IND vs NZ: రెండో వన్డేలో అదరగొట్టిన టీమిండియా బౌలర్లు.. 108 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్..
న్యూజిలాండ్‌తో రాయ్‌పూర్‌లో జరుగుతున్న రెండో వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ ఫిన్ అలెన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు షమి. అప్పటికి కివీస్ బ్యాటర్లు పరుగుల ఖాతా తెరవలేదు.
న్యూజిలాండ్‌తో రాయ్‌పూర్‌లో జరుగుతున్న రెండో వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ ఫిన్ అలెన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు షమి. అప్పటికి కివీస్ బ్యాటర్లు పరుగుల ఖాతా తెరవలేదు. దీంతో వాళ్లు డిఫెన్స్‌లో పడిపోయారు. మ్యాచ్ ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు భారత బౌలర్లు పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించడంతో 34.3 ఓవర్లకు.. 108 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్ అయింది. కివీస్ బ్యాటర్లలో 36రన్స్‌తో ఫిలిప్స్ టాప్‌స్కోరర్‌గా
ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. గ్లెన్ ఫిలిప్స్ (36) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మైఖేల్ బ్రాస్‌వెల్ (22), మిచెల్ శాంటర్న్ (27) పరుగులు మాత్రమే చేశారు. భారత బౌలర్ల ధాటికి కివీస్ టాపార్డర్.. ఫిన్ అలెన్ (0), డెవాన్ కాన్వే (7), హెన్రీ నికోల్స్ (2), డారిల్ మిచెల్ (1), టామ్ లేథమ్ (1) మాత్రమే చేశారు.. వీరంతా15 పరుగులకే పెవిలియన్ కు చేరారు. మొత్తం 8మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
10 ఓవర్లు పూర్తయ్యే సరికి న్యూజీలాండ్ స్కోర్ 15 పరుగులు మాత్రమే. ఏకంగా సగం టీమ్ పెవిలియన్‌కు వెళ్లిపోవడంతో.. న్యూజిలాండ్ 108 పరుగులు కూడా అతి కష్టం మీద చేయగలిగింది.
అయితే బౌలర్లలో షమి 3వికెట్లు తీసి కివీస్ పతనాన్ని శాసించగా.. సుందర్, పాండ్యా రెండేసి వికెట్లు పడగొట్టారు. సిరాజ్, శార్దూల్, కుల్దీప్ తలో వికెట్ తీశారు.
India bowled out New Zealand for 108 in 34.3 overs. Mohammed Shami picks 3 wickets while Hardik Pandya and Washington Sundar bag 2 wickets each.
(Pic: BCCI) pic.twitter.com/OWHsM6QMpb
— ANI (@ANI) January 21, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం..