IND vs SL: అర్ధసెంచరీతో ఆకట్టుకున్న కేఎల్ రాహుల్.. కోల్‌కతా వన్డేలో టీమిండియా విజయం.. సిరీస్‌ కైవసం

ఎట్టకేలకు తన బ్యాట్‌తో విమర్శకులకు సమాధానం చెప్పాడు రాహుల్‌. టాపార్డర్‌ బ్యాటర్లు ఫెయిలైన చోట అర్ధసెంచరీ సాధించి టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు.  అతని ఇన్నింగ్స్ కారణంగానే కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

IND vs SL: అర్ధసెంచరీతో ఆకట్టుకున్న కేఎల్ రాహుల్.. కోల్‌కతా వన్డేలో టీమిండియా విజయం.. సిరీస్‌ కైవసం
Team India

Updated on: Jan 12, 2023 | 9:44 PM

గత కొన్ని రోజులుగా అన్ని వైపుల నుండి విమర్శలు ఎదుర్కొంటున్నాడు టీమిండియా వికెట్‌ కీపర్‌ అండ్ స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌. పేలవమైన ఫామ్‌ కారణంగా అతనిని టీమిండియా నుంచి తప్పించాలన్న డిమాండ్లు కూడా వెల్లువెత్తాయి. అయితే ఎట్టకేలకు తన బ్యాట్‌తో విమర్శకులకు సమాధానం చెప్పాడు రాహుల్‌. టాపార్డర్‌ బ్యాటర్లు ఫెయిలైన చోట అర్ధసెంచరీ సాధించి టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు.  అతని ఇన్నింగ్స్ కారణంగానే కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది రోహిత్‌ సేన. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పర్యాటక జట్టు భారత బౌలర్ల దాటికి బెంబేలెత్తిపోయింది. కేవలం 39.4 ఓవర్లలోనే 215 పరుగులకు ఆలౌటైంది. తేలికైన టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియాకు ఆశించిన శుభారంభం లభించలేదు.

ఓపెనర్లిద్దరూ 5 ఓవర్లలో 33 పరుగులు జోడించినప్పటికీ క్రీజులో కుదురుకోలేకపోయారు. ఐదో ఓవర్ చివరి బంతికి చమిక కరుణరత్నే రోహిత్ వికెట్ పడగొట్టగా, మూడు బంతుల వ్యవధిలోనే గిల్ కూడా ఔటయ్యాడు. ఇక 10వ ఓవర్‌లో భారత్‌కు అతిపెద్ద దెబ్బ తగిలింది. లాహిరు కుమార వేసిన షార్ట్ బాల్ నేరుగా కోహ్లి (4) వికెట్లను గిరాటేసింది. అయితే మిడిల్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్ (64; 103 బంతుల్లో 6 ఫోర్లు), హార్దిక్‌ పాండ్య (36; 53 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. శ్రేయస్‌ అయ్యర్ (28), అక్షర్‌ పటేల్ (21) కూడా రాణించడంతో 43.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది భారత జట్టు. కీలకమైన మూడు వికెట్లు తీసి లంకేయుల నడ్డి విరిచిన స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ (51/3)కు ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ పురస్కారం లభించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..