Virat Kohli: అడిలైడ్‌లో బంగ్లాదేశ్‌‌కు ఓటమి పక్కా.. ఇదిగో విరాట్ కోహ్లీ రికార్డులే అందుకు సాక్ష్యం..

T20 World Cup 2022, IND vs BAN: టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ ఆశలపై విరాట్‌ కోహ్లీ అడిలైడ్‌‌లో నీళ్లు చల్లేందుకు సిద్ధమమయ్యాడు. ఇక్కడి మైదానంలో కోహ్లీ రికార్డులు చూస్తే మాత్రం.. బంగ్లా పులులకు భయంతో వణికిపోవాల్సిందే.

Virat Kohli: అడిలైడ్‌లో బంగ్లాదేశ్‌‌కు ఓటమి పక్కా.. ఇదిగో విరాట్ కోహ్లీ రికార్డులే అందుకు సాక్ష్యం..
Virat Kohli

Updated on: Nov 02, 2022 | 2:19 PM

దక్షిణాఫ్రికాపై ఓటమి తర్వాత భారత జట్టు నేడు బంగ్లాదేశ్‌తో తలపడనుంది. భారత్‌తో పోలిస్తే బంగ్లాదేశ్ జట్టు అంత బలంగా కనిపించడం లేదు. అంతమాత్రానా టీమిండియా ఏ జట్టునూ తేలికగా తీసుకోదు. భారత్ తదుపరి రౌండ్‌కు చేరుకోవాలంటే, ఈ రోజు గెలవడం చాలా ముఖ్యం. టీ20 ప్రపంచ కప్‌లో భారత్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడగా అందులో రెండింట్లో విజయం సాధించింది. బంగ్లాదేశ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఈ రోజు విజయంపై ఇరుజట్లు తీవ్రంగా పోరాడనున్నాయి. విరాట్ కోహ్లీకి అడిలైడ్ అంటే చాలా ఇష్టం. ఇక్కడి మైదానంలో దూకుడు చూపించిన కోహ్లీ.. మూడు సెంచరీలతో సత్తా చాటాడు. మరోసారి ఇదే జరిగితే T20 ప్రపంచ కప్ 2022 నుంచి బంగ్లాదేశ్ నిష్క్రమణకు ముహూర్తం ఖారారైనట్లే.

ఈరోజు అడిలైడ్‌లో జరిగే మ్యాచ్ భారత్, బంగ్లాదేశ్‌లకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది సెమీ-ఫైనల్‌కు వెళ్లాలనే ఆశను మరింత బలపరుస్తుంది. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అడిలైడ్‌లో సత్తా చాటాలని కలలు కంటున్నాడు. అయితే విరాట్‌ కోహ్లి రికార్డులను చూస్తే మాత్రం.. బంగ్లా పులులు వణికిపోవాల్సిందే. అవేంటో ఓసారి చూద్దాం..

అడిలైడ్‌లో ‘విరాట్ కోహ్లీ’ దూకుడు..

అది ఎందుకు అని ఇప్పుడు తెలుసుకోండి. విరాట్ కోహ్లి యొక్క అడిలైడ్ వాలా లవ్ ఈ రోజు T20 ప్రపంచ కప్ 2022లో బంగ్లాదేశ్ ఆశలను మరుగున పడుతుందని ఎందుకు చెప్తున్నాము? అంటే అడిలైడ్ ఓవల్‌లో అతని క్రాకింగ్ రికార్డ్. అతని కంటే ముందు ఏ బ్యాట్స్‌మెన్ పేరుతోనూ సంబంధం లేని రికార్డులు. అడిలైడ్ ఓవల్‌లో విరాట్ కోహ్లి భీకర ఫామ్‌కు ఇప్పటి వరకు 3 జట్లు బలి అయ్యాయి. మరియు, నేడు బంగ్లాదేశ్ ఆ ఎపిసోడ్‌లో నాల్గవ జట్టు కావచ్చు.

ఇవి కూడా చదవండి

అడిలైడ్‌లో ఆడిన 9 మ్యాచ్‌ల్లో విరాట్ 5 సెంచరీలు చేశాడు. అడిలైడ్ ఓవల్‌ మైదానంలో విరాట్ కోహ్లి భీకర ఫామ్‌కు ఇప్పటి వరకు 3 జట్లు బలయ్యాయి. నేడు బంగ్లాదేశ్ ఆ ఎపిసోడ్‌లో నాల్గవ జట్టు కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

విరాట్ కోహ్లీ ఇక్కడ 9 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 5 సెంచరీలు సాధించాడు. ఒకే వేదికపై బ్యాట్స్‌మెన్ చేసిన అత్యధిక సెంచరీలు ఇవే. ఈ సమయంలో కోహ్లీ 70.25 సగటుతో 843 పరుగులు చేశాడు. ఇందులో ఆస్ట్రేలియాపై అత్యధికంగా 7 మ్యాచ్‌లు ఆడాడు. పాకిస్తాన్, శ్రీలంక టీంలతో చెరో మ్యాచ్ ఆడాడు.

అడిలైడ్‌లో విరాట్ ఆడిన 9 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 4 టెస్టులు, 4 వన్డేలు, 1 టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి. ఇందులో అడిలైడ్‌పై టెస్టుల్లో 509 పరుగులు, వన్డేల్లో 244 పరుగులు, టీ20ల్లో 90 పరుగులు ఉన్నాయి. టీమిండియా 2016 లో ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో చివరి T20 మ్యాచ్‌ని ఆడింది. ఇందులో కోహ్లీ అజేయంగా 90 పరుగులు చేసి జట్టుకు 37 పరుగుల తేడాతో విజయాన్ని అందించాడు.

విరాట్‌ను అడ్డుకోవడం బంగ్లాదేశ్‌కు కష్టమే..

ఇక్కడ విరాట్ కోహ్లీ చేతిలో ఆస్ట్రేలియా, పాకిస్థాన్, శ్రీలంక జట్లు ఓడిపోయాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ వంతు రానుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బంగ్లాదేశ్‌కు 2015 ప్రపంచకప్‌లో ఇక్కడ ఒకే ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన అనుభవం ఉంది. ఇప్పుడు ఈ అనుభవం ఆధారంగా అడిలైడ్‌లో విరాట్ కోహ్లీని ఆపడం బంగ్లాదేశ్‌కు కష్టంగానే నిలవనుంది. మరి, అలా చేయకపోతే సెమీఫైనల్‌కు వెళ్లే అవకాశాలు కూడా దెబ్బతింటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.