వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో ప్రారంభమయ్యే T20 ప్రపంచ కప్ కోసం టీమ్ ఇండియా తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. సోమవారం, 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించగా, ఇప్పుడు జట్టు కొత్త జెర్సీ గురించి సమాచారం అందింది. భారత క్రికెట్ జట్టు ‘MPL స్పోర్ట్స్’ అధికారిక కిట్ భాగస్వామి ఒక వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. దీనిలో భారత జట్టు కొత్త జెర్సీతో T20 ప్రపంచ కప్‌లోకి ప్రవేశిస్తుందని వెల్లడించింది.
ఈ వీడియోలో రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా కనిపిస్తున్నారు. ‘అభిమానులుగా మీరు మమ్మల్ని క్రికెటర్లుగా మార్చారు’ అని రోహిత్ శర్మ చెబుతున్నాడు. మీరు ఇచ్చే ఉత్సాహం లేకుంటే ఆటలో మజా ఉండదు’ అని శ్రేయాస్ అంటున్నాడు. ఆ తర్వాత, హార్దిక్ పాండ్యా టీమ్ ఇండియా కొత్త జెర్సీలో భాగం కావాలని అభిమానులను కోరడం వీడియోలో చూడొచ్చు.
ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే, అభిమానులు కొత్త జెర్సీ కోసం సలహాలు ఇవ్వడం ప్రారంభించారు. కొంతమంది పాత స్కై బ్లూ కలర్ జెర్సీని డిమాండ్ చేస్తుండగా, కొందరు 2007 లో జరిగిన మొదటి T20 ప్రపంచ కప్‌లో ఉన్న జెర్సీనే ఈసారి కూడా ఉపయోగించండి అంటూ కామెట్లు చేస్తున్నారు.
The game is not really the same without you guys cheering us on!
Show your fandom along with @BCCI for the game by sharing your fan moments on https://t.co/jH9ozOU1e9#MPLSports #IndianCricketTeam #ShareYourFanStories #CricketFandom #loveforcricket #cricket pic.twitter.com/VObQ3idfUz— MPL Sports (@mpl_sport) September 13, 2022
అక్టోబరు 22 నుంచి సూపర్-12 మ్యాచ్ ప్రారంభం..
టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 22న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. అయితే, దీనికి ముందు, అక్టోబర్ 16 నుంచి 21 మధ్య క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు కూడా జరుగుతాయి. భారత జట్టు అక్టోబర్ 23న పాకిస్థాన్‌తో ఇక్కడ తొలి మ్యాచ్ ఆడనుంది.