16 ఇన్నింగ్స్‌లుగా అట్టర్ ఫ్లాప్ షో.. టీ20ల్లోనే హీరో.. వన్డేల్లో జీరోకి ఇంకెన్ని ఛాన్స్‌లిస్తారంటూ ఫ్యాన్స్ ఫైర్..

|

Jul 28, 2023 | 11:28 AM

Suryakumar Yadav: వరుస పరాజయాలతో వన్డే ఫార్మాట్‌లో సత్తా చాటుతున్న సూర్యకుమార్ యాదవ్.. లయ దొరక్క టీమ్ ఇండియాను ఆందోళనకు గురి చేశాడు.

16 ఇన్నింగ్స్‌లుగా అట్టర్ ఫ్లాప్ షో.. టీ20ల్లోనే హీరో.. వన్డేల్లో జీరోకి ఇంకెన్ని ఛాన్స్‌లిస్తారంటూ ఫ్యాన్స్ ఫైర్..
Surya Kumar Yadav
Follow us on

Suryakumar Yadav: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో అనూహ్య మార్పులు చేసినా పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ మినహా మిగతా ప్లేయర్లు రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్‌లకు పెద్ద ప్రశ్నగా మారిపోయారు. ముఖ్యంగా వన్డే ఫార్మాట్‌లో వరుస పరాజయాలతో దూసుకపోతోన్న సూర్యకుమార్ యాదవ్.. చెత్త ఫాంతో టీమిండియాను కలవరపెడుతున్నాడు.

గత ఏడాదిన్నర కాలంలో సూర్యకుమార్ యాదవ్ టీ20 క్రికెట్‌లో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. సూర్య తన భీకర బ్యాటింగ్ శైలి, వైవిధ్యమైన స్ట్రోక్‌లతో టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు. కానీ, వన్డేల్లో మాత్రం పేలవమైన ఫామ్‌తో ఇబ్బందులు పడుతున్నాడు. ఇది వెస్టిండీస్‌పై కూడా కొనసాగింది.

మంచి అవకాశం మిస్ చేసుకున్న సూర్య..

బార్బడోస్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే కేవలం 115 పరుగులే ఛేజ్ చేయాల్సి వచ్చింది. ఇటువంటి పరిస్థితిలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వారి నంబర్లలో బ్యాటింగ్ చేయడానికి రాలేదు. ఏడో నంబర్‌లో రోహిత్ బ్యాటింగ్ చేశాడు. అయితే కోహ్లీకి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. దీంతో కోహ్లీ స్థానంలో మూడో స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌కు అవకాశం లభించింది. బలహీనంగా ఉన్న వెస్టిండీస్ పై ఎక్కువసేపు క్రీజులో నిలిచి జట్టును గెలిపిస్తాడని అంతా భావించారు.

ఇవి కూడా చదవండి

సూర్యకి కూడా ఈ ఇన్నింగ్స్ కీలకమే. ఎందుకంటే ఈ మ్యాచ్‌కు ముందు సూర్య తాను ఆడిన చివరి 3 ఇన్నింగ్స్‌ల్లో సున్నా ప్రదర్శనతో నిరాశపరిచాడు. మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ సూర్య తొలి బంతికే ఔటయ్యాడు. కానీ, బార్బడోస్‌లో తన ఖాతా తెరిచిన సూర్య.. భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.

16 ఇన్నింగ్స్‌ల నుంచి అట్టర్ ఫ్లాప్‌..

తన ఇన్నింగ్స్‌లో 25 బంతులు ఎదుర్కొన్న సూర్య 19 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తద్వారా టీ20 ర్యాంక్‌లో నంబర్‌వన్‌ బ్యాట్స్‌మెన్‌కు వన్డేల్లో మరో ఇన్నింగ్స్‌ నిరాశ కలిగించింది. తన 48 మ్యాచ్‌ల T20 కెరీర్‌లో 46 సగటుతో 175 స్ట్రైక్ రేట్‌తో 1675 పరుగులు (3 సెంచరీలు, 13 అర్ధశతకాలు) చేసిన సూర్య.. 22 ODI ఇన్నింగ్స్‌లలో 452 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో కూడా కెరీర్‌లో తొలి 6 ఇన్నింగ్స్‌ల్లో 261 పరుగులు రాగా, తర్వాతి 16 ఇన్నింగ్స్‌ల్లో 191 పరుగులు మాత్రమే వచ్చాయి.

వరల్డ్ కప్ ఆడడం కష్టమే..

దీంతో వైట్ బాల్ ఫార్మాట్‌లో స్టార్‌గా వెలుగొందిన సూర్య వన్డే ఫార్మాట్‌లో ఎందుకు రాణించలేకపోతున్నాడనే ప్రశ్న తలెత్తుతోంది. ఇక రెండవది మరి ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, సూర్యకి ఇలాంటి అవకాశాలు ఎంతకాలం ఇస్తారు? అంటూ ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు. ఎందుకంటే సూర్య స్థానం కోసం సంజూ శాంసన్‌తో పాటు శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కూడా పోటీ పడుతున్నారు. కాబట్టి ఆసియా కప్, ప్రపంచకప్ దృష్ట్యా సూర్యకుమార్ స్థానంలో మరో ఆటగాడిని వెతకడానికి టీమిండియాకు ఇదే సరైన సమయం ఇదే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..