AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG : రాత్రి 10 గంటలకే మ్యాచ్.. భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ హెడ్-టు-హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయంటే?

IND vs ENG : భారత్-ఇంగ్లాండ్ మూడో టీ20 మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభం కానుంది. సిరీస్‌లో నిలవాలంటే టీమిండియాకు ఈ మ్యాచ్‌లో గెలుపు తప్పనిసరి. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా హెడ్-టు-హెడ్ రికార్డులు, మ్యాచ్ టైమింగ్స్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

IND vs ENG : రాత్రి 10 గంటలకే మ్యాచ్.. భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ హెడ్-టు-హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయంటే?
Tilak Varma
Rakesh
|

Updated on: Jul 06, 2026 | 4:09 PM

Share

IND vs ENG : భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రస్తుతం అత్యంత ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. అయితే జూలై 7న నాటింగ్‌హామ్‌లోని చారిత్రాత్మక ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో జరగబోయే మూడో మ్యాచ్‌ను లైవ్‌లో చూడాలనుకునే భారతీయ క్రికెట్ అభిమానులు తమ నిద్రతో కాస్త రాజీ పడక తప్పదు. ఎందుకంటే, గత మ్యాచ్ మన భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకే ప్రారంభం కాగా.. ఈ మూడో మ్యాచ్ టైమింగ్స్ పూర్తిగా మారిపోయాయి. ఈ మ్యాచ్‌కు సంబంధించి రాత్రి 9:30 గంటలకు టాస్ పడనుండగా.. రాత్రి 10:00 గంటలకు మ్యాచ్‌ తొలి బంతి పడనుంది.

సిరీస్ రేసులో నిలవాలంటే గెలుపు తప్పనిసరి

ప్రస్తుత సిరీస్ విషయానికి వస్తే.. మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆ తర్వాత జరిగిన రెండో మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు భారత్‌పై ఘన విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని టీమిండియా సిరీస్‌లో 0-1తో వెనుకబడి ఉంది. ఈ పరిస్థితుల్లో భారత్ గనుక ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్ రేసులో నిలవాలి అనుకుంటే, ఈ మూడో టీ20లో ఎలాగైనా సరే ఇంగ్లాండ్‌ను ఓడించి తీరాల్సిందే. లేదంటే సిరీస్ దక్కించుకునే అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారతాయి.

హెడ్-టు-హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయంటే?

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఉన్న ఓవరాల్ రికార్డులను పరిశీలిస్తే అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియాదే పైచేయిగా కనిపిస్తోంది. ఇరు జట్లు ఇప్పటివరకు మొత్తం 32 మ్యాచ్‌ల్లో తలపడగా.. అందులో భారత్ 18 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇంగ్లాండ్ జట్టు 13 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. అయితే, ఈ రికార్డులు భారత్‌లో ఉన్నంత బలంగా ఇంగ్లాండ్ గడ్డపై లేవు. ఇంగ్లాండ్ హోమ్ గ్రౌండ్స్‌లో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు జరగ్గా.. అందులో ఇంగ్లాండ్ 6 మ్యాచ్‌లు గెలిచింది. భారత్ కేవలం 4 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించగా.. ఒక మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది.

ట్రెంట్ బ్రిడ్జ్ చరిత్ర.. భారత్‌కు మిశ్రమ ఫలితాలు

నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో టీమిండియాకు మంచి, చెడు రెండు రకాల అనుభవాలు ఉన్నాయి. ఈ పిచ్‌పై భారత్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 2 మ్యాచ్‌లు గెలవగా.. మరో 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ మైదానంలో ఇంగ్లాండ్‌తో భారత్ చివరగా 2022లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా కేవలం 17 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ కేవలం 55 బంతుల్లోనే 117 పరుగులతో ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీ బాదినప్పటికీ, జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. మరి ఈసారైనా శ్రేయస్ సేన ఇక్కడి రికార్డును తిరగరాసి పరువు నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
విద్యార్ధులకు అలర్ట్.. అక్టోబర్‌ 9 నుంచే స్కూళ్లకు దసరా సెలవులు!
విద్యార్ధులకు అలర్ట్.. అక్టోబర్‌ 9 నుంచే స్కూళ్లకు దసరా సెలవులు!
మూత్రపిండాల సమస్య ముందే తెలిసిపోతుందా? ఈ నొప్పితో జాగ్రత్త
మూత్రపిండాల సమస్య ముందే తెలిసిపోతుందా? ఈ నొప్పితో జాగ్రత్త
అనంత చతుర్దశి.. సెప్టెంబర్ 25నే.. గణేష్ విసర్జన్, అనంత వ్రతం, పూజ
అనంత చతుర్దశి.. సెప్టెంబర్ 25నే.. గణేష్ విసర్జన్, అనంత వ్రతం, పూజ
ఈ నెల 30 వరకే ఛాన్స్.. ఆధార్ కార్డు వినియోగదారులకు అలర్ట్..
ఈ నెల 30 వరకే ఛాన్స్.. ఆధార్ కార్డు వినియోగదారులకు అలర్ట్..
పితృ పక్షం 2026: సెప్టెంబర్ 26 నుంచి ఈ వస్తువులు కొనకూడదట!
పితృ పక్షం 2026: సెప్టెంబర్ 26 నుంచి ఈ వస్తువులు కొనకూడదట!
పరివర్తన యోగం..ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
పరివర్తన యోగం..ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
పెళ్లి ఆలస్యమవుతుందా? మంగళవారం ఈ చిన్న పనిచేయండి
పెళ్లి ఆలస్యమవుతుందా? మంగళవారం ఈ చిన్న పనిచేయండి
ఉల్లిపాయ లేకుండా ఓసారి టమాటా ఫ్రై ఇలా చేయండి.. రుచి అదిరిపోద్ది!
ఉల్లిపాయ లేకుండా ఓసారి టమాటా ఫ్రై ఇలా చేయండి.. రుచి అదిరిపోద్ది!
ఏపీ కమ్యూనికేషన్స్, PTO విభాగాల్లో SI ఉద్యోగాలు.. దరఖాస్తు లింక్
ఏపీ కమ్యూనికేషన్స్, PTO విభాగాల్లో SI ఉద్యోగాలు.. దరఖాస్తు లింక్
అప్పుల ఉచ్చు నుంచి బయటపడాలంటే ఇంట్లో ఈ 4 వస్తువులు ఉంచుకోండి..!
అప్పుల ఉచ్చు నుంచి బయటపడాలంటే ఇంట్లో ఈ 4 వస్తువులు ఉంచుకోండి..!