AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND W vs PAK W: ఆసియా కప్‌లో భారత్ పాక్ పోరు..ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ?

IND W vs PAK W: మహిళల ఆసియా కప్ 2026లో భారత్, పాకిస్తాన్ జట్లు సెప్టెంబర్ 5న దుబాయ్‌లో తలపడనున్నాయి. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో పాటు సోనీ లివ్‌లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన నేతృత్వంలో టీమిండియా విజయంపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

IND W vs PAK W: ఆసియా కప్‌లో భారత్ పాక్ పోరు..ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ?
Ind W Vs Pak W
Rakesh
|

Updated on: Sep 04, 2026 | 2:56 PM

Share

IND W vs PAK W: మహిళల ఆసియా కప్ 2026లో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు హాంకాంగ్‌ను 137 పరుగుల భారీ తేడాతో ఓడించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ఈ విజయంతో టోర్నమెంట్ సెమీఫైనల్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. గ్రూప్ ‘ఎ’ లో ఉన్న భారత్ వరుసగా తొలి మ్యాచ్‌లో థాయిలాండ్‌ను 94 పరుగులతో, రెండో మ్యాచ్‌లో హాంకాంగ్‌ను చిత్తు చేసి సెమీస్‌కు అర్హత సాధించింది. హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ స్మృతి మంధాన కేవలం 64 బంతుల్లో 7 సిక్సర్లు, 14 ఫోర్లతో 124 పరుగులు చేసి చారిత్రాత్మక సెంచరీ సాధించింది.

భారత్ అద్భుత బౌలింగ్

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 193 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్ జట్టును భారత బౌలర్లు కేవలం 56 పరుగులకే ఆలౌట్ చేశారు. దీప్తి శర్మ 3 వికెట్లతో చెలరేగగా, ప్రేమా రావత్, నందిని శర్మ, శ్రీ చరణి తలో రెండు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. సెమీఫైనల్స్ ప్రారంభమయ్యే ముందే గ్రూప్ స్టేజ్‌లో భారత్ తన చివరి మ్యాచ్‌ను సాంప్రదాయ ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడనుంది.

భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పూర్తి వివరాలు:

మ్యాచ్ తేదీ: శనివారం, సెప్టెంబర్ 5, 2026.

వేదిక: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్.

మ్యాచ్ సమయం: భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 8:00 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది (టాస్ రాత్రి 7:30 గంటలకు పడుతుంది).

లైవ్ టెలికాస్ట్ (టీవీ): సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (Sony Sports Ten 1, Sony Sports Ten 3, Sony Sports Ten 4).

లైవ్ స్ట్రీమింగ్ (యాప్ & వెబ్‌సైట్): సోనీ లివ్ యాప్, వెబ్‌సైట్.

జట్ల వివరాలు :

భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, దీప్తి శర్మ, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, భారతి ఫుల్మాలి, రేణుకా సింగ్, షెఫాలీ వర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), కమాలిని (వికెట్ కీపర్), నందిని శర్మ, ప్రతీక్ రావుల్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, ప్రేమా రావత్.

పాకిస్తాన్ మహిళల జట్టు: ఫాతిమా సనా (కెప్టెన్), ఆయేషా జాఫర్, నష్రా సంధు, గుల్ ఫిరోజా (వికెట్ కీపర్), మునీబా అలీ (వికెట్ కీపర్), వహీదా అక్తర్, తుబా హసన్, సాదియా ఇక్బాల్, ఉమ్మే హనీ, సదాఫ్ షామ్స్, మోమినా రియాసత్, ఐమన్ ఫాతిమా, సాయిరా జబీన్, షైవాల్ జుల్ఫికర్, ఈమాన్ నసీర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us