Video: కుల్దీప్ ట్రైనింగ్.. రోహిత్ యాక్షన్.. ఐకానిక్ మూమెంట్‌తో ట్రోఫీ ఎత్తిన హిట్‌మ్యాన్.. వీడియో చూస్తే నవ్వులే

Rohit Sharma Recreate Lionel Messi's Iconic Moment FIFA World Cup Celebration: రోహిత్ శర్మ- నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీని సొంతం చేసుకుంది. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఉత్కంఠ విజయంతో 17 ఏళ్ల కలను నెరవేర్చుకున్నారు. దీంతో అటు ఆటగాళ్లలోనే కాదు.. దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ ట్రోఫీ అందుకునే ముందు చేసిన ఓ యాక్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఫ్యాన్స్ కూడా ఈ వీడియోను చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Video: కుల్దీప్ ట్రైనింగ్.. రోహిత్ యాక్షన్.. ఐకానిక్ మూమెంట్‌తో ట్రోఫీ ఎత్తిన హిట్‌మ్యాన్.. వీడియో చూస్తే నవ్వులే
Rohit Sharma Recreate Lionel Messi's Iconic Moment Fifa World Cup Celebration

Updated on: Jun 30, 2024 | 12:19 PM

Rohit Sharma Recreate Lionel Messi’s Iconic Moment FIFA World Cup Celebration: రోహిత్ శర్మ- నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీని సొంతం చేసుకుంది. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఉత్కంఠ విజయంతో 17 ఏళ్ల కలను నెరవేర్చుకున్నారు. దీంతో అటు ఆటగాళ్లలోనే కాదు.. దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ ట్రోఫీ అందుకునే ముందు చేసిన ఓ యాక్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఫ్యాన్స్ కూడా ఈ వీడియోను చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ట్రోఫీ అందుకునే ముందు రోహిత్ శర్మ రోబోట్‌లా వాకింగ్ చేస్తూ ముందుకు కదిలాడు. రోహిత్ ఐకానిక్ వాకింగ్ స్టైల్ చూసి తోటి ఆటగాళ్లతో పాటు జైషా నవ్వుల్లో మునిగిపోయారు. అసలు రోహిత్ శర్మ ఎందుకిలా నడిచాడో ఇప్పుడు తెలుసుకుందాం.

లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు ఖతార్‌లో జరిగిన ఫైనల్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి FIFA ప్రపంచ కప్ 2022ను గెలుచుకుంది. అయితే, ఆ సందర్భంలో లియోనెల్ మెస్సీ ఈ ఐకానిక్ మూమెంట్‌తో ట్రోఫీ లిఫ్ట్ చేశాడు. దీంతో అప్పటి నుంచి ఇది బాగా పాపులర్ అయింది.

లియోనెల్ మెస్సీ ఐకానిక్ మూమెంట్ రిపీట్ చేసిన రోహిత్..

బార్బడోస్‌లో అద్భుతమైన విజయం సాధించిన టీమిండియా, 11 సంవత్సరాల ICC ట్రోఫీ కరువును ముగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు విజేతలకు అందించే పతకాలను తీసుకుంటున్నారు. కుల్దీప్ యాదవ్ ట్రోఫీని ఎత్తే ముందు ఎలాంటి మూమెంట్ ఇవ్వాలో రోహిత్‌కి నేర్పిస్తున్నాడు. మెస్సీ ఐకానిక్ మూమెంట్‌తో ట్రోఫీ ఎత్తుకోవాలని చేసి చూపించాడు. ఈ క్రమంలో ఇద్దరూ కొద్దిసేపు ప్రాక్టీస్ కూడా చేశారు. అనంతరం భారత కెప్టెన్ స్టార్ స్పిన్నర్ సలహాను ఫాలో చేశాడు. దీంతో బార్బడోస్‌లో ఖతార్ ఐకానిక్ మూమెంట్‌ను రిపీట్ చేశారు.

వీడియో చూడండి..

ఈ విజయంతో, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి గ్లోబల్ టైటిల్ గెలవని భారత్.. 11 సంవత్సరాల నిరీక్షణకు తెరదింపింది. 2007లో ప్రారంభ ఎడిషన్‌ను గెలుచుకున్న తర్వాత మెన్ ఇన్ బ్లూ రెండోసారి T20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఎంఎస్ ధోని, కపిల్ దేవ్ తర్వాత ఏ ఫార్మాట్‌లో అయినా ICC టైటిల్‌ను గెలుచుకున్న మూడో భారత కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..