IND vs WI: 60కి పైగా సగటు.. అయినా, 3 ఏళ్లుగా 11 మ్యాచ్‌లే.. శాంసన్‌కి ఎందుకు అవకాశం దక్కడంలేదు? ఇదిగో కారణం..

|

Jul 28, 2023 | 1:40 PM

Sanju Samson: టెస్టు తర్వాత వన్డే సిరీస్‌లోనూ టీమిండియా అద్భుతంగా శుభారంభం చేసింది. తొలి వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారత్ ఐదు వికెట్ల తేడాతో (India Vs West Indies) విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యాన్ని కొనసాగించింది.

IND vs WI: 60కి పైగా సగటు.. అయినా, 3 ఏళ్లుగా 11 మ్యాచ్‌లే..  శాంసన్‌కి ఎందుకు అవకాశం దక్కడంలేదు? ఇదిగో కారణం..
Sanju Samson
Follow us on

టెస్టు తర్వాత వన్డే సిరీస్‌లోనూ టీమిండియా అద్భుతంగా శుభారంభం చేసింది. తొలి వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారత్ ఐదు వికెట్ల తేడాతో (India Vs West Indies) విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యాన్ని కొనసాగించింది. బార్బడోస్‌లో వెస్టిండీస్‌ను కేవలం 114 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా.. 22.5 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో జట్టు ఈ స్వల్ప స్కోర్‌ను చేరేందుకు చెమటలు కక్కింది. అయితే కెప్టెన్ రోహిత్, కోచ్ రాహుల్ ద్రవిడ్‌లపై సోషల్ మీడియాలో చాలా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దానికి ప్రధాన కారణం సంజూ శాంసన్ (Sanju Samson)ని తొలి వన్డే మ్యాచ్‌లో ఆడనివ్వకపోవడమే.

వెస్టిండీస్‌తో టీమ్ ఇండియా తన ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటించిన వెంటనే.. అందులో శాంసన్ పేరు కనపడలేదు. శాంసన్‌కు బదులుగా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేసి మిడిలార్డర్‌లో సూర్యకుమార్‌కు బ్యాటింగ్ బాధ్యతలు అప్పగించారు. సంజూ జట్టులో లేకపోవడంతో ఆగ్రహించిన అభిమానులు ప్లేయింగ్ ఎలెవన్ గురించి ప్రశ్నలు సంధించారు. వన్డేల్లో 60కి పైగా సగటు ఉన్న సంజూ శాంసన్‌కు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. అలాగే శాంసన్ కంటే అధ్వాన్నమైన సగటు ఉన్న ఆటగాళ్లు ఎందుకు ఎక్కువ అవకాశాలు పొందుతున్నారు? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకీ సంజుకి జట్టులో ఎందుకు అవకాశం రావడం లేదు? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

మొదటి కారణం..

సంజూ శాంసన్ అత్యుత్తమ ఆటగాడనడంలో సందేహం లేదు. కానీ, మిడిలార్డర్ విషయానికి వస్తే సూర్యకుమార్ యాదవ్ అతని కంటే కొంచెం ముందున్నాడు. అందుకు కారణం సూర్యకుమార్ యాదవ్ స్పిన్ బౌలర్లపై అద్భుతంగా ఆడడం. అలాగే ఫాస్ట్ బౌలర్లపై కూడా అటాక్ చేయడంలో సూర్యకు కొదువలేదు. మరోవైపు సంజూ శాంసన్ స్పిన్‌కు ధీటుగా పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడుతున్నాడు. బహుశా ఈ కారణంగానే సూర్యకుమార్ యాదవ్‌కు సెలెక్టర్లు ఎక్కువ స్థానం కల్పిస్తుండవచ్చు.

ఇవి కూడా చదవండి

రెండవ కారణం..

సంజూ శాంసన్‌కు అవకాశం రాకపోవడానికి మరో కారణం జట్టులో శాశ్వత స్థానం లేకపోవడం. అలాగే వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ గా కూడా కిషన్ మెరుస్తున్నాడు. తొలి వన్డేలో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేసింది. కిషన్ మూడు ఫార్మాట్లలో టీమ్ ఇండియాకు ఆడడమే ఇందుకు కారణం. అందుకే వన్డేల్లో డబుల్ సెంచరీ చేసి టీ20-టెస్టుల్లోనూ తన సత్తా చాటాడు. దీంతో మూడు ఫార్మాట్లలో కిషన్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ ఎంచుకుంటోంది.

తొలినాళ్లలో రోహిత్, జడేజా కూడా..

జట్టులో ఆటగాడి ప్రదర్శన మాత్రమే ముఖ్యం కాదు. టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచన, అది ఏ ఆటగాడిని విశ్వసిస్తుందనేది కూడా చాలా ముఖ్యం. మేనేజ్‌మెంట్ హృదయాన్ని గెలుచుకోవడంలో ఏ ఆటగాడు విజయం సాధిస్తే, అతను పదేపదే వైఫల్యాలు ఉన్నప్పటికీ మరిన్ని అవకాశాలను పొందుతుంటాడు. కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ రూపంలో దీనికి తగిన ఉదాహరణలు మనం ఇప్పటికే చూశాం. కానీ, సంజు విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఇంతకుముందు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వంటి భారత కెప్టెన్లు కూడా తమ కెరీర్ తొలినాళ్లలో మేనేజ్‌మెంట్‌ నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నవారే. ఆ తర్వాత టీమ్ ఇండియాలో శాశ్వత స్థానాన్ని పొందారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..