IND vs IRE 2nd T20I Weather: రెండో మ్యాచ్‌కి వర్షం ఆటంకం? డబ్లిన్ వాతావరణ నివేదిక ఇదే..
Dublin Weather Forecast: ఆసియా కప్ (Asia Cup 2023) కి ముందు ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌తో జస్ప్రీత్ బుమ్రా కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్‌లో బుమ్రా సారథ్యంలోని టీమిండియా తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ పూర్తి కాలేదు. ఇప్పుడు రెండో టీ20 మ్యాచ్‌కి కూడా వర్షం ఎదురుకానుందా అనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
India Vs Ireland 2nd T20I Weather Forecast: టీ20 సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు డబ్లిన్ సమీపంలోని మలాహిడే క్రికెట్ క్లబ్ మైదానంలో జరగనున్నాయి. ఆగస్టు 20, ఆదివారం రెండవ T20కి కూడా వర్షం అడ్డుపడనుందా లేదా అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే, తొలి టీ20లో వర్షంతో ఫుల్ మ్యాచ్ జరగలేదు. దీంతో రెండో మ్యాచ్‌పై అందరి చూపు నెలకొంది. ఐర్లాండ్ వాతావరణ శాఖ ప్రకారం, ఆదివారం మలాహిడ్‌లో వర్షం కురిసే అవకాశం లేదు. దీని ప్రకారం, రోజంతా వాతావరణం పూర్తిగా స్పష్టంగా, ఎండగా ఉంటుందని నివేదించారు.
ఐర్లాండ్ కాలమానం ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు (భారతదేశంలో రాత్రి 7.30 గంటలకు) ప్రారంభమవుతుంది. అయితే సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య కొంత మేఘావృతమైన వాతావరణం ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణం టర్న్ తీసుకుంటే వర్షం వల్ల మ్యాచ్‌కు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి స్పష్టమైన వాతావరణ సూచన ఉన్నప్పటికీ ఆదివారం వర్షం పడితే ఆశ్చర్యపోనవసరం లేదు.
వర్షం కురిసినా భారత్ విజయం..
తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ సమయంలో వర్షం అడ్డుపడింది. దీంతో మ్యాచ్‌ని తిరిగి ప్రారంభించలేకపోయారు. అయితే టీమ్ ఇండియా బౌలింగ్ సమయంలో వర్షం కురవకపోవడంతో జస్ప్రీత్ బుమ్రా, ప్రసీద్ధ్ కృష్ణ అద్భుత ప్రదర్శన చేయగలిగారు. చివరకు ఈ మ్యాచ్‌లో టీమిండియా డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆదివారం జరిగే రెండో టీ20లో విజయం సాధించడం ద్వారా మరో మ్యాచ్‌తో సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమ్ ఇండియా చూస్తోంది.