IND vs SL: కపిల్ రికార్డు బద్దలు కొట్టిన బుమ్రా.. ఆ లిస్టులో భారత తొలి బౌలర్‌గా..
భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా శ్రీలంకతో జరుగుతోన్న రెండో టెస్టులో అద్భుతంగా ఆకట్టుకున్నాడు. ఎరుపు, తెలుపు బంతులతో 5 వికెట్లు తీసిన బుమ్రా.. ఇప్పుడు తొలి గులాబీతోనూ..
భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) శ్రీలంకతో జరుగుతోన్న రెండో టెస్టులో అద్భుతంగా ఆకట్టుకున్నాడు. ఎరుపు, తెలుపు బంతులతో 5 వికెట్లు తీసిన బుమ్రా.. ఇప్పుడు తొలి గులాబీతోనూ అదే పని చేశాడు. బెంగళూరు వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్టు(Pink Ball Test) తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా ఈ ఘనత సాధించాడు. అతను శ్రీలంక ఇన్నింగ్స్(Sri Lanka Inning)ను ముగించడమే కాకుండా, కీలక బౌలర్ల రికార్డులను తిరగరాశాడు. నిజానికి, జస్ప్రీత్ బుమ్రా తన టెస్ట్ అరంగేట్రం చేసినప్పటి నుంచి తన విభిన్నమైన బౌలింగ్‌తో పలు రికార్డులు నెలకొల్పుతూనే ఉన్నాడు.
పింక్ బాల్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక కేవలం 109 పరుగులకే ఆలౌటైంది. ఈ సమయంలో, బుమ్రా ఒక్కడే 5 వికెట్లు పడగొట్టాడు. అంటే సగం జట్టు వికెట్లను పడగొట్టాడు. శ్రీలంకతో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 10 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 24 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా వేసిన ప్రతి ఒక్క బంతిని ఆడడం శ్రీలంక బ్యాట్స్‌మెన్‌కు కష్టంగా మారింది. పేస్ కంటే ఎక్కువ స్పిన్ మద్దతు ఉన్న పిచ్‌పై అతను అలాంటి కిల్లర్‌ని బౌలింగ్‌తో లంక బ్యాటర్లను భయపెట్టాడు. తొలి రోజు ఆటలో బుమ్రా తన 5 వికెట్లలో 3 వికెట్లు తీశాడు. రెండో రోజు 2 వికెట్లు తీయడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ను త్వరగా ముగించింది.
భారత్‌లో తొలిసారి టెస్టుల్లో 5 వికెట్లు..
జస్ప్రీత్ బుమ్రా భారత గడ్డపై తొలిసారిగా టెస్టు క్రికెట్‌లో 5 వికెట్లు తీసి అద్భుతం చేశాడు. అంతకుముందు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికాలో ఐదు వికెట్లు తీశాడు. పింక్ బాల్ టెస్టులో బుమ్రా తొలిసారి 5 వికెట్లు పడగొట్టాడు.
భారీ రికార్డులను బద్దలు కొట్టిన బుమ్రా..
టెస్టు క్రికెట్‌లో జస్ప్రీత్ బుమ్రా అరంగేట్రం 2018లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 29 టెస్టులు ఆడాడు. ఈ సమయంలో అతను 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం ఇది 8వ సారి. ఇలా చేస్తూనే కొందరు బౌలర్ల రికార్డులను బద్దలు కొట్టి కొందరిని సమం చేశాడు.
అతి తక్కువ టెస్టులు ఆడి అత్యధికంగా 5 వికెట్లు తీసిన భారత ఫాస్ట్ బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఈ విషయంలో కపిల్‌దేవ్‌ను వెనక్కునెట్టాడు. అతను 29వ మ్యాచ్‌లో 8 సార్లు 5 ప్లస్ వికెట్లు తీయగా, కపిల్ దేవ్ 30 టెస్టులు ఆడిన తర్వాత 8 సార్లు 5 ప్లస్ వికెట్లు పడగొట్టాడు. 29 టెస్టుల్లో 7 సార్లు 5 ప్లస్ వికెట్లు తీసి అద్భుతాలు సృష్టించిన ఇర్ఫాన్ పఠాన్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.
జస్ప్రీత్ బుమ్రా టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసినప్పటి నుంచి 8 సార్లు 5 ప్లస్ వికెట్లు పడగొట్టాడు. ఈ సమయంలో, న్యూజిలాండ్‌కు చెందిన టిమ్ సౌథీతో సమంగా నిలిచాడు.
That’s a FIVE-wkt haul for @Jaspritbumrah93 ??
This is his 8th in Test cricket.
Live – https://t.co/t74OLq6Zzg #INDvSL @Paytm pic.twitter.com/sNboEF4Gm8
— BCCI (@BCCI) March 13, 2022
IND vs SL, 2nd Test, Day 2, Live Score: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. మయాంక్ ఔట్.. స్కోరెంతంటే?