IND vs ENG: భారత యువ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మరోసారి ప్రేక్షకుల టార్గెట్ అయ్యాడు. అతను ఆస్ట్రేలియా పర్యటనలో జాతిపరమైన వ్యాఖ్యలకు గురయ్యాడని తెలిసిందే. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో, ప్రేక్షకులు అతనిపై బంతిని విసిరారు. మొదటి రోజు ఆట ముగిసిన తర్వాత మీడియాతో జరిగిన సంభాషణలో రిషభ్ పంత్ ఈ విషయం గురించి వెల్లడించాడు. సిరాజ్ బౌండరీకి సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని తెలిపాడు. దీనిపై కోహ్లీ కోపంగా ఉన్నట్లు టీవీ కెమెరాల్లో కూడా కనిపించాయి. ఈ మేరకు సిరాజ్‌ని ఆ విషయాన్ని వదిలయేలంటూ కోరినట్లు తెలుస్తోంది. బౌండరీ దగ్గర నిలబడి ఉన్న భారత ఆటగాళ్లను ప్రేక్షకులు టార్గెట్ చేయడం వరుసగా ఈ సిరీస్‌లో ఇది రెండోసారి. లార్డ్స్ టెస్ట్ సమయంలో, ప్రేక్షకులు షాంపైన్ బాటిళ్ల కార్క్‌లను కేఎల్ రాహుల్‌పై విసిరిరారు.
సిరాజ్ ఘటన గురించి పంత్ మీడియాతో మాట్లాడుతూ, ‘ఎవరో సిరాజ్‌పై బంతి విసిరారు. అందుకే అతనికి (కోహ్లీ) కోపం వచ్చింది. ఫీల్డర్‌లపై ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం మంచిది కాదు. నా అభిప్రాయం ప్రకారం ఇది క్రికెట్‌కు మంచిది కాదు. మొదటి రోజు ఆటలో, సిరాజ్ ప్రేక్షకులతో మాట్లాడుతున్న చిత్రం కూడా కనిపించింది. భారత స్కోరు గురించి ప్రేక్షకులు పదేపదే సిరాజ్‌ని ఆటపట్టిస్తున్నారని తెలుస్తోంది. అయితే, దీనికి భారత ఆటగాడు సిరాజ్ వారికి మంచి సమాధానం ఇచ్చాడంట. స్కోరు 1-0 అని చెప్పి వారి నోరు మూయించినట్లు సమాచారం. అంటే సిరీస్‌లో ఇండియా 1-0 ఆధిక్యంలో ఉందని సంజ్ఞతో అలా చెప్పాడంట. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 78 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
27 ఏళ్ల మొహమ్మద్ సిరాజ్ ప్రస్తుత సిరీస్‌లో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకరు. తొలి రెండు టెస్టుల్లో అతను 11 వికెట్లు తీశాడు. లార్డ్స్ టెస్టులో అతను ఎనిమిది వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.
సిడ్నీ టెస్టులో కూడా..
ఈ ఏడాది ప్రారంభంలో మహ్మద్ సిరాజ్‌పై ఆస్ట్రేలియా పర్యటనలో ప్రేక్షకులు తప్పుగా ప్రవర్తించాడు. సిడ్నీ టెస్ట్ సమయంలో, కొంతమంది ప్రేక్షకులు అతనిపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. అతన్ని వివిధ పేర్లతో పిలిచారు. దీని కారణంగా ఆటను నిలిపివేయవలసి వచ్చింది. కోపంతో ఉన్న ప్రేక్షకులను స్టేడియం నుంచి బయటకు పంపించారు. దీనిపై సిరాజ్, అజింక్య రహానె అంపైర్‌కు ఫిర్యాదు చేశారు. దీని కారణంగా చాలా వివాదం జరిగింది.
మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ టీం వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. దీనితో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఓపెనర్లు రోరీ బర్న్స్(52), హసీబ్ హమీద్(60) అర్ధ సెంచరీలతో అజేయంగా నిలిచారు. చెత్త బంతులను వదిలిస్తే చక్కటి షాట్స్‌తో భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.
కాగా, అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కేవలం 78 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. భారత బ్యాట్స్‌మెన్లు పేలవ ప్రదర్శనను కనబరిచారు. ఒకరి తర్వాత ఒకరు వెనువెంటనే పెవిలియన్ చేరారు. మొదటి బంతి నుంచే ఇంగ్లాండ్ బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు.
India Vs England: ముగిసిన తొలిరోజు ఆట.. 42 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్..
అత్యల్ప స్కోర్‌కే టీమిండియా ఆలౌట్.. పేలవ రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కోహ్లీ సేన