Virat Kohli: కోహ్లీ సరసన చేరిన మరో రికార్డ్.. టాప్‌ 10లో కేవలం ఇద్దరే భారత ప్లేయర్లు.. అదేంటంటే?

|

Dec 18, 2022 | 6:55 AM

Virat Kohli's Records: భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కూడా ఫీల్డింగ్‌లో చురుకుగా కనిపిస్తాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఎనిమిదో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.

Virat Kohli: కోహ్లీ సరసన చేరిన మరో రికార్డ్.. టాప్‌ 10లో కేవలం ఇద్దరే భారత ప్లేయర్లు.. అదేంటంటే?
Ind Vs Ban 1st Test virat kohli
Follow us on

Virat Kohli’s Records: భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కొత్త రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లి ఎనిమిదో స్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో, నాల్గవ రోజు జకీర్ హసన్ క్యాచ్‌ను కోహ్లీ క్యాచ్ పట్టాడు. దీంతో కోహ్లీ పేరుతో 291 క్యాచ్‌లు అంతర్జాతీయ క్రికెట్‌లో నమోదయ్యాయి. కోహ్లీ 482 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 572 ఇన్నింగ్స్‌లలో ఈ క్యాచ్‌ల‌ను అందుకున్నాడు. ఇప్పటి వరకు అత్యధిక క్యాచ్‌లు పట్టిన టాప్-10 ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

టాప్-10లో ఇద్దరు భారత ఆటగాళ్లు..

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన టాప్-10 ఆటగాళ్లలో విరాట్ కోహ్లీతో సహా ఇద్దరు ఆటగాళ్ల పేర్లు ఉన్నాయి. ఇందులో కోహ్లితో పాటు భారత మాజీ బ్యాట్స్‌మెన్, ప్రస్తుత భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేర్లు ఉన్నాయి. టాప్-10 జాబితాలో రాహుల్ ద్రవిడ్ ఐదో స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 8వ స్థానంలో ఉన్నాడు. రాహుల్ ద్రవిడ్ తన అంతర్జాతీయ కెరీర్‌లో 509 మ్యాచ్‌ల్లో 571 ఇన్నింగ్స్‌ల్లో 334 క్యాచ్‌లు అందుకున్నాడు. ఇందులో అతని ఒక్కో ఇన్నింగ్స్ క్యాచ్ శాతం 0.58గా ఉంది. కోహ్లీ 572 ఇన్నింగ్స్‌ల్లో 291 క్యాచ్‌లు పట్టాడు.

టాప్-10 లిస్ట్ ఇదే..

1. మహేల జయవర్ధనే (శ్రీలంక) – 652 అంతర్జాతీయ మ్యాచ్‌లు, 768 ఇన్నింగ్స్‌లు – 440 క్యాచ్‌లు.

ఇవి కూడా చదవండి

2. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 560 అంతర్జాతీయ మ్యాచ్‌లు, 717 ఇన్నింగ్స్‌లు – 364 క్యాచ్‌లు.

3. రాస్ టేలర్ (న్యూజిలాండ్) – 450 అంతర్జాతీయ మ్యాచ్‌లు, 546 ఇన్నింగ్స్‌లు – 351 క్యాచ్‌లు.

4. జాక్వెస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా) – 519 అంతర్జాతీయ మ్యాచ్‌లు, 664 ఇన్నింగ్స్‌లు – 338 క్యాచ్‌లు.

5. రాహుల్ ద్రవిడ్ (భారత్) – 509 అంతర్జాతీయ మ్యాచ్‌లు, 571 ఇన్నింగ్స్‌లు – 334 క్యాచ్‌లు.

6. స్టీఫెన్ ఫ్లెమింగ్ (న్యూజిలాండ్) – 396 అంతర్జాతీయ మ్యాచ్‌లు, 480 ఇన్నింగ్స్‌లు – 306 క్యాచ్‌లు.

7. గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా) – 347 అంతర్జాతీయ మ్యాచ్‌లు, 454 ఇన్నింగ్స్‌లు – 292 క్యాచ్‌లు.

8. విరాట్ కోహ్లీ (భారత్) – 482 అంతర్జాతీయ మ్యాచ్‌లు, 572 ఇన్నింగ్స్‌లు – 291 క్యాచ్‌లు ఇప్పటివరకు*

9. మార్క్ వా (ఆస్ట్రేలియా) – 372 అంతర్జాతీయ మ్యాచ్‌లు, 488 ఇన్నింగ్స్‌లు – 289 క్యాచ్‌లు.

10. బ్రియాన్ లారా (వెస్టిండీస్) – 430 అంతర్జాతీయ మ్యాచ్‌లు, 537 ఇన్నింగ్స్‌లు – 284 క్యాచ్‌లు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..