాండే, రేణుకా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్.

మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..