IND Vs SA: తుది జట్టులో రహానెకు చోటు లభించడం కష్టమే.. అయ్యర్, విహారి నుంచి పోటీ ఉంటుందన్న గంభీర్..

|

Dec 13, 2021 | 10:25 AM

దక్షిణాఫ్రికా టూర్‌లో అజింక్యా రహానె భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం సంపాదించడం కష్టమని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు...

IND Vs SA: తుది జట్టులో రహానెకు చోటు లభించడం కష్టమే.. అయ్యర్, విహారి నుంచి పోటీ ఉంటుందన్న గంభీర్..
rahane
Follow us on

దక్షిణాఫ్రికా టూర్‌లో అజింక్యా రహానె భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం సంపాదించడం కష్టమని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఇటీవలి కాలంలో పేలవమైన ఫామ్‌తో రహానేకు తుది జట్టులో స్థానం లభించడంపై ఆశలు సన్నగిల్లాయి. గత ఏడాది డిసెంబర్‌లో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసినప్పటి నుంచి రహానె కేవలం రెండు అర్ధ సెంచరీలు మాత్రమే సాధించాడు.

అతను గత 29 ఇన్నింగ్స్‌లలో కేవలం 20 సగటుతో ఉన్నాడు. 2021లో ఇప్పటివరకు 12 టెస్టులు ఆడిన రహానె సగటు 19.57గా ఉంది. ప్రస్తుతం అతను తన కెరీర్‌లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. 2017లో అతని సాధారణ సగటు 34.62 ఉండగా.. 2018లో 30.66గా ఉంది. అయితే రహానె 2019లో 71.33 సగటుతో ఉన్నాడు.

” రహానె ప్రస్తుతం కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. నిజం చెప్పాలంటే.. అజింక్యా రహానె ప్లేయింగ్ XIలో చోటు సంపాదించడం కష్టమని నేను భావిస్తున్నాను” అని స్టార్ స్పోర్ట్స్‌లో గంభీర్ అన్నాడు. ” అతనికి శ్రేయాస్ అయ్యర్ పోటీగా ఉన్నాడు. అయ్యర్ ఇటీవలి ప్రదర్శనల కారణంగా అతనిని డ్రాప్ చేయడం ఎవరికీ ఇష్టముండకపోవచ్చు. అదే సమయంలో హనుమ విహారి కూడా చాలా బాగా రాణిస్తున్నాడు.” అని గౌతమ్ చెప్పాడు.

భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ విదేశీ పరిస్థితులలో “అనుభవం” ఉన్న కారణంగా రహానెకు మద్దతుగా పలికాడు. “అజింక్య రహానె దక్షిణాఫ్రికా పర్యటనలో చోటు సంపాదించడం మంచిదే.. ఎందుకంటే మీకు ఖచ్చితంగా అక్కడ అనుభవం అవసరం. అతను మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఆడతాడా అనేది ప్రశ్నార్థకం మరింది. ఒకవేళ ఆడితే ఆ టెస్ట్ మ్యాచ్ అతనికి కీలకం కానుంది.” అని గౌతమ్ గంభీర్ వివరించాడు.

Read Also.. IND vs AUS: రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు.. కెప్టెన్సీ తొలి మ్యాచ్‌లో అదరగొట్టినా.. భారత జట్టుకు మాత్రం విజయం అందించలే..!