IND vs SL 3rd T20I: మూడో టీ20 మ్యాచ్‌కి వర్షం ఎఫెక్ట్..! షాకివ్వనున్న పల్లెకెలె పిచ్..

|

Jul 30, 2024 | 10:20 AM

Pallekele International Cricket Stadium Weather, Pitch Report: భారత్-శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడో మరియు చివరి మ్యాచ్ జూలై 30న పల్లెకెలె స్టేడియంలో జరగనుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించడమే కాకుండా తొలి 2 మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది.

IND vs SL 3rd T20I: మూడో టీ20 మ్యాచ్‌కి వర్షం ఎఫెక్ట్..! షాకివ్వనున్న పల్లెకెలె పిచ్..
Ind Vs Sl 3rd T20i Weather Report
Follow us on

IND vs SL Pallekele International Cricket Stadium Weather, Pitch Report: భారత్-శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్ జులై 30న పల్లెకెలె స్టేడియంలో జరగనుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించడమే కాకుండా తొలి 2 మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు మూడో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను వైట్‌వాష్ చేయాలని టీమ్ ఇండియా ప్రయత్నిస్తుండగా.. ఆతిథ్య శ్రీలంక మాత్రం విజయం కోసం పోరాడుతోంది.

ఇరు జట్ల మధ్య జరిగిన పోరు గురించి మాట్లాడితే.. టీ20లో ఇప్పటి వరకు 31 మ్యాచ్‌లు ఆడిన భారత్‌ 21 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, శ్రీలంక 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 1 మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది.

వాతావరణ సమాచారం..

జులై 30, 2024న, శ్రీలంకలోని పల్లెకెలెలో ఉష్ణోగ్రత 20-20 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో పాటు మ్యాచ్ సందర్భంగా బలమైన గాలి వీస్తుందని సమాచారం. దీంతో రెండో టీ20 మ్యాచ్‌లానే మూడో టీ20 మ్యాచ్‌పై కూడా వర్షం ప్రభావం పడవచ్చని అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పల్లెకెలె పిచ్ రిపోర్ట్..

పల్లెకెలె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోని పిచ్‌పై ఫాస్ట్ బౌలర్లకు మొదట్లో కొంత సహాయం అందుతుందని భావిస్తున్నారు. అయితే, బ్యాట్స్‌మెన్ ఓపెనింగ్ ఓవర్లను జాగ్రత్తగా ఆడితే తర్వాతి ఓవర్లలో బౌలర్లపై ఆధిపత్యం చెలాయించవచ్చు. అలాగే రెండో ఇన్నింగ్స్‌లో ఈ పిచ్‌పై పరుగులు చేయడం సులభం అవుతుంది. ఇటువంటి పరిస్థితిలో, ఈ పిచ్‌పై టాస్ గెలిచిన కెప్టెన్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకోవచ్చు. ఇప్పటి వరకు ఇక్కడ 25 టీ20 మ్యాచ్‌లు జరగ్గా, తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు 13 సార్లు గెలుపొందగా, 10 మ్యాచ్‌ల్లో ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన జట్లు విజయం సాధించాయి. రెండు మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి.

రెండు సంభావ్య జట్లు..

భారత ప్రాబబుల్ స్క్వాడ్: యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ర్యాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, ఖలీల్ అహ్మద్.

శ్రీలంక ప్రాబబుల్ స్క్వాడ్: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), కుసల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత్ అసలంక (కెప్టెన్), దసున్ షనక, వనిందు హసరంగా, మహిష్ తీక్షన్, మతీషా పతిరణ, అసిత ఫెర్నాండో, దిల్షన్ మధుశంక.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..