Viral Video: రోహిత్‌ భారీ సిక్సర్‌.. సెక్యూరిటీకి అక్కడ తగిలింది కాబట్టి సరిపోయింది.. ముందు తాకుంటే మాత్రం..

|

Sep 07, 2022 | 9:33 AM

IND vs SL, Asia Cup 2022: ఆసియా కప్‌లో భాగంగా మంగళవారం భారత్, శ్రీలంక జట్లు తలపడ్డాయి. చివరివరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అయితే భారత్‌ ఇన్నింగ్స్‌లో రోహిత్‌ మెరుపు అర్ధసెంచరీ హైలెట్‌గా నిలిచింది.

Viral Video: రోహిత్‌ భారీ సిక్సర్‌.. సెక్యూరిటీకి అక్కడ తగిలింది కాబట్టి సరిపోయింది.. ముందు తాకుంటే మాత్రం..
Rohit Sharma
Follow us on

IND vs SL, Asia Cup 2022: ఆసియా కప్‌లో భాగంగా మంగళవారం భారత్, శ్రీలంక జట్లు తలపడ్డాయి. చివరివరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అయితే భారత్‌ ఇన్నింగ్స్‌లో రోహిత్‌ మెరుపు అర్ధసెంచరీ హైలెట్‌గా నిలిచింది. మొత్తం 41 బంతులు ఆడిన హిట్‌ మ్యాన్‌ 5ఫోర్లు, 4 సిక్సర్లతో 72 రన్స్‌ చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్‌ కొట్టిన ఒక షాట్‌ హైలైట్‌గా నిలిచింది. అసితా ఫెర్నాండో వేసిన 10 ఓవర్‌ మొదటి బంతినే డీప్‌ స్వ్కేర్‌ లెగ్‌ దిశగా భారీ సిక్సర్‌ బాదాడు రోహిత్‌. ఇక్కడే అనుకోని సంఘటన జరిగింది. హిట్‌మ్యాన్‌ సిక్స్‌ కొట్టిన బంతి నేరుగా గ్యాలరీలో డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డు వెనుక వైపున తాకింది. దీంతో అతను ఉలిక్కిపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘వెనుకవైపు తిరిగి ఉన్నాడు కాబట్టి సరిపోయిందో భయ్యా.. అదే ముందు తగిలి ఉంటే’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. రోహిత్‌ మినహా మరెవరూ పెద్దగా ఆడలేదు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక 4 వికెట్లు కోల్పోయి చివరి ఓవర్‌లో విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో ఓడిన భారతజట్టు ఫైనల్‌ అవకాశాలను పూర్తిగా సంక్లిష్టం చేసుకుంది. గ్రూప్‌-4లో వరుసగా పాక్‌, శ్రీలంక జట్లతో టీమిండియా ఓటమిపాలైంది. ఇక భారత్‌ టైటిల్‌ పోరుకు వెళ్లాలంటే ఇతర జట్లు, మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..