టీ20 ప్రపంచకప్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. మొత్తం 20 జట్లతో మొదలైన టోర్నీ ఇప్పుడు నాలుగు జట్లు సెమీఫైనల్‌లోకి ప్రవేశించాయి. దక్షిణాఫ్రికా vs ఆఫ్ఘనిస్తాన్, భారతదేశం vs ఇంగ్లండ్ సెమీ ఫైనల్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. కాగా ఇంగ్లండ్ త కీలకమైన సెమీస్ మ్యాచ్ కు ముందు టీమిండియాతో పాటు అభిమానులకు ఓ శుభవార్తను అందించింది ఐసీసీ. అదేంటంటే.. ఈ రెండు సెమీ ఫైనల్ మ్యాచ్‌లకు అంపైర్ల ప్యానెల్‌ను ప్రకటించింది. భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగే సెమీ-ఫైనల్ మ్యాచ్‌కు ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ గాఫ్నీ, ఆస్ట్రేలియాకు చెందిన రోడ్నీ వ్యవహరించనున్నారు. అలాగే ఈ మ్యాచ్‌కు జోయెల్ విల్సన్ టీవీ అంపైర్‌గా వ్యవహరిస్తుండగా, పాల్ రీఫెల్ నాలుగో అంపైర్‌గా ఉండనున్నారు. అలాగే, న్యూజిలాండ్‌కు చెందిన జెఫ్రీ క్రోవ్ రిఫరీ పాత్రలో ఉంటాడు. మరోవైపు సౌతాఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్‌కు ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, భారత్‌కు చెందిన నితిన్ మీనన్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. టీవీ అంపైర్‌గా రిచర్డ్ కెటిల్‌బరో, నాలుగో అంపైర్‌గా ఎహ్సాన్ రజా వ్యవహరించనున్నారు. వెస్టిండీస్ ఆటగాడు రిచీ రిచర్డ్‌సన్‌కు మ్యాచ్ రిఫరీ బాధ్యతలు అప్పగించారు.
సెమీస్ లో మన మ్యాచ్ కు ఐరన్ లెగ్ గా గుర్తింపు పొందిన అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో లేకపోవడంతో టీమిండియా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. 2014 నుంచి రిచర్డ్ కెటిల్ బరో అంపైర్ గా వ్యవహరించిన ఏ నాకౌట్ మ్యాచ్ లోనూ టీమిండియా గెలుపొందలేదు. అప్పటి నుంచి అతడు భారత పాలిట విలన్ గా మారాడు. ఇక ఈ మ్యాచ్ లో కెటిల్ బరో అంపైర్ గా లేకపోవడం టీమిండియాకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే ఆఫ్గాన్-సౌతాఫ్రికా మ్యాచ్ కు థర్డ్ అంపైర్ గా రిచర్డ్ కెటిల్ బరో వ్యవహరించనున్నాడు
Kettleborough jinx averted, ICC names Chris Gaffaney & Rod Tucker as umpires for India vs England semifinal. India has lost 6 ICC knockout matches (3 semi-finals and 3 ICC finals) in the last decade when Richard Kettleborough has been the umpire. pic.twitter.com/M1W5E3GKRy
— Sumanta Biswas 🇮🇳 (@sociolozist) June 26, 2024
దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మ్యాచ్‌కు రిజర్వ్ డే కేటాయించారు. కానీ భారత్, ఇంగ్లండ్ మ్యాచ్‌కు 4 గంటల 10 నిమిషాల అదనపు సమయం మాత్రమే ఉంది. జూన్ 29నే ఫైనల్ జరగనుండగా, ఈ మ్యాచ్‌కు అంపైర్లను ఇంకా ప్రకటించలేదు. ఫైనల్ మ్యాచ్ కోసం జూన్ 30 రిజర్వ్ డే గా కేటాయించారు. ఈ నాలుగు జట్లలో ఎవరు ఫైనల్స్‌కు చేరుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యే సమయమైతే దక్షిణాఫ్రికా, భారత్ రెండు జట్లకు అవకాశం దక్కుతుంది. ఎందుకంటే గ్రూప్ 1లో భారత్ అగ్రస్థానంలో ఉండగా, గ్రూప్ 2లో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో నిలిచింది.
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మమహ్మద్ సిరాజ్
No Richard KettleBorough in team india,s semifinal a big relief for us #indvseng #T20WorldCup24 #t20cwc2024 pic.twitter.com/jar3YCCnZj
— Rahul Madan (@RMadan23674) June 26, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..