
Rohit Sharma and Shubman Gill, IND vs SL, Asia Cup 2023 : ఆసియాకప్ 2023లో భాగంగా మంగళవారం కొలంబోలో శ్రీలంకతో జరుగుతోన్న మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ జోడీ అరుదైన రికార్డ్‌ను బ్రేక్ చేసింది. ఈ జోడీ వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగులను పూర్తి చేసిన భారత జోడీగా నిలిచారు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత వికెట్లేమీ నష్టపోకుండా 36 పరుగులు చేయడంతో రోహిత్, గిల్ జోడీ ఈ మైలురాయిని దాటారు. కుడిచేతి వాటం జోడీ ఈ ఫార్మాట్‌లో కేవలం 13వ ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్క్‌ను దాటింది. రోహిత్ గతంలో 14 ఇన్నింగ్స్‌లలో 1000 పరుగులు పూర్తి చేసిన భారతీయులలో కేఎల్ రాహుల్‌తో కలిసి ఈ రికార్డును కలిగి ఉన్నాడు.
జనవరి 10, 2023న గౌహతిలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్, గిల్ మొదటి వికెట్‌కు 143 పరుగులతో కలిసి భారత్ తరపున అగ్రస్థానంలో నిలిచారు. ఈ జంట ఆసియా కప్‌లో వరుసగా రెండు 100-ప్లస్ భాగస్వామ్యాలను పంచుకోవడం విజయవంతమయ్యారు. అందులో 147 v నేపాల్, పాకిస్తాన్‌పై 121 పరుగుల భాగస్వామ్యాలు ఉన్నాయి. అలాగే ఈ జోడీ అత్యధిక సగటు ఓపెనింగ్ భాగస్వామ్యంలోనూ రికార్డును కలిగి ఉంది.
13 – రోహిత్-గిల్
14 – రోహిత్-రాహుల్
14 – ఎంఎస్ ధోని-గౌతమ్ గంభీర్
16 – రోహిత్-విరాట్ కోహ్లీ
16 – ధోని-సురేష్ రైనా
16 – శిఖర్ ధావన్-అజింక్యా రహానే
16 – సచిన్ టెండూల్కర్-అజయ్ జడేజా
16 – మహ్మద్ అజారుద్దీన్-సునీల్ గవాస్కర్.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్(కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరనా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..