IND vs ZIM: మూడో టీ20లో సంజూ శాంసన్‌కు నో ఛాన్స్.. వారికోసం బెంచ్‌పైనే.. ఎందుకంటే?

|

Jul 09, 2024 | 6:31 PM

ZIMBABWE vs INDIA 3rd T20I: జింబాబ్వే తర్వాత భారత్ కూడా శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆటగాళ్లకు ఇక్కడ మరిన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం వస్తే.. ఈ టూర్‌లో వారి ఆత్మవిశ్వాసం చాలా పెరుగుతుంది. ఈ కారణంగా సంజూ శాంసన్‌ను ప్రస్తుతం ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చరని తెలుస్తోంది. శ్రీలంక టూర్‌లో కూడా శాంసన్ ఆడే అవకాశం ఉంది. అతనికి ఖచ్చితంగా ఇక్కడ ఆడే అవకాశం లభించవచ్చు. అందుకే మరో రెండు మ్యాచ్‌ల్లో యువ ఆటగాళ్లకే అవకాశం ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

IND vs ZIM: మూడో టీ20లో సంజూ శాంసన్‌కు నో ఛాన్స్.. వారికోసం బెంచ్‌పైనే.. ఎందుకంటే?
Sanju Samson Ind Vs Zim 3rd T20i
Follow us on

ZIMBABWE vs INDIA 3rd T20I: భారత్-జింబాబ్వే మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్ జులై 10న జరగనుంది. ఇప్పటివరకు సిరీస్‌లో ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి. తొలి మ్యాచ్‌లో జింబాబ్వే గెలవగా, రెండో మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే కూడా సిరీస్‌లోని మిగిలిన మూడు మ్యాచ్‌ల కోసం టీమ్ ఇండియాలో చేరారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఈ ఆటగాళ్లను ఎలా సర్దుబాటు చేయాలనే సందిగ్ధంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ ఉన్నారు.

టీ20 ప్రపంచకప్‌లో సంజూ శాంసన్‌కు ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు. జింబాబ్వే పర్యటనలో అతను జట్టు సీనియర్ ఆటగాడు, ఇంతకు ముందు ఇక్కడ ఆడిన అనుభవం ఉన్నప్పటికీ, సంజూ శాంసన్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం ఇవ్వాలని జట్టు కోరుతోంది. అయితే సంజూ శాంసన్‌కు ఎందుకు ఛాన్స్ ఇవ్వకూడదో నిపుణులు వివరిస్తున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు..

జింబాబ్వే పర్యటనకు యువ ఆటగాళ్లను మాత్రమే పంపారు. ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు జరిగాయి. తొలి మ్యాచ్‌లో అందరికీ బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినా రెండో మ్యాచ్‌లో ధృవ్ జురెల్, రియాన్ పరాగ్ లాంటి ఆటగాళ్లు ఆడే అవకాశం రాలేదు. ఇటువంటి పరిస్థితిలో, కేవలం ఒక ఇన్నింగ్స్ ఆధారంగా ఈ ఆటగాళ్లను డ్రాప్ చేయడం సరికాదు. ఇప్పుడు వారికి కనీసం మరో మ్యాచ్‌లోనైనా అవకాశం దక్కాల్సి ఉంది. రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, సాయి సుదర్శన్‌లు భారత్‌కి భవిష్యత్తు ఆటగాళ్లు. కాబట్టి వారికి మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది.

జింబాబ్వే తర్వాత భారత్ కూడా శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆటగాళ్లకు ఇక్కడ మరిన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం వస్తే.. ఈ టూర్‌లో వారి ఆత్మవిశ్వాసం చాలా పెరుగుతుంది. ఈ కారణంగా సంజూ శాంసన్‌ను ప్రస్తుతం ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చరని తెలుస్తోంది. శ్రీలంక టూర్‌లో కూడా శాంసన్ ఆడే అవకాశం ఉంది. అతనికి ఖచ్చితంగా ఇక్కడ ఆడే అవకాశం లభించవచ్చు. అందుకే మరో రెండు మ్యాచ్‌ల్లో యువ ఆటగాళ్లకే అవకాశం ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..