AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs AUS: ఆసీస్‌తో టెస్ట్ సిరీస్.. టీమిండియాను భయపెడుతోన్న ఆ ఐదుగురు.. తేడా వస్తే డేంజరే!

మరో రెండు రోజుల్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదలు కానుంది. ఇందులో భారత్, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ లక్ష్యంగా..

IND Vs AUS: ఆసీస్‌తో టెస్ట్ సిరీస్.. టీమిండియాను భయపెడుతోన్న ఆ ఐదుగురు.. తేడా వస్తే డేంజరే!
India Vs Australia Test Series
Ravi Kiran
|

Updated on: Feb 07, 2023 | 9:15 AM

Share

మరో రెండు రోజుల్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదలు కానుంది. ఇందులో భారత్, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతుంటే.. గత సిరీస్ ఓటమికి, భారత్‌లో టెస్ట్ సిరీస్ దక్కించుకోవాలన్న 19 ఏళ్ల నిరీక్షణకు తెరదించడానికి ప్రణాళికలు సిద్దం చేస్తోంది ఆసీస్ జట్టు. ఇక ప్రస్తుత గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే.. టీమిండియా కంటే ఆస్ట్రేలియానే కాస్త మెరుగ్గా ఉందని చెప్పొచ్చు. అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్‌లలో రాటుదేలింది. టెస్టుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అంతేకాదు ఈ ఐదుగురు ప్లేయర్స్ వల్ల టీమిండియాకు ముప్పు పొంచి ఉందని చెప్పాలి. మరి వారెవరంటే.?

ఉస్మాన్ ఖవాజా:

టెస్టుల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు ఈ లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్. ఇంగ్లాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా జట్లపై సెంచరీలతో అదరగొట్టాడు. కానీ భారత్‌లో మాత్రం ఇప్పటివరకు ఒక్క టెస్ట్ ఆడలేదు. అయితేనేం స్పిన్‌ను ఎదుర్కోవడంలో సమర్ధుడు. మరి ఇండియన్ స్పిన్నర్స్ ఖవాజాను ఎట్లా అడ్డుకట్ట వేస్తారో చూడాలి..

మార్నస్ లబూషేన్:

టెస్టుల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న లబూషేన్.. ఆసీస్‌కు కీలక బ్యాటర్. మిడిల్ ఆర్డర్‌లో లబూషేన్ పరుగుల వరద పారిస్తే.. అతడ్ని అడ్డుకోవడం ఇక కష్టమే. అయితే లబూషేన్ ఇప్పటిదాకా భారత గడ్డపై టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. ఇతడికి భారత ఉపఖండం పిచ్‌లపై మాత్రం మంచి గణాంకాలు ఉన్నాయి. మరి చూడాలి ఈసారి లబూషేన్ భారత స్పిన్నర్లను ఎంతమేరకు ఎదుర్కుంటాడో?

స్టీవ్ స్మిత్:

భారత పిచ్‌లపై మంచి రికార్డు ఉన్న స్టీవ్ స్మిత్.. ఆసీస్ బ్యాటింగ్ విభాగంలో సీనియర్ ప్లేయర్. గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్న ఈ ఆటగాడు తిరిగి తన ఫామ్ పొందాడు. వరుస సెంచరీలతో మోత మోగిస్తున్నాడు. ఇక భారత్‌పై 8 శతకాలు స్మిత్ ఖాతాలో ఉన్నాయి. అందులో మూడు భారత గడ్డపై సాధించినవి. ఈ సిరీస్‌లో టీమిండియాకు స్టీవ్ స్మిత్ అత్యంత డేంజర్.

ట్రావిస్ హెడ్:

ఈ ఆటగాడు రెడ్-హాట్ ఫామ్‌లో ఉన్నాడు. జట్టు ఇబ్బందుల్లో పడితే.. మెరుపు ఇన్నింగ్స్‌లతో అలరించడం ట్రావిస్ హెడ్ సత్తా. స్పిన్‌ పిచ్‌లపై హెడ్ ఎదురుదాడికి దిగుతాడు. గతంలోనూ ఇలాంటి సందర్భాలు జరిగాయి. కాబట్టి ఈ విధ్వంసకర ఆటగాడిని భారత్ ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిది.

నాథన్ లియాన్:

టీమిండియాపై నాథన్ లియాన్‌కు అద్బుతమైన రికార్డు ఉంది. 2017 బెంగళూరు టెస్టులో 8 వికెట్లు తీసి తన అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసుకున్నాడు లియాన్. ఇప్పటివరకు భారత్‌పై 34 వికెట్లు తీశాడు ఈ స్పిన్నర్.. అలాగే రన్ మిషన్ విరాట్ కోహ్లిని సైతం ముప్పుతిప్పలు పెట్టగలడు.