IND vs ENG: 4 మ్యాచ్‌లలో 21 వికెట్లు.. భారత్‌ను దెబ్బకొట్టేందుకు బరిలోకి డేంజరస్ బౌలర్‌.. ఎవరంటే?

ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా శుక్రవారం (ఫిబ్రవరి 23) నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ ఇంగ్లండ్‌కు కీలకం. ఎందుకంటే ఇప్పుడు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. 4వ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడిపోతే సిరీస్ భారత్‌ వశమవుతుంది.

IND vs ENG: 4 మ్యాచ్‌లలో 21 వికెట్లు.. భారత్‌ను దెబ్బకొట్టేందుకు బరిలోకి డేంజరస్ బౌలర్‌.. ఎవరంటే?
England Cricket Team

Updated on: Feb 22, 2024 | 3:05 PM

ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా శుక్రవారం (ఫిబ్రవరి 23) నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ ఇంగ్లండ్‌కు కీలకం. ఎందుకంటే ఇప్పుడు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. 4వ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడిపోతే సిరీస్ భారత్‌ వశమవుతుంది. అందువల్ల బెన్ స్టోక్స్ టీమ్‌ రాంచీ టెస్టు మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాల్సి ఉంది. ఇందుకోసం ఇంగ్లండ్‌ జట్టు బౌలింగ్‌ లైనప్‌లో గణనీయమైన మార్పు తీసుకురావాలని ప్లాన్‌ చేసింది. గత రెండు మ్యాచ్‌ల్లో ఆడిన వెటరన్ స్పీడ్‌స్టర్ జేమ్స్ అండర్సన్‌కు నాలుగో మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సీనియర్ పేసర్ స్థానంలో ఆలీ రాబిన్సన్‌ను బరిలోకి దింపాలని ఇంగ్లాండ్ కూడా యోచిస్తోంది. ఎందుకంటే రాబిన్సన్ గత మూడు గేమ్‌లలో రిజర్వ్ బెంచ్ కే పరిమితమయ్యాడు. అందువల్ల నాలుగో మ్యాచ్‌లో అతడిని ఆడే అవకాశం ఎక్కువగా ఉంది.

ఆలీ రాబిన్సన్ ఇప్పటివరకు టీమ్ ఇండియాతో 4 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 8 ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్ చేసి 21 వికెట్లు పడగొట్టాడు. రెండు సార్లు ఐదు వికెట్లు కూడా తీశాడు. తద్వారా భారత్‌పై రాబిన్‌సన్‌ అత్యుత్తమ ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. అందువల్ల రాంచీ టెస్టులో ఇంగ్లండ్ జట్టు స్పీడ్‌స్టర్‌ను బరిలోకి దించడం దాదాపు ఖాయం. ఈ నిర్ణయాత్మక మ్యాచ్ లో ఆడబోతున్న ఆలీ రాబిన్సన్ టీమ్ ఇండియాకు ప్రమాదకారిగా మారనున్నాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఫిబ్రవరి 23 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు టాస్ ప్రక్రియ జరగనుండగా, 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని స్పోర్ట్స్ 18 ఛానెల్, అలాగే జియో సినిమా యాప్‌లోనూ చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇంగ్లండ్ టెస్ట్ జట్టు:

బెన్ స్టోక్స్ (కెప్టెన్), జో రూట్, రెహాన్ అహ్మద్, జేమ్స్ అండర్సన్, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, షోయబ్ బషీర్, డాన్ లారెన్స్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, ఒల్లీ పోప్, ఒల్లీ రాబిన్సన్, మార్క్ వుడ్‌

అండర్సన్ స్థానంలో..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..