Ind vs Pak: తిప్పేసిన భువి.. పాక్ ఆలౌట్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
Ind vs Pak, Asia Cup2022: ఆసియా కప్‌లో పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని19.5 ఓవర్లలో 147 పరుగులకే కట్టడి చేశారు.
Ind vs Pak, Asia Cup2022: ఆసియా కప్‌లో పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని19.5 ఓవర్లలో 147 పరుగులకే కట్టడి చేశారు. వెరసి భారత్‌కు 148 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు రోహిత్. కెప్టెన్ నిర్ణయాన్ని సరైనదనని నిరూపిస్తూ టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించారు. పరుగులు నియంత్రించడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీశారు. దీంతో పాక్ భారీ స్కోరు సాధించలేకపోయింది. ఆ జట్టులో మహమ్మద్ రిజ్వాన్ (43), ఇఫ్తికార్ అహ్మద్ (28) మాత్రమే రాణించారు. టీమిండియా బౌలర్లలో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (4/26), హార్దిక్ పాండ్యా (3/25) రాణించారు. అర్ష్‌దీప్ (2/33), అవేశ్ ఖాన్ (1/19) పర్వాలేదనిపించారు.
Four wickets from @BhuviOfficial and three from @hardikpandya7 as Pakistan are all out for 147 in 19.5 overs.#TeamIndia chase underway.
ఇవి కూడా చదవండిLIVE – https://t.co/o3hJ6VNfwF #INDvPAK #AsiaCup2022 pic.twitter.com/V2ftsLBGSa
— BCCI (@BCCI) August 28, 2022
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..