IND Vs SL: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. లంక ముందు భారీ టార్గెట్.. స్కోర్ వివరాలు..

వరల్డ్‌కప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతోన్న మ్యాచ్‌తో భారత్ అదరగొట్టింది. శుభ్‌మాన్ గిల్(92), విరాట్ కోహ్లీ(88), శ్రేయాస్ అయ్యర్(82) అర్ధ సెంచరీలతో రాణించడమే కాదు.. చివర్లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(35) మెరుపులు మెరిపించడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో మధుశంక 5 వికెట్లు, చమీరా ఒక వికెట్ పడగొట్టారు.

IND Vs SL: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. లంక ముందు భారీ టార్గెట్.. స్కోర్ వివరాలు..
Ind Vs Sl Cwc 2023

Updated on: Nov 02, 2023 | 6:56 PM

వరల్డ్‌కప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతోన్న మ్యాచ్‌తో భారత్ అదరగొట్టింది. శుభ్‌మాన్ గిల్(92), విరాట్ కోహ్లీ(88), శ్రేయాస్ అయ్యర్(82) అర్ధ సెంచరీలతో రాణించడమే కాదు.. చివర్లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(35) మెరుపులు మెరిపించడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో మధుశంక 5 వికెట్లు, చమీరా ఒక వికెట్ పడగొట్టారు.

అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు.. తొలి ఓవర్‌లోనే భారీ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ(4) ఇన్నింగ్స్ రెండో బంతికే పెవిలియన్ చేరాడు. అయితే ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ(88), ఓపెనర్ గిల్(92)తో కలిసి 188 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. టూ డౌన్‌లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్(82) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అతడికి జడేజా(35) కూడా సహాయపడటంతో భారత్ నిర్ణీత ఓవర్లకు 357 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

జట్ల వివరాలు..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.

శ్రీలంక: కుసాల్ మెండిస్ (కెప్టెన్ & వికెట్ కీపర్), దిముత్ కరుణరత్నే, ఏంజెలో మాథ్యూస్, చరిత్ అసలంక, పాతుమ్ నిస్సంక, దుషన్ హేమంత, సదీర సమరవిక్రమ, మహేశ్ తీక్షన, దిల్షన్ మధుశంక, దుష్మంత చమీర