IND vs SA: దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ 11 నుంచి నలుగురు ఔట్..?

India vs South Africa, 43rd Match, Super 8 Group 1 (X1 v X4), ICC Men's T20 World Cup 2026: భారత జట్టు తన తొలి సూపర్ 8 మ్యాచ్‌లో భాగంగా సౌతాఫ్రికా జట్టుతో తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా హెడ్ కోచ్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీం కాంబినేషన్‌పై కీలక చర్యలు తీసుకుంటున్నారు.

IND vs SA: దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ 11 నుంచి నలుగురు ఔట్..?
Ind Vs Sa

Updated on: Feb 19, 2026 | 11:27 AM

India vs South Africa: టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ అద్భుతంగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో అమెరికా, నమీబియా, పాకిస్తాన్‌, నెదర్లాండ్ జట్లపై వరుస విజయాలు నమోదు చేసి సూపర్-8కు అర్హత సాధించింది. ఇక సూపర్-8 దశలో భారత్ తొలి మ్యాచ్ ఫిబ్రవరి 22న దక్షిణాఫ్రికాతో (IND vs SA) జరగనుంది. ఈ నేపథ్యంలో, టీమ్ కాంబినేషన్ మార్పుల కారణంగా నలుగురు భారత ఆటగాళ్లకు సూపర్-8లో అవకాశాలు దక్కకపోవచ్చని సమాచారం.

గ్రూప్ స్టేజ్ ముగిసిన తర్వాత ఫిబ్రవరి 21 నుంచి సూపర్-8 మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. 21న జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు ఎదురయ్యే జట్టు ఇంకా ఖరారు కాలేదు. ఫిబ్రవరి 22న ఇంగ్లాండ్ vs శ్రీలంక, భారత్ vs దక్షిణాఫ్రికా మ్యాచ్‌లు ఫిక్స్ అయ్యాయి.

సూపర్-8లో అవకాశం దక్కకపోవచ్చని భావిస్తున్న ఆటగాళ్లు

సంజూ శాంసన్: అభిషేక్ శర్మ గైర్హాజరులో అవకాశం దక్కినప్పటికీ, సంజూ శాంసన్ ఆ ఇన్నింగ్స్‌ను పెద్ద స్కోర్‌గా మలచలేకపోయాడు. ప్రస్తుతం టీమ్ కాంబినేషన్ దృష్ట్యా అతనికి సూపర్-8లో ఛాన్స్ దక్కే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అభిషేక్ శర్మ మూడు మ్యాచ్ ల్లోనూ జీరోకే డకౌట్ అయ్యాడు. దీంతో సూపర్ 8లోనూ కంటిన్యూగా ఛాన్స్ లు ఇచ్చేందుకు మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వాషింగ్టన్ సుందర్: ఆల్‌రౌండర్‌గా జట్టులో ఉన్నప్పటికీ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, తిలక్ వర్మ, అక్షర్ పటేల్ వంటి ఆల్‌రౌండర్లు ఇప్పటికే టీమ్‌లో స్థిరపడిపోయారు. ఈ పరిస్థితిలో సూపర్-8లో వాషింగ్టన్ సుందర్‌కు చోటు దొరకడం కష్టం.

కుల్దీప్ యాదవ్: పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో స్పిన్ పిచ్ కారణంగా అవకాశం దక్కిన కుల్దీప్, భారత్‌లో జరిగే తదుపరి మ్యాచ్‌ల్లో పేస్ బౌలర్లకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండటంతో బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశముంది.

మహమ్మద్ సిరాజ్: బుమ్రా గాయం కారణంగా మొదట్లో అవకాశం దక్కినా, బుమ్రా పూర్తిగా ఫిట్ కావడంతో సూపర్-8లో సిరాజ్ ఆడే అవకాశాలు తగ్గినట్టే కనిపిస్తున్నాయి. మిగతా మ్యాచ్‌ల్లో కూడా అతనికి అవకాశం దక్కకపోవచ్చని అంచనా.

దక్షిణాఫ్రికాతో కీలక పోరుకు టీమిండియా సిద్ధం..

సూపర్-8 దశలో దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ భారత్‌కు చాలా కీలకం. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ మేనేజ్‌మెంట్ తమ లోపాలపై పని చేసి బెస్ట్ కాంబినేషన్‌తో బరిలోకి దిగాలని భావిస్తోంది. బ్యాటింగ్‌లో స్థిరత్వం, బౌలింగ్‌లో డెత్ ఓవర్ల కంట్రోల్.. ఇవే ప్రధానంగా ఫోకస్‌లో ఉన్నాయి. నెదర్లాండ్ జట్టుతోనూ భారత్ తీవ్రంగా ఇబ్బందులు పడింది. అటు క్యాచ్ ల విషయంలోనూ, ఇటు బౌలింగ్ విభాగంతోనూ ఇబ్బందులు పడ్డాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us