AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India A vs Bangladesh A : టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించిన బంగ్లాదేశ్.. 18 బంతుల్లో 48 రన్స్ చేసిన మెహరూబ్

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2025లో తొలి సెమీ-ఫైనల్‌ మ్యాచ్‌‎లో బంగ్లాదేశ్ A జట్టు టీమిండియా A ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో దూకుడుగా ఆడి భారత్‌కు 195 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. చివరి వరకు నిలకడగా ఆడిన హబీబుర్ రెహమాన్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో రాణించగా, ఆఖర్లో వచ్చిన బ్యాట్స్‌మెన్ ఎస్ఎం మెహరూబ్ భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు.

India A vs Bangladesh A : టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించిన బంగ్లాదేశ్.. 18 బంతుల్లో 48 రన్స్ చేసిన మెహరూబ్
India A Vs Bangladesh A (1)
Rakesh
|

Updated on: Nov 21, 2025 | 5:07 PM

Share

India A vs Bangladesh A : రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2025లో తొలి సెమీ-ఫైనల్‌ మ్యాచ్‌‎లో బంగ్లాదేశ్ A జట్టు టీమిండియా A ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో దూకుడుగా ఆడి భారత్‌కు 195 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. చివరి వరకు నిలకడగా ఆడిన హబీబుర్ రెహమాన్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో రాణించగా, ఆఖర్లో వచ్చిన బ్యాట్స్‌మెన్ ఎస్ఎం మెహరూబ్ భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా మ్యాచ్ చివరిలో బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేసిన తీరుతో భారత శిబిరంలో ఆందోళన మొదలైంది.

దోహా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇండియా A కెప్టెన్ జితేష్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే, బంగ్లాదేశ్ A జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 194 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీనితో ఫైనల్లో అడుగుపెట్టాలంటే టీమిండియా A ముందు 195 పరుగుల భారీ లక్ష్యం ఉంది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ A జట్టుకు ఓపెనర్లు హబీబుర్ రెహమాన్ సోహన్, జిషాన్ ఆలం మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి 43 పరుగుల భాగస్వామ్యం అందించిన తర్వాత, భారత పేసర్ గుర్జప్నీత్ సింగ్ తొలి వికెట్ (జిషాన్ ఆలం) పడగొట్టి భారత్‌కు తొలి ఊరటనిచ్చాడు. 76 పరుగుల వద్ద జవాద్ అబ్రార్ (13) ఔట్ అవ్వడం, ఆ తర్వాత కెప్టెన్ అక్బర్ అలీ, అబు వంటి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ త్వరగా పెవిలియన్ చేరడంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ కొంత తడబడింది.

ఒకవైపు వికెట్లు పడుతున్నా, ఓపెనర్ హబీబుర్ రెహమాన్ నిలకడగా ఆడి అత్యధికంగా 65 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 15వ ఓవర్ తర్వాత కొంత పట్టు కోల్పోయినట్లు కనిపించింది. అయితే చివరి ఓవర్లలో బ్యాటింగ్‌కు వచ్చిన ఎస్ఎం మెహరూబ్ అద్భుతమైన ప్రదర్శనతో భారత బౌలర్ల లెక్కలన్నీ తప్పించాడు. హబీబుర్ రెహమాన్ అండతో మెహరూబ్ చివర్లో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ కారణంగానే బంగ్లాదేశ్ స్కోరు అమాంతం పెరిగింది. బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 194 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత బౌలర్లలో ఫాస్ట్ బౌలర్ గుర్జప్నీత్ సింగ్ రెండు కీలక వికెట్లు తీసి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తన ఫేవరేట్ టీం మ్యాచ్‌లు చూసేందుకు ఏకంగా ఇంటినే అమ్మేసిన ఫ్యాన్..
తన ఫేవరేట్ టీం మ్యాచ్‌లు చూసేందుకు ఏకంగా ఇంటినే అమ్మేసిన ఫ్యాన్..
సోషల్ మీడియా అద్భుతం.. 15 ఏళ్ల తర్వాత కన్నవారి చెంతకు
సోషల్ మీడియా అద్భుతం.. 15 ఏళ్ల తర్వాత కన్నవారి చెంతకు
క్రేన్‌నే బోల్తా కొట్టించిన గ్యాస్ ట్యాంకర్.. అసలు మ్యాటర్ ఏంటంటే
క్రేన్‌నే బోల్తా కొట్టించిన గ్యాస్ ట్యాంకర్.. అసలు మ్యాటర్ ఏంటంటే
3 నెలలుగా ట్రెండింగ్.. కుర్రాళ్లు తెగ పాడుకుంటున్న సాంగ్..
3 నెలలుగా ట్రెండింగ్.. కుర్రాళ్లు తెగ పాడుకుంటున్న సాంగ్..
పెన్షన్ కోసం 90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ. మోసుకెళ్లిన కోడలు
పెన్షన్ కోసం 90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ. మోసుకెళ్లిన కోడలు
'అమెరికా ఫస్ట్' కొత్త వీసా షెడ్యూలింగ్ టూల్‌
'అమెరికా ఫస్ట్' కొత్త వీసా షెడ్యూలింగ్ టూల్‌
పొలం చదును చేస్తుండగా అద్భుతం..అమితానందంలో రైతు!
పొలం చదును చేస్తుండగా అద్భుతం..అమితానందంలో రైతు!
1997 సమయంలో హైటెక్ సిటీలో గజం భూమి ధర ఎంతో తెలుసా..?
1997 సమయంలో హైటెక్ సిటీలో గజం భూమి ధర ఎంతో తెలుసా..?
గుప్తనిధులపై పాములు నిజంగానే కాపలాగా ఉంటాయా, నిజమా? కేవలం అపోహేనా
గుప్తనిధులపై పాములు నిజంగానే కాపలాగా ఉంటాయా, నిజమా? కేవలం అపోహేనా
SRH vs RR: ఎలిమినేటర్‌కు వర్షం ముప్పు? క్వాలిఫైయర్ 2కు చేరేదెవరు?
SRH vs RR: ఎలిమినేటర్‌కు వర్షం ముప్పు? క్వాలిఫైయర్ 2కు చేరేదెవరు?