IND vs ENG: ఆరేళ్ల తర్వాత హైదరాబాద్‌లో టెస్ట్‌ క్రికెట్‌ సందడి.. భారత్, ఇంగ్లండ్ మ్యాచ్‌ ప్రత్యేకతలివే

జనవరి 25 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఇరు జట్ల సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ చాలా కాలంగా చెమటోడ్చుతోంది. ఆ జట్టు ఆటగాళ్లు మొదట UAEలో తీవ్రంగా ప్రాక్టీస్ చేశారు.

IND vs ENG: ఆరేళ్ల తర్వాత హైదరాబాద్‌లో టెస్ట్‌ క్రికెట్‌ సందడి.. భారత్, ఇంగ్లండ్ మ్యాచ్‌ ప్రత్యేకతలివే
India Vs England

Updated on: Jan 21, 2024 | 1:55 PM

జనవరి 25 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఇరు జట్ల సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ చాలా కాలంగా చెమటోడ్చుతోంది. ఆ జట్టు ఆటగాళ్లు మొదట UAEలో తీవ్రంగా ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు టెస్ట్ సిరీస్ సమీపిస్తుండడంతో వారు భారత గడ్డపై చెమటోడ్చేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు 5 టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ జరిగే హైదరాబాద్‌లో భారత జట్టు శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే జనవరి 25 నుంచి హైదరాబాద్‌లో జరగనున్న తొలి టెస్టు మ్యాచ్‌ చరిత్రాత్మకం కానుందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్, ఇంగ్లండ్‌ల మధ్య తొలి టెస్టు చారిత్రాత్మకంగా ఉండడానికి ఒకే ఒక్క కారణం ఉందని, అది ఈ మ్యాచ్ తేదీలకు సంబంధించిందంటున్నారు. వాస్తవానికి జనవరి 25లోపు హైదరాబాద్‌లో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పుడు ఈ టెస్టు 5 రోజుల పాటు ఉంటే జనవరి 29 వరకు ఆడనుంది. ఈ 5 రోజుల్లో జనవరి 26వ తేదీ కూడా ఉంది. జనవరి 26 అంటే గణతంత్ర దినోత్సవం. ఇప్పుడు భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌ను చరిత్రాత్మకంగా మార్చబోతున్న విషయం ఈ తేదీకి సంబంధించినదే. జనవరి 26న అంటే రిపబ్లిక్ డే సందర్భంగా భారత్, ఇంగ్లండ్ జట్లు మైదానంలో టెస్ట్ మ్యాచ్ ఆడడం ఇదే తొలిసారి. అయితే ఇంతకు ముందు 1973లో జనవరి 25 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు మ్యాచ్ ప్రారంభం కాగానే ఇలాంటి సందర్భం వచ్చింది. కానీ, జనవరి 26న మ్యాచ్‌ ఆడలేదు.

2018 అక్టోబర్ లో చివరిసారిగా వెస్టిండీస్ తో టెస్టుమ్యాచ్ కు ఆతిథ్యమిచ్చింది హైదరాబాద్‌. అప్పుడు టీమిండియా ఏకంగా10 వికెట్ల అలవోక విజయం సాధించింది. ఆ తరువాత పలు టీ-20 మ్యాచ్ లతో పాటు ఐసీసీవన్డే ప్రపంచకప్ మ్యాచ్ లకు సైతం ఆతిధ్యమిచ్చింది. అయితే ఆరేళ్ల సుదీర్ఘవిరామం తరువాత మరోసారి టెస్ట్ మ్యాచ్ నిర్వహణకు హైదరాబాద్ వేదికగా నిలిచింది. ఇంగ్లండ్‌ తో జరిగే ఈ సిరీస్ కోసం టీమ్ ఇండియా ఆదివారం (జనవరి 21) నుంచి కసరత్తు ప్రారంభించనుంది. ఈ సిరీస్‌లోని మొదటి టెస్ట్ మ్యాచ్ రాజీవ్ గాంధీ స్టేడియంలో జరగనుంది, దీని కోసం భారత ఆటగాళ్లు జనవరి 20, శనివారం నుండి హైదరాబాద్ చేరుకున్నారు. జనవరి 17న ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో విజయం సాధించిన బీసీసీఐ టెస్టు జట్టుకు 2 రోజుల విరామం ఇచ్చి జనవరి 20 నుంచి హైదరాబాద్‌లో సమావేశం కావాలని ఆదేశించింది. టీం ఇండియా నేటి నుంచి హైదరాబాద్‌లో 4 రోజుల శిక్షణా శిబిరాన్ని ప్రారంభించనుంది. ఈ శిక్షణా శిబిరంలో భాగంగా రెండో రోజు విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కెప్టెన్ రోహిత్ శర్మలు అయోధ్యకు వెళ్లే అవకాశం ఉంది. అక్కడ రామమందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత మళ్లీ సన్నాహాలు మొదలవుతాయి.

భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్:

  • జనవరి 25 నుండి 29 వరకు – మొదటి టెస్ట్ (హైదరాబాద్)
  • ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు – రెండో టెస్టు (విశాఖపట్నం)
  • ఫిబ్రవరి 15 నుండి 19 వరకు – మూడో టెస్టు (రాజ్‌కోట్)
  • ఫిబ్రవరి 23 నుండి 27 వరకు – నాల్గవ టెస్ట్ (రాంచీ)
  • మార్చి 7 నుండి 11 వరకు – ఐదవ టెస్ట్ (ధర్మశాల)

 

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..