IND vs SA Final: ఆ జట్టుదే టీ20 ప్రపంచకప్.. జోస్యం చెప్పిన చిలుక.. వీడియో ఇదిగో

|

Jun 29, 2024 | 6:27 PM

IND vs SA Final, T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారం రాత్రి 8 గంటలకు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల కళ్లన్నీ ఇప్పుడు ఈ మ్యాచ్‌పైనే ఉన్నాయి.

IND vs SA Final: ఆ జట్టుదే టీ20 ప్రపంచకప్.. జోస్యం చెప్పిన చిలుక.. వీడియో ఇదిగో
IND vs SA Final
Follow us on

IND vs SA Final, T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారం రాత్రి 8 గంటలకు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల కళ్లన్నీ ఇప్పుడు ఈ మ్యాచ్‌పైనే ఉన్నాయి. ఒకవైపు ఈ ప్రపంచకప్‌లో భారత జట్టు వరుస మ్యాచ్‌లు గెలిచి ఫైనల్స్‌కు చేరుకుంటుండగా మరోవైపు దక్షిణాఫ్రికా కూడా చోకర్స్ అన్న ట్యాగ్‌ని తొలగించుకుని ఫైనల్స్‌కు చేరుకుంది. దీంతో ఫైనల్ లో హోరా హోరీ పోరు తప్పదని క్రీడా నిపుణులు, విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అంతకుముందే ఓ చిలుక ఈసారి ఎవరు ఛాంపియన్‌గా నిలుస్తారని అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో దక్షిణాఫ్రికా, భారత్ పేర్లతో కూడిన స్లిప్పులను చిలుక ముందు ఉంచారు. చిలుక కాసేపు రెండు టిక్కెట్లు చూస్తుంది. ఆ తరువాత అది తన ముక్కుతో టీమిండియా పేరును ఎంచుకుంటుంది. అంటే ఫైనల్ మ్యాచ్ లో గెలిచి భారత జట్టు ప్రపంచకప్ ట్రోఫీని ఎగరేసుకుపోతుందన్నది చిలక జోస్యం.

సెమీస్ లోనూ చెప్పిందే జరిగింది..

కాగా దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సెమీ ఫైనల్‌కు ముందు కూడా ఇదే చిలుక చెప్పిన మాట నిజమైంది. అఫ్గనిస్తాన్, దక్షిణాఫ్రికా పేర్లను చిలక ముందు ఉంచగా, అది తన ముక్కుతో సౌతాఫ్రికా పేరును ఎంచుకుంది. అది ఎంచుకున్నట్లు గానే అఫ్గన్ తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. మరి ఫైనల్ లోనూ ఈ చిలక జోస్యం నిజమవ్వాలని ఈ వీడియోనూ చూసిన వారందరూ అంటున్నారు.

ఇవి కూడా చదవండి

చిలక జోస్యం.. వీడియో ఇదిగో..

ఫైనల్ మ్యాచ్ కు వర్షం ముప్పు..

అయితే బార్బడోస్ వేదికగా జరగనున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. బార్బడోస్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మ్యాచ్ జరిగే రోజు వర్షం పడే అవకాశం 60 శాతం ఉంది. అయితే ఈ మ్యాచ్‌ని పూర్తి చేసేందుకు అదనంగా 190 నిమిషాలు కేటాయించారు. అయినప్పటికీ, మ్యాచ్ ఆడే అవకాశం లేకుంటే జూన్ 30 అంటే రిజర్వ్ డే ను కేటాయించారు. ఈ రిజర్వ్ రోజులలో 190 నిమిషాల ఓవర్ టైం అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్ జరగడానికి చాలా సమయం ఉంది. ఒకవేళ నిరంతరం వర్షం పడుతూ ఉండి లేదా అవుట్‌ఫీల్డ్ తడి గా మారితే గత్యంతరం లేని పరిస్థితుల్లో మ్యాచ్ ను రద్దు చేస్తారు. అప్పుడు ఇరు జట్లను సంయుక్తంగా విజేతలుగా ప్రకటిస్తారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..