IND vs ENG: వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన షోయబ్ కు చిన్న నాటి నుంచి క్రికెట్ అంటే పిచ్చి. పేద కుటుంబంలో పుట్టినప్పటికీ క్రికెట్ క్రీడాకారుడిగా, కామెంట్రేటర్ గా మంచి పేరు సంపాదించారు. క్రికెట్ పై ఉన్న మక్కువ టీవీ వ్యాఖ్యాతగా మారింది. పెబ్బేరు పట్టణానికి చెందిన నజీమా బేగం, నయీం ల కుమారుడు షోయబ్. వనపర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా పూర్తి చేశారు. 14 ఏళ్ల క్రితం ఆయన తండ్రి నయీం రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు షోయబ్. తన స్నేహితులతో కలిసి ఆడుతున్నప్పుడు హీందీ, ఇంగ్లీష్, తెలుగులో కామెంటరీ చేయడం అలవాటుగా చేసుకొని రాష్ట్ర స్థాయిలో వ్యాఖ్యాతగా చేరారు. ఈయన గతంలో జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్ లకు రేడియోలో వ్యాఖ్యానించారు.
ఇంగ్లండ్ ఓవల్ వేదికగా జరుగుతున్న నాలుగు ఐదో టెస్ట్ మ్యాచ్‌లకు సోనీ స్పోర్ట్స్ వ్యాఖ్యాతగా పెబ్బేరుకు చెందిన షోయబ్‌కు అవకాశం దక్కింది. గతంలో పలు జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు షోయబ్ రేడియోలో వ్యాఖ్యానం చేశారు. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య సెప్టెంబర్ 2 నుంచి 6వ తేదీ వరకు నాలుగో టెస్టు, 10 నుంచి 14వ తేదీ వరకు అయిదో టెస్ట్‌కు ముంబైలోని సోనీ నెట్‌వర్క్ స్టూడియోలో తెలుగులో ప్రత్యేక్ష వ్యాఖ్యానం చేయనున్నారు. పెబ్బేరువాసులు, క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
Also Read:
Avani Lekhara: పారాలింపిక్స్‌లో అవని లేఖరా సంచలన ప్రదర్శన.. ఇప్పటికే ఖాతాలో రెండు మెడల్స్.. మరొకటి
Tokyo Paralympics: భారత్ ఖాతాలో మరో పతకం.. కాంస్య పతకం సాధించిన ఆర్చర్ హర్విందర్ సింగ్