Ind vs Aus: హైదరాబాదీలకు అలెర్ట్‌.. ఉప్పల్‌లో ఆసీస్‌తో టీ20 మ్యాచ్‌.. రేపటి నుంచే టికెట్ల విక్రయాలు.. ఎలా పొందాలంటే?

|

Sep 14, 2022 | 9:46 PM

Hyderabad:ఆసీస్‌తో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి 2 మ్యాచ్‌లకు మొహాలి, నాగపూర్‌ వేదిక కానున్నాయి. ఇక మూడో మ్యాచ్‌ సెప్టెంబర్‌ 25న హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో జరగనుంది

Ind vs Aus: హైదరాబాదీలకు అలెర్ట్‌.. ఉప్పల్‌లో ఆసీస్‌తో టీ20 మ్యాచ్‌.. రేపటి నుంచే  టికెట్ల విక్రయాలు.. ఎలా పొందాలంటే?
India Vs Australia
Follow us on

Hyderabad: ప్రతిష్ఠాత్మకమైన టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో తలపడనుంది. ఇరు జట్లతో మొత్తం 6 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్‌, భారత జట్టు స్వ్కాడ్‌ కూడా ఫిక్స్‌ అయింది. కాగా ఆసీస్‌తో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి 2 మ్యాచ్‌లకు మొహాలి, నాగపూర్‌ వేదిక కానున్నాయి. ఇక మూడో మ్యాచ్‌ సెప్టెంబర్‌ 25న హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో జరగనుంది. కాగా కరోనా ప్రారంభమయ్యాక రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఒక్క మ్యాచ్‌ కూడా జరగలేదు. 2020, 2021 ఐపీఎల్‌ సీజన్లకు యూఏఈ ఆతిథ్యం ఇవ్వగా 2022 సీజన్ మ్యాచ్‌లన్నీ అహ్మదాబాద్, ముంబైలోనే జరిగాయి. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ఉప్పల్‌లో మ్యాచ్ నిర్వహించనున్నారు.

కాగా ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులు భారీగా తరలివస్తారన్న అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. మైదానంలో ఏర్పాట్లను హైదరాబాద్ క్రికెట్అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కాగా సెప్టెంబర్‌ 25 న రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుండగా, రేపటి నుంచి టికెట్ల విక్రయం ప్రారంభం కానుంది. పేటీఎం వెబ్‌సైట్‌ లేదా యాప్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులకు టికెట్‌ ధరలపై డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..