IND vs SL: కోల్‌కతాలో లంకను చుట్టేసిన కుల్‌దీప్‌, సిరాజ్‌.. టీమిండియా టార్గెట్‌ ఎంతంటే?

|

Jan 12, 2023 | 5:16 PM

మొదటి వన్డేలో సాధించిన విజయంతో ఊపుమీదున్న టీమిండియా బౌలర్లు రెండో మ్యాచ్‌లోనూ చెలరేగారు. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో లంకేయులను 215 పరుగుకే కట్టడి చేశారు. శ్రీలంక జట్టులో నువనిదు ఫెర్నాండో (50) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కుశాల్ మెండిస్ (34), దునిత్‌ వెల్లలాగె (32) ఫర్వాలేదనిపించారు.

IND vs SL: కోల్‌కతాలో లంకను చుట్టేసిన కుల్‌దీప్‌, సిరాజ్‌.. టీమిండియా టార్గెట్‌ ఎంతంటే?
Indian Cricket Team
Follow us on

మొదటి వన్డేలో సాధించిన విజయంతో ఊపుమీదున్న టీమిండియా బౌలర్లు రెండో మ్యాచ్‌లోనూ చెలరేగారు. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో లంకేయులను 215 పరుగుకే కట్టడి చేశారు. శ్రీలంక జట్టులో నువనిదు ఫెర్నాండో (50) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కుశాల్ మెండిస్ (34), దునిత్‌ వెల్లలాగె (32) ఫర్వాలేదనిపించారు. వానిందు హసరంగ(21), అవిష్క ఫెర్నాండో (20), చరిత్ అసలంక (15), , చమీక కరుణరత్నె (17), రజిత (17), డాసున్ శనక (2) పరుగులు చేశారు. తన చివరి మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అందుకుని టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోయిన కుల్‌దీప్‌ మరోసారి తన స్పిన్‌ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. మూడు వికెట్లతో లంకేయుల నడ్డీ విరిచాడు. సిరాజ్‌ కూడా మూడు వికెట్లు తీసి లంకేయుల పతనంలో కీలక పాత్ర పోషించాడు. ఉమ్రాన్‌ మాలిక్‌ రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్‌తో మెరిశారు.

సిరాజ్‌ శుభారంభం.. కుల్దీప్‌ మాయ..

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్నఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. గత మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు గాయపడిన లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ స్థానంలో లెఫ్టార్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు భారత జట్టు అవకాశం ఇచ్చింది. కాగా ఈ మ్యాచ్‌లో భారత్‌కు మరోసారి శుభారంభం అందించాడు హైదరాబాదీ బౌలర్‌ మహ్మద్ సిరాజ్. అతను ఆరో ఓవర్‌లో అవిష్క ఫెర్నాండోను బౌల్డ్ చేశాడు. అయితే మరో ఓపెనర్‌ కుసాల్ మెండిస్, నువనీదు ఫెర్నాండో 73 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు స్కోరును 100 పరుగులు దాటించారు. ఈ భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న దశలో కుల్దీప్‌ మాయ చేశాడు. తన తొలి ఓవర్‌లోనే మెండిస్‌ను ఎల్‌బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్‌లో అక్షర్ పటేల్ ధనంజయ డిసిల్వాను బౌల్డ్ చేసి లంకను మరింత ఇబ్బందుల్లోకి నెట్టాడు. ఆ తర్వాత అసలంక , తొలి వన్డేలో సెంచరీతో చెలరేగిన లంక కెప్టెన్‌ దసున్‌ షనకలను తక్కువ స్కోరుకే పెవిలియన్‌ పంపించాడు లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌. ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌లో హసరంగ, కరుణరత్నెవెనుదిరిగారు. చివర్లో దునిత్‌ వెల్లలగె(32) కాసేపు పోరాడడంతో 39.4 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్‌ అయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..