IND vs PAK: ఆదివారం పాక్‌తో మ్యాచ్.. గజగజ వణికిపోతున్న ఆ ఇద్దరు.. నాకేం భయం లేదంటోన్న రన్ మెషీన్..

|

Jun 08, 2024 | 7:24 AM

Rohit Sharma, Suryakumar Yadav Records against Pakistan: భారత్ వర్సెస్ పాకిస్థాన్ (IND vs PAK) మధ్య టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) మ్యాచ్‌కు 2 రోజుల కంటే తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది . ఆదివారం, జూన్ 9, న్యూయార్క్‌లోని కొత్తగా నిర్మించిన నాసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాచ్ జరగనుంది. ఐర్లాండ్‌పై గెలిచి ఈ మ్యాచ్‌లో అడుగుపెట్టనున్న భారత జట్టు ఒకవైపు.. ఆతిథ్య యూఎస్ఏ చేతిలో ఓడిన పాకిస్తాన్ జట్టు మరోవైపు.. తాడోపేడో తేల్చుకోనున్నాయి.

IND vs PAK: ఆదివారం పాక్‌తో మ్యాచ్.. గజగజ వణికిపోతున్న ఆ ఇద్దరు.. నాకేం భయం లేదంటోన్న రన్ మెషీన్..
Team India
Follow us on

Rohit Sharma, Suryakumar Yadav Records against Pakistan: భారత్ వర్సెస్ పాకిస్థాన్ (IND vs PAK) మధ్య టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) మ్యాచ్‌కు 2 రోజుల కంటే తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది . ఆదివారం, జూన్ 9, న్యూయార్క్‌లోని కొత్తగా నిర్మించిన నాసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాచ్ జరగనుంది. ఐర్లాండ్‌పై గెలిచి ఈ మ్యాచ్‌లో అడుగుపెట్టనున్న భారత జట్టు ఒకవైపు.. ఆతిథ్య యూఎస్ఏ చేతిలో ఓడిన పాకిస్తాన్ జట్టు మరోవైపు.. తాడోపేడో తేల్చుకోనున్నాయి. అయితే, పాక్ జట్టుపై భారత బ్యాట్స్‌మెన్స్ జాగ్రత్తగా ఉండాల్సిందే. . ముఖ్యంగా రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌ల రికార్డు పాక్ జట్టుపై చాలా పేలవంగా ఉంది. మరోవైపు విరాట్ కోహ్లీ పాక్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాడు.

PAKతో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఇద్దరు భారత ఆటగాళ్ల రికార్డులు చాలా పేలవంగా ఉన్నాయి. వారెవరో ఇప్పుడు చూద్దాం..

1. రోహిత్ శర్మ:

టీ20 అంతర్జాతీయ ఫార్మాట్‌లో పాకిస్థాన్‌పై అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలా చెత్త రికార్డును కలిగి ఉన్నాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో, రోహిత్ శర్మ పాకిస్తాన్‌తో 6 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 68 పరుగులు మాత్రమే చేశాడు. 17 ఏళ్ల క్రితం 2007లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ కేవలం 30 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత పాకిస్థాన్‌పై వరుసగా పరాజయాలు చవి చూస్తూనే ఉన్నాడుజ

2. సూర్యకుమార్ యాదవ్..

సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ కూడా ఇప్పటివరకు పాకిస్థాన్‌పై మౌనంగానే ఉంది. పాకిస్థాన్‌తో ఇప్పటివరకు మొత్తం 4 మ్యాచ్‌లు ఆడి 57 పరుగులు మాత్రమే చేశాడు. సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచ కప్ 2021, 2022లో పాక్ బౌలర్లను రెండుసార్లు ఎదుర్కొన్నాడు. అందులో అతను వరుసగా 11, 15 పరుగులు చేశాడు.

3. విరాట్ కోహ్లీ..

రోహిత్, సూర్య పాకిస్తాన్‌పై దారుణంగా విఫలమైనప్పటికీ, విరాట్ కోహ్లి మాత్రం భిన్నంగా, పాకిస్తాన్ జట్టుపై చెలరేగిపోయాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో, విరాట్ కోహ్లీ ఇప్పటివరకు పాకిస్తాన్‌తో 5 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను ఒక్కసారి మాత్రమే ఔట్ అయ్యాడు. కింగ్ కోహ్లీ ఈ 5 మ్యాచ్‌ల్లో 4 అర్ధ సెంచరీల సాయంతో 308 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..