8 పరుగులకే నాలుగు వికెట్లు.. ఆరుగురు బ్యాట్స్‌మెన్లు ఖాతానే తెరవలేదు.. టీమిండియా వరస్ట్ రికార్డు

|

Aug 10, 2021 | 3:27 PM

2014 ఇంగ్లాండ్ పర్యటన టీమిండియాకు మాయని మచ్చ. అప్పుడు జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌ను 3-1తేడాతో భారత్ పరాజయాన్ని...

8 పరుగులకే నాలుగు వికెట్లు.. ఆరుగురు బ్యాట్స్‌మెన్లు ఖాతానే తెరవలేదు.. టీమిండియా వరస్ట్ రికార్డు
Virat Kohli
Follow us on

2014 ఇంగ్లాండ్ పర్యటన టీమిండియాకు మాయని మచ్చ. అప్పుడు జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌ను 3-1తేడాతో భారత్ పరాజయాన్ని చవిచూసింది. ఈ సిరీస్‌లోని నాలుగో మ్యాచ్‌లో ఇండియా ఇన్నింగ్స్, 54 పరుగుల తేడాతో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం నుంచే టీమిండియా పేలవ ప్రదర్శనను కనబరిచింది. తొలి రోజే భారత్ ఎనిమిది పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ మ్యాచ్ గురించి ఒకసారి పరిశీలిస్తే..

ఓల్డ్ ట్రాఫోర్డ్‌ వేదికగా ఇండియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ జరిగింది. టాస్ గెలిచి భారత కెప్టెన్ ధోని బ్యాటింగ్ ఎంచుకోగా.. కొద్దిసేపటికే అతడి నిర్ణయం తప్పు అని తేలింది. జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ పదునైన బంతులు ఎదుర్కోవడంలో టీమిండియా టాప్ ఆర్డర్ విఫలమైంది. ఎనిమిది పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. మురళీ విజయ్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగారు. ఇలాంటి పరిస్థితిలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (71), రవిచంద్రన్ అశ్విన్ (40)తో కలిసి చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయినా అది ప్రయోజనం లేకపోయింది. ఫలితంగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకు ఆలౌట్ అయింది. బ్రాడ్ 25 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు.

ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జో రూట్ (77), జోస్ బట్లర్ (70), ఇయాన్ బెల్ (58) హాఫ్ సెంచరీలతో సహాయంతో 367 పరుగులు చేసింది. దీనితో మొదటి ఇన్నింగ్స్ 215 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, వరుణ్ ఆరోన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

రెండో ఇన్నింగ్స్‌లో భారత్ మంచి శుభారంభాన్ని పొందిందని అనుకునేలోపే సీన్ రివర్స్ అయింది. హాఫ్ స్పిన్నర్ మొయిన్ అలీ దెబ్బకు 108 పరుగులకు తొమ్మిది వికెట్లు కోల్పోయింది. దీంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 161 పరుగులకు ఆలౌట్ అయింది. ఇన్నింగ్స్, 54 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవి చూసింది.

Also Read:

సింహాన్ని గాల్లో గింగిరాలు కొట్టించిన గేదె.. కొమ్ములతో పొడుస్తూ బీభత్సం.. వైరల్ వీడియో!

బైక్ డూమ్ నుంచి వింత శబ్దాలు.. తెరిచి చూస్తే షాక్.. నెట్టింట వైరల్!