T20 World Cup: సెమీ ఫైనల్స్ రేసులో పాకిస్తాన్.. మిగతా3 జట్లపై లిటిల్ మాస్టర్ ఏమన్నారంటే?

|

Oct 20, 2022 | 6:47 PM

Sachin Tendulkar Picks 4 Semi-Finalists: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ T20 ప్రపంచ కప్ 2022లో సెమీ ఫైనల్ చేరే నాలుగు జట్లను తేల్చేశారు. అలాగే సెమీస్ రేసు నుంచి తప్పుకునే రెండు జట్లను కూడా ప్రకటించారు.

T20 World Cup: సెమీ ఫైనల్స్ రేసులో పాకిస్తాన్.. మిగతా3 జట్లపై లిటిల్ మాస్టర్ ఏమన్నారంటే?
Shahid Afridi Fastest Odi Century With Sachin Bat
Follow us on

ఈ వారాంతం నుంచి క్రికెట్ అభిమానులందరి దృష్టి ఆస్ట్రేలియాలో జరిగే T20 ప్రపంచ కప్‌ 2022పైనే ఉంటుంది. డిఫెండింగ్ ఛాంపియన్, ఆతిథ్య ఆస్ట్రేలియా మరో గొప్ప ప్రదర్శన ఇవ్వాలని చూస్తుండగా, భారత్‌తోపాటు పాకిస్తాన్, ఇతర పెద్ద జట్లు ట్రోఫీని గెలవాలని కోరుకుంటున్నాయి. అయితే, ప్రస్తుతం క్వాలిఫయర్ మ్యాచ్‌లు చివర దశలో ఉన్నాయి. శనివారం నుంచి సూపర్ 12 మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. ఈ క్రమంలో అప్పుడు సెమీఫైనల్ చేరే జట్లపై వాదనలు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు మాజీలు సెమీఫైనల్ చేరే జట్లేవే తేల్చేశారు. ఇక తాజాగా ఈ లిస్టులో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా చేరిపోయారు. తన దృష్టిలో ఆ నాలుగు జట్లే సెమీస్ రేసులో నిలుస్తాయని ప్రకటించారు. అలాగే ఈ రేసు నుంచి తప్పుకునే రెండు జట్లను కూడా ఆయన చెప్పేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

టెండూల్కర్ ది టెలిగ్రాఫ్‌తో మాట్లడుతూ.. టీమిండియా తప్పకుండా ఛాంపియన్‌గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా దృష్టిలో భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు సెమీ ఫైన్ల రేసులో నిలుస్తాయి. ఇక దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ టీంలు ఈ రేసు నుంచి ఔటవుతాయి. సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికాకు భారత్‌లో ఎదురయ్యే పరిస్థితులే ఇందుకు కారణం అంటూ సౌతాఫ్రికా టీంను పక్కన పెట్టేశారు. కాగా, ఆదివారం మెల్‌బోర్న్‌లో పాకిస్తాన్‌తో టీమిండియా తన ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది.

“అవును, భారత జట్టుకు చాలా మంచి అవకాశం ఉంది. ఈ జట్టు బాగా బ్యాలెన్స్‌గా ఉంది. విదేశాల్లో బాగా ఆడగల జట్టును కలిగి ఉన్నాం. భారత అవకాశాలపై నేను చాలా ఆశతో ఉన్నాను” అంటూ టెండూల్కర్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

జస్ప్రీత్ బుమ్రా ఈ మెగా ఈవెంట్‌ నుంచి తప్పుకోవడంపై కూడా సచిన్ మాట్లాడారు. “అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకరు లేకపోవడం స్పష్టంగా జట్టుపై ప్రభావం చూపుతుంది. బుమ్రా ఎల్లప్పుడూ 11 మంది ప్రధాన ఆటగాళ్ళలో ఒకడు. స్ట్రైక్ బౌలర్, అద్భుతమైన ఆటగాడు. కానీ, సానుకూల విషయం ఏమిటంటే జట్టు బలంగా ఉంది. దీనిని అంగీకరించి ముందుకు సాగాలి. ఎందుకంటే ఎదురుదెబ్బలతో కూరుకుపోతే, ముందుకు సాగడం చాలా కష్టం. బుమ్రా స్థానంలో వచ్చిన మహమ్మద్ షమీ కూడా అనుభవజ్ఞుడు, సమర్ధుడు. గతంలో మంచి ప్రదర్శన కనబరిచిన బౌలర్. అతను ఒక విలువైన భర్తీ చేయగలడు. ఈ విషయం ఇప్పటికే నిరూపించుకుంటున్నాడు” అంటూ సచిన్ తెలిపారు.

టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్ – రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్.

భారత జట్టు షెడ్యూల్..

టీ20 ప్రపంచకప్‌లో భారత షెడ్యూల్ ఎలా ఉందో ఓసారి చూద్దాం.. అక్టోబర్ 23న పాకిస్థాన్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. అక్టోబరు 27న నెదర్లాండ్స్ జట్టుతో తలపడనుంది. ఆ తర్వాత అక్టోబర్ 30న దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడనుంది. ఇక నవంబర్ 2న బంగ్లాదేశ్‌తో ఢీకొననుంది. సూపర్ 12లో తన చివరి మ్యాచ్‌ను నవంబర్ 6న క్వాలిఫయర్స్‌లోని గ్రూప్ B రెండవ జట్టుతో తలపడుతుంది.

ఆస్ట్రేలియాలో టీ20లో టీమిండియా రికార్డు..

ఆస్ట్రేలియాలో భారత జట్టు అత్యుత్తమ రికార్డును కలిగి ఉంది. ఆస్ట్రేలియాలో టీమ్ ఇండియా 12 టీ20 మ్యాచ్‌ల్లో 7 గెలిచింది. 4 ఓడిపోయింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.