12ఏళ్ల ఇంగ్లాండ్ కోటను బద్దలు కొట్టిన భారత్.. తొలి వన్డేలో నమోదైన రికార్డులు చూస్తే షాకే..?

బర్మింగ్హామ్ వన్డే మ్యాచ్ కేవలం భారత్ విజయంతోనే ముగియలేదు, భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. సీనియర్ల రికార్డులు, జూనియర్ల అద్భుత పోరాట పటిమ కలగలిసి టీం ఇండియాను అజేయంగా నిలబెట్టాయి. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే రాబోయే రెండు వన్డేల్లోనూ భారత్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

12ఏళ్ల ఇంగ్లాండ్ కోటను బద్దలు కొట్టిన భారత్.. తొలి వన్డేలో నమోదైన రికార్డులు చూస్తే షాకే..?
Ind Vs Eng Records

Updated on: Jul 15, 2026 | 10:22 AM

క్రికెట్ మక్కాగా భావించే ఇంగ్లాండ్ గడ్డపై భారత సింహాలు గర్జించాయి. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి పోరులోనే ఆతిథ్య ఇంగ్లాండ్‌ను ఆరు వికెట్ల తేడాతో ఘోరంగా ఓడించి, టీం ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ అద్భుత విజయంతో పాటు రోహిత్, అక్షర్, బుమ్రాల ఖాతాలో ఎన్నో అరుదైన ప్రపంచ రికార్డులు చేరాయి. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా అందులో ఉత్కంఠ, భావోద్వేగాలు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. బర్మింగ్హామ్‌ వేదికగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్ కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు, భారత బౌలర్ల ధాటికి 47.5 ఓవర్లలో 258 పరుగులకే కుప్పకూలిపోయింది. జో రూట్ (76), లియామ్ డాసన్ (68) ఒంటరి పోరాటం చేయడంతో ఆ జట్టు ఆ మాత్రమైనా స్కోరు చేయగలిగింది.

అనంతరం 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (80), వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్), ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (57 నాటౌట్)ల అద్భుత అర్ధ శతకాలతో కేవలం 45.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ ద్వారా నమోదైన ఆసక్తికరమైన, చారిత్రాత్మక రికార్డుల వివరాలు మీకోసం..

ఇది కూడా చదవండి: ఆ ముగ్గురు దద్దమ్మలు ఇక ఇంటికే.. వచ్చేస్తున్నాడ్రోయ్ అసలైన పులి.. కోహ్లీ దోస్త్ గ్రాండ్ ఎంట్రీ?

ఇవి కూడా చదవండి

అక్షర్ పటేల్ సరికొత్త ఆల్‌రౌండ్ రికార్డు..

ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అదరగొట్టిన అక్షర్ పటేల్ ఒకే మ్యాచ్‌లో 50కి పైగా పరుగులు, 4 వికెట్లు తీసిన ఎలైట్ క్లబ్‌లో చేరాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్‌పై ఈ ఘనత సాధించిన ఎనిమిదో భారత ఆటగాడిగా అక్షర్ నిలిచాడు. గతంలో కృష్ణమాచారి శ్రీకాంత్ (1988), సచిన్ టెండూల్కర్ (1998), సౌరవ్ గంగూలీ (1999, 2000), యువరాజ్ సింగ్ (2008, 2011), హార్దిక్ పాండ్యా (2022) మాత్రమే ఈ ఫీట్ సాధించారు. అంతేకాకుండా, 2013లో రవీంద్ర జడేజా తర్వాత, వన్డే మ్యాచ్‌ల్లో 41 నుంచి 50వ ఓవర్ల మధ్య నాలుగు వికెట్లు పడగొట్టిన రెండో భారత స్పిన్నర్‌గా అక్షర్ రికార్డు సృష్టించాడు.

ఇంగ్లాండ్ గడ్డపై బుమ్రా సరికొత్త రారాజు..

భారత యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక వన్డే వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. ఈ మ్యాచ్‌తో ఆయన ఖాతాలో కొన్ని కీలక వికెట్లు చేరడంతో రికార్డుల పట్టిక ఇలా మారింది:

జస్ప్రీత్ బుమ్రా – 31 వికెట్లు

రవీంద్ర జడేజా – 30 వికెట్లు

భువనేశ్వర్ కుమార్ – 28 వికెట్లు

మదన్ లాల్ – 27 వికెట్లు

మహమ్మద్ షమీ – 26 వికెట్లు

అలాగే, భారత్ తరపున వన్డేల్లో అతి తక్కువ బంతుల్లో 150 వికెట్లు పూర్తి చేసుకున్న బౌలర్ల జాబితాలో బుమ్రా (4605 బంతులు) మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో మహమ్మద్ షమీ (4070 బంతులు) మొదటి స్థానంలో ఉన్నాడు.

ఇది కూడా చదవండి: Kohli vs Gambhir: టీమిండియాలో ముదిరిన విభేదాలు.. కోచ్ గంభీర్, కోహ్లీ మధ్య మాటలు బంద్..?

రోహిత్ శర్మ సుదీర్ఘ ప్రస్థానం.. సచిన్ సరసన..!

భారత క్రికెట్ దిగ్గజం, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ కెరీర్ సాగిస్తున్న ఆటగాడిగా మరో మైలురాయిని అందుకున్నాడు. ప్రస్తుతం 19 సంవత్సరాల 21 రోజులుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న రోహిత్, భారత్ తరపున సచిన్ టెండూల్కర్ (24 సంవత్సరాలు), అమర్‌నాథ్ (19 సంవత్సరాల 310 రోజులు) తర్వాత మూడో అత్యంత సుదీర్ఘ కెరీర్ ఉన్న ఆటగాడిగా నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా వన్డేల్లో అత్యంత సుదీర్ఘ కెరీర్ ఉన్న ఆటగాళ్లలోనూ రోహిత్ మొదటి పది మందిలో చోటు సంపాదించాడు.

కింగ్ కోహ్లీ ఎల్‌బీడబ్ల్యూ బలహీనత..?

ఈ మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ ఎల్‌బీడబ్ల్యూ (LBW)గా వెనుదిరిగాడు. 2023 జనవరి తర్వాత ఒక ఫాస్ట్ బౌలర్ చేతిలో కోహ్లీ ఇలా అవుట్ కావడం ఇది నాలుగోసారి. విశేషం ఏంటంటే, 2013 జనవరి నుంచి 2023 జనవరి వరకు (పదేళ్ల కాలంలో) కోహ్లీ కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే పేసర్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లో ట్రెంట్ బౌల్ట్ ఆయనను అలా అవుట్ చేశాడు.

ఇది కూడా చదవండి: ఇంగ్లాండ్‌లో ఇరగదీసినా.. ఆ టీమిండియా స్టార్ ప్లేయర్‌కు 2027 వరల్డ్ కప్‌లో నో ప్లేస్.. ఎందుకంటే..?

ఇంగ్లాండ్ నమోదు చేసిన చెత్త రికార్డులు..

ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్‌లో ఘోర పరాజయంతో పాటు కొన్ని అవమానకర రికార్డులను మూటగట్టుకుంది.

ఏడేళ్ల తర్వాత ఎడ్జ్‌బాస్టన్‌లో ఓటమి: 2015 తర్వాత ఈ మైదానంలో ఆడిన ఎనిమిది వన్డేల్లో ఇంగ్లాండ్‌కు ఇదే మొదటి ఓటమి. గతంలో 2014లో కూడా భారతే ఇక్కడ ఇంగ్లాండ్‌ను ఓడించింది.

భారత్‌పై వరుసగా ఆరో ఓటమి: వన్డే క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్‌పై భారత్‌కు ఇది వరుసగా ఆరో విజయం. ఇంగ్లాండ్‌పై టీం ఇండియాకు ఇదే అత్యంత సుదీర్ఘమైన విజయాల పరంపర.

2023 ప్రపంచకప్ తర్వాత అత్యధిక ఓటములు: గత ప్రపంచకప్ తర్వాత ఇంగ్లాండ్ జట్టు ఏకంగా 20 వన్డే మ్యాచుల్లో ఓడిపోయి బంగ్లాదేశ్‌తో కలిసి అగ్రస్థానంలో నిలిచింది.

భారత్ vs ఇంగ్లండ్: తొలి వన్డేలో నమోదైన రికార్డులు ఇవే..

ఇంగ్లండ్ తరపున తన తొలి వన్డే అర్ధ సెంచరీ సాధించిన అత్యంత వయసు పైబడిన బ్యాట్స్‌మెన్స్..

38 సంవత్సరాల 245 రోజులు – జెఫ్రీ బాయ్‌కాట్

36 సంవత్సరాల 135 రోజులు – లియామ్ డాసన్

35 సంవత్సరాల 331 రోజులు – వేన్ లార్కిన్స్

35 సంవత్సరాల 39 రోజులు – మైక్ బ్రియర్లీ

ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డేలలో భారత్ తరపున అత్యధిక వికెట్లు (IND vs ENG)

31 వికెట్లు – జస్ప్రీత్ బుమ్రా

30 వికెట్లు – రవీంద్ర జడేజా

28 వికెట్లు – భువనేశ్వర్ కుమార్

27 వికెట్లు – మదన్ లాల్

26 వికెట్లు – మహమ్మద్ షమీ

భారతదేశం తరపున వన్డేలలో 150 వికెట్లు సాధించడానికి అతి తక్కువ బంతులు తీసుకున్న బౌలర్

4070 బంతులు – మహమ్మద్ షమీ

4513 బంతులు – కుల్దీప్ యాదవ్

4605 బంతులు – జస్ప్రీత్ బుమ్రా

5027 బంతులు – అజిత్ అగార్కర్

5131 బంతులు – ఇర్ఫాన్ పఠాన్

వన్డేలలో భారతదేశం తరపున 50+ పరుగులు, 4+ వికెట్లు సాధించిన ఆటగాళ్లు..

కృష్ణమాచారి శ్రీకాంత్ – 70 పరుగులు మరియు 5/27 vs న్యూజిలాండ్, విశాఖపట్నం (1988)

సచిన్ టెండూల్కర్ – 141 పరుగులు మరియు 4/38 vs ఆస్ట్రేలియా, ఢాకా (1998)

సౌరవ్ గంగూలీ – 130 పరుగులు మరియు 4/21 vs శ్రీలంక, నాగ్‌పూర్ (1999)

సౌరవ్ గంగూలీ – 71 పరుగులు మరియు 5/34 vs జింబాబ్వే, కాన్పూర్ (2000)

యువరాజ్ సింగ్ – 118 పరుగులు మరియు 4/28 vs ఇంగ్లాండ్, ఇండోర్ (2008)

యువరాజ్ సింగ్ – 50 పరుగులు మరియు 5/31 vs ఐర్లాండ్, బెంగళూరు (2011)

హార్దిక్ పాండ్యా – 71 పరుగులు మరియు 4/24 vs ఇంగ్లాండ్, మాంచెస్టర్ (2022)

అక్షర్ పటేల్ – 51 నాటౌట్ మరియు 4/62 vs ఇంగ్లాండ్, ఎడ్జ్‌బాస్టన్ (2026)

అత్యధిక ODI మ్యాచ్‌లు ఓడిపోయినవి (మ్యాచ్‌లు) (CWC 2023 తర్వాత)

20 – ఇంగ్లాండ్ (30)*

20 – బంగ్లాదేశ్ (35)

19 – వెస్ట్ ఇండీస్ (34)

17 – దక్షిణాఫ్రికా (29)

15 – పాకిస్తాన్ (32)

14 – ఆస్ట్రేలియా (28)

12 – జింబాబ్వే (20)

11 – శ్రీలంక (36)

10 – న్యూజిలాండ్ (34)

9 – ఆఫ్ఘనిస్తాన్ (23)

8 – భారతదేశం (27)

7 – ఐర్లాండ్ (14)

300 వన్డే ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్స్..

14,802 పరుగులు – విరాట్ కోహ్లీ

12,015 పరుగులు – సచిన్ టెండూల్కర్

11,731 పరుగులు – రోహిత్ శర్మ (278 ఇన్నింగ్స్‌లలో)

11,363 పరుగులు – సౌరవ్ గంగూలీ

11,363 పరుగులు – రికీ పాంటింగ్

11,227 పరుగులు – జాక్వెస్ కల్లిస్

10,506 పరుగులు – రాహుల్ ద్రవిడ్

10,218 పరుగులు – కుమార సంగక్కర

10,216 పరుగులు – తిలకరత్నే దిల్షాన్

10,039 పరుగులు – ఇంజమామ్-ఉల్-హక్

వన్డే క్రికెట్‌లో సుదీర్ఘ కెరీర్..

22 సంవత్సరాల 91 రోజులు – సచిన్ టెండూల్కర్

21 సంవత్సరాల 184 రోజులు – సనత్ జయసూర్య

21 సంవత్సరాల 133 రోజులు – బ్రెండన్ టేలర్

20 సంవత్సరాల 272 రోజులు – జావేద్ మియాందాద్

20 సంవత్సరాల 187 రోజులు – సీన్ విలియమ్స్

19 సంవత్సరాల 337 రోజులు – క్రిస్ గేల్

19 సంవత్సరాల 245 రోజులు – షోయబ్ మాలిక్

19 సంవత్సరాల 21 రోజులు – రోహిత్ శర్మ*

18 సంవత్సరాల 352 రోజులు – అరవింద డి సిల్వా

భారతదేశం తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ కెరీర్..

24 సంవత్సరాల 1 రోజు – సచిన్ టెండూల్కర్

19 సంవత్సరాల 310 రోజులు – మొహిందర్ అమర్‌నాథ్

19 సంవత్సరాల 21 రోజులు – రోహిత్ శర్మ*

19 సంవత్సరాలు – లాలా అమర్‌నాథ్

18 సంవత్సరాల 250 రోజులు – ఆశిష్ నెహ్రా

18 సంవత్సరాల 214 రోజులు – ఎస్. వెంకటరాఘవన్

18 సంవత్సరాల 191 రోజులు – అనిల్ కుంబ్లే

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us