
Zimbabwe vs India, 4th T20I: జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో భాగంగా నాలుగో మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-1 ఆధిక్యంతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. సిరీస్‌లో ఐదో మ్యాచ్ జులై 14న జరగనుంది.
భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. అనంతరం భారత్ 15.2 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది.
భార ఓపెనర్లు జైస్వాల్, గిల్‌ల మధ్య అజేయంగా 156 పరుగుల భాగస్వామ్యం ఉంది. యశస్వి జైస్వాల్ 53 బంతుల్లో అజేయంగా 93 పరుగులు, శుభ్‌మన్ గిల్ 39 బంతుల్లో 58 పరుగులు చేశారు.
అంతకుముందు జింబాబ్వే తరపున కెప్టెన్ సికందర్ రజా అత్యధికంగా 46 పరుగులు చేశాడు. వీరితో పాటు తాడివనాశే మారుమణి 32 పరుగులు, వెస్లే మాధవరే 25 పరుగులు అందించారు. జింబాబ్వే ఓపెనర్లు తాడివనాషే మారుమణి (32), వెస్లీ మాధవరే (25) మధ్య 63 పరుగుల భాగస్వామ్యం ఉంది.
భారత్ తరపున ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీశాడు. శివమ్ దూబే, అభిషేక్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు. జోనాథన్ క్యాంప్‌బెల్‌ను రవి బిష్ణోయ్ తన బౌలింగ్‌లో రనౌట్ చేశాడు.
A sparkling 🔟-wicket win in 4th T20I ✅
An unbeaten opening partnership between Captain Shubman Gill (58*) & Yashasvi Jaiswal (93*) seals the series for #TeamIndia with one match to go!
Scorecard ▶️ https://t.co/AaZlvFY7x7#ZIMvIND | @ShubmanGill | @ybj_19 pic.twitter.com/xJrBXlXLwM
— BCCI (@BCCI) July 13, 2024
భారత్: శుభమన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ఖలీల్ అహ్మద్.
జింబాబ్వే: అలెగ్జాండర్ రజా (కెప్టెన్), తాడివనాషే మారుమణి, వెస్లీ మాధవరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, జోనాథన్ క్యాంప్‌బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే (కెప్టెన్), రిచర్డ్ నగరావా, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..