India – New Zealand: రెండో వన్డేలో ఇంట్రెస్టింగ్ సీన్.. టాస్ గెలిచాక ఏం చేయాలో మర్చిపోయిన హిట్ మ్యాన్..
రాయ్‌పూర్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగుతున్న రెండో వన్డేలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. తానేం చేయాలో తెలియక తికమకపడిపోయాడు. కొంత సమయం తర్వాత ఫీల్డింగ్...
రాయ్‌పూర్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగుతున్న రెండో వన్డేలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. తానేం చేయాలో తెలియక తికమకపడిపోయాడు. కొంత సమయం తర్వాత ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు తెలిపాడు. రెండో ODIలో టాస్ వేస్తున్న సమయంలో బ్రాడ్‌కాస్టర్ రవిశాస్త్రి, కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్, మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ రోహిత్ శర్మ డెసిషన్ కోసం ఎదురుచూశారు. అయితే.. తికమకపడి తేరుకున్న రోహిత్ శర్మ మాత్రం.. టీమిండియా బౌలింగ్ తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. దీనిపై స్పందించిన హిట్ మ్యాన్.. తాను ఏమి చేయదలుచుకున్నాడనే విషయాన్ని మర్చిపోయినట్లు చెప్పాడు. టాస్ గెలిస్తే ఏం తీసుకోవాలనే విషయం గురించి టీమ్ అందరితో చర్చించానని, కానీ కాస్త సందిగ్ధంలో పడ్డ తర్వాత.. బౌలింగ్ ఎంచుకున్నట్లు చెప్పాడు.
కాగా.. రాయపూర్ రెండో వన్డేలో టీమిండియా అభిమానులు ఉర్రూతలూగిపోయారు. అద్భుతమైన బౌలింగ్ కారణంగా 35 ఓవర్లకు కివీస్ 108 పరుగులు చేసి ఆలౌటైంది. మహ్మద్ షమి నేతృత్వంలోని భారత పేస్ బౌలింగ్ ముందు న్యూజిలాండ్ నిలవలేకపోయింది. 35 ఓవర్లకే తక్కువ స్కోరుకు పరిమితమై పెవిలియన్ బాట పట్టింది. తొలి మ్యాచ్‌లానే పరుగులను ఆశించిన అభిమానులను భారత బౌలర్లు నిరాశపడ్డారు. పరుగుల తుఫాను చూసే అవకాశం లేకపోయినా.. బౌలింగ్‌తో భారత అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
? Toss Update ?#TeamIndia win the toss and elect to field first in the second #INDvNZ ODI.
Follow the match ▶️ https://t.co/V5v4ZINCCL @mastercardindia pic.twitter.com/YBw3zLgPnv
— BCCI (@BCCI) January 21, 2023
కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచిన తర్వాత ఏమి చేయాలో మర్చిపోయి ఉండవచ్చు. కానీ అతను బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు.. అది సరైనదేనని నిరూపితమైంది. మొదటి ఓవర్‌లోనే, మొదటి 4 బంతుల్లో ఫిన్ అలెన్‌ను ఇబ్బంది పెట్టిన తర్వాత ఐదో బంతికి మహ్మద్ షమీ బౌల్డ్ చేశాడు. వచ్చిన ఈ బంతిని అలెన్ పూర్తిగా కోల్పోయి బౌల్డ్ అయ్యాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం..