IND vs BAN: బంగ్లా ముందు భారీ టార్గెట్.. హాఫ్ సెంచరీలతో సత్తా చాటిన కోహ్లీ, రాహుల్..

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 184 పరుగలు చేసింది. దీంతో బంగ్లాదేశ్‌ ముందు 185 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.

IND vs BAN: బంగ్లా ముందు భారీ టార్గెట్.. హాఫ్ సెంచరీలతో సత్తా చాటిన కోహ్లీ, రాహుల్..
Kohli Kl Rahul

Updated on: Nov 02, 2022 | 3:23 PM

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 184 పరుగలు చేసింది. దీంతో బంగ్లాదేశ్‌ ముందు 185 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. రోహిత్ శర్మ తొందరగానే ఔటయ్యాడు. కేఎల్ రాహుల్-విరాట్ కోహ్లీ మధ్య 67 పరుగుల భాగస్వామ్యం, కోహ్లీ-సూర్యకుమార్ మధ్య 38 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. ఈ క్రమంలో రాహుల్ 50, కోహ్లీ 64 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. సూర్య మాత్రం 187 స్ట్రైక్ రేట్‌తో 30 పరుగులు చేశాడు. చివర్లో అశ్విన్ 6 బంతుల్లో 1 సిక్స్, 1 ఫోర్‌తో 13 పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో హసన్ 3, షకిబ్ ల్ హసన్ 2 వికెట్లు పడగొట్టారు.

ఈ ప్రపంచకప్‌లో కోహ్లీ మళ్లీ అద్భుతాలు చేసి మూడో అర్ధశతకం సాధించాడు. అతని అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో ఇది 36వ అర్ధశతకంగా నిలిచింది. టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

భారత ప్లేయింగ్ XI:

కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్

బంగ్లాదేశ్ ప్లేయింగ్ XI:

నజ్ముల్ హొస్సేన్ శాంటో, లిట్టన్ దాస్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), అఫీఫ్ హుస్సేన్, యాసిర్ అలీ, మొసద్దెక్ హొస్సేన్, షోరిఫుల్ ఇస్లాం, నూరుల్ హసన్(కీపర్), ముస్తాఫిజుర్ రెహ్మాన్, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..