Emerging Asia Cup 2024: 8 ఫోర్లు, 2 సిక్స్‌లు.. మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్‌‌తో హాఫ్ సెంచరీ.. కట్‌చేస్తే..

India A vs Afghanistan A: ఎమర్జింగ్ ఆసియా కప్ 2024లో టీమిండియాతోపాటు పాకిస్తాన్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. లీగ్ దశలో విజయాలతో ఆకట్టుకన్నా.. సెమీస్ పోరులో మాత్రం చతికిలపడిపోయారు. దీంతో ఫైనల్ ఆడకుండానే ఇరుజట్లు వెనుదిరిగాయి. అక్టోబర్ 27న ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాయి.

Emerging Asia Cup 2024: 8 ఫోర్లు, 2 సిక్స్‌లు.. మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్‌‌తో హాఫ్ సెంచరీ.. కట్‌చేస్తే..
Ind A Vs Afg A
Follow us

|

Updated on: Oct 26, 2024 | 7:09 AM

IND A vs AFG A: ఎమర్జింగ్ ఆసియా కప్ 2024లో, భారత జట్టు హ్యాట్రిక్ సాధించి సెమీ-ఫైనల్‌లోకి ప్రవేశించింది. అయితే ఫైనల్ ఆడే కల చెదిరిపోయింది. ఆఖరి పోరులో భారత్-పాకిస్థాన్‌లు ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూశారు. కానీ, ఇప్పుడు భారత్‌, పాకిస్థాన్‌లు కనిపించకుండానే ఆసియా కప్ ఫైనల్ జరగనుంది. సెమీస్‌లో ఇరు జట్లూ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. తొలుత పాకిస్థాన్‌ను శ్రీలంక ఓడించింది. ఆ తర్వాత భారత్‌పై అఫ్ఘానిస్థాన్‌ విజయం సాధించి, ఫైనల్ టిక్కెట్ సంపాదించింది.

ఆఫ్ఘనిస్తాన్ పవర్ ఫుల్ బ్యాటింగ్..

భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అఫ్గాన్ ఓపెనర్లు టీమ్ ఇండియా బౌలర్లపై ఊచకోత కోశారు. జుబైద్ అక్బరీ 41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేశాడు. మరో ఎండ్‌లో సాదికుల్లా అటల్ కూడా తన బ్యాట్‌తో సందడి చేశాడు. అటల్ 52 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. మూడో స్థానంలో ఉన్న కరీం జన్నత్ 20 బంతుల్లో 41 పరుగులు చేసి జట్టు స్కోరును 200లు దాటించాడు.

రాశిఖ్ అద్భుతమైన బౌలింగ్..

భారత్‌ నుంచి రాసిక్‌ సలామ్‌ మాత్రమే ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఆఫ్ఘన్ ఓపెనర్లు 137 పరుగుల భాగస్వామ్యంతో ఆకట్టుకున్నారు. ఆఫ్ఘన్ జట్టు స్కోరు బోర్డుపై 206 పరుగులు చేసింది. ప్రతీకారం తీర్చుకోవడంలో టీమ్ ఇండియా తేలిపోయింది.

రమణదీప్‌ ఆశలు పెంచినా..

భారత్ తరపున రమణదీప్ సింగ్ కృషి ఫలించలేదు. అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నారు. ఆయుష్ బదోని 31 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. కానీ భారీ స్కోరు చేయడంలో విజయం సాధించలేకపోయాడు. బ్యాటింగ్‌కు వచ్చిన రమణదీప్ సింగ్ ఆఫ్ఘనిస్థాన్‌కు ఊపిరి పీల్చుకోనివ్వలేదు. 34 బంతుల్లో 64 పరుగులు చేసినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. దీంతో అక్టోబర్ 27న ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!