బంగ్లాదేశ్‌తో జరుగుతున్న 2వ టెస్టు మ్యాచ్‌లో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ అద్భుత క్యాచ్ పట్టాడు. కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో నాలుగో రోజు సిరాజ్ అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శించాడు. రవిచంద్రన్ అశ్విన్ వేసిన 56వ ఓవర్ చివరి బంతిని షకీబ్ అల్ హసన్ మిడ్ ఆఫ్ సర్కిల్ మీదుగా భారీ షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడే ఉన్న సిరాజ్ గాల్లోకి ఎగిరి ఎడమ చేతితో అద్భుతంగా బంతిని అందుకున్నాడు. ఇప్పుడు మహ్మద్ సిరాజ్ అందుకున్న ఈ అద్భుతమైన క్యాచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు సిరాజ్ మియాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే శుక్రవారం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టు మళ్లీ ఏకంగా నాలుగో రోజు ఆట బ్యాటింగ్ కొనసాగించింది. వర్షాల కారణంగా 2వ, 3వ ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాదేశ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు ఆలౌట్ చేసిన టీమిండియా ఆపై మెరుపు బ్యాటింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. నాలుగో రోజు ఆటలో కేవలం 35 ఓవర్లలో 285 పరుగులకు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి 52 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. ఆ తర్వాత మళ్లీ బంగ్లాదేశ్ ను దెబ్బ తీసింది. రెండవ ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీసి విజయానికి బాటలు వేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఇంకా 26 పరుగులు వెనకబడి ఉంది. ఈ టెస్ట్ మ్యాచ్ లో ఇంకా ఒక్క రోజు ఆట మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా బంగ్లాదేశ్ ను ఆలౌట్ చేయడంపై భారత బౌలర్లు దృష్టి సారించాలి.
Another outstanding catch and this time it is @mdsirajofficial who picks up a tough one to dismiss Shakib Al Hasan.
Live – https://t.co/JBVX2gyyPf… #INDvBAN@IDFCFIRSTBank pic.twitter.com/RbKZKDdGAW
— BCCI (@BCCI) September 30, 2024

యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
షాద్‌మన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో (WK), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్ (wk), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..